పాక్ చర్చలు


కురేషీ ఎందుకు అలా ప్రవర్తించాడో ఆలోచిద్దాం.ఆ దేశం ప్రస్తుతం ఉన్న పరిస్థితి చాలా నీచమైనది. ఇలాగే కొంత కాలం గడిస్తే అమెరికా సైన్యం ఎప్పుడైనా అక్కడ బస చేయటం ప్రారంభించగలదనే సూచనలు అమెరికా వారు నిర్ద్వంద్వంగా చెప్పి యున్నారు.భారత దేశం నుంచి ఒక టీము ఎందుకు అక్కడికి వెళ్లిందో అని ఆలోచిస్తే అసలు పాకిస్తాన్ తో ఏమి మాట్లాడితే ఏమొస్తుందని వెళ్లారన్నది పెద్ద ప్రశ్న!అది అలా ఉండగా హోం సెగట్రీ పిళ్లై గారు 26/11 వ్యవహారమంతా  ఐ.ఎస్. ఐ పనేనని ముచ్చటించటం వారికి కొన్ని సిగ్నళ్లు పంపింది.ఆట అర్థం చేసుకోకుండా ఎప్పుడూ వాగే వాగుడు -కశ్మీర్, సియాచెన్ గ్లేషియర్ గురించి వాగుతూ ఉండగా కురేషీకి ఎక్కడో అనుమానం వచ్చింది. అసలు వీళ్లు సరదాగా ఒక ‘టాక్స్ ‘ కి వచ్చినట్లు చూపించటానికి వచ్చారే కానీ ఇక్కడ ఎవరి శృతులూ కలవవని తెలుసుకున్నాడు.కృష్ణ గారు మొబైల్ లో మాట్లాడుతున్నారని, మధ్యలో అనవసరంగా ఆవులించాడని (ఇది నేనంటున్నది)ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ చెబుతునాడు.సామన్యంగా విదేశీ మంత్రులు చర్చ చేసుకుంటున్నప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అసభ్యకరంగా ఉంటుంది.ఆ దేశం లో నడుస్తున్న ప్రభుత్వం,ఏడుస్తున్న విధానాలు,మూలుగుతున్న జనం నేపథ్యంలో ఈ కురేషీ నుంచి ఇంతకంటే ఆశించక్కరలేదు.

అసలు చర్చలకు ఎందుకు వెళ్లారని బి.జె.పి అడిగింది. అందరికీ అలాగే కనిపిస్తుంది.
ఉపయోగమేమీ ఉండదని అందరికీ తెలుసు…

పాకిస్తాన్ అనే దేశం చైనా దగుల్ బాజీ,అమెరికా ,అదివరకు రషియా మధ్య బేలెన్స్ ఆఫ్ పవర్ వ్యవహారం ఇలా భౌగోళికంగా సాగే చెత్త మధ్య ఒక చెత్త దేశంగా నిలబడి ఎన్ని యుగాలు గడచినా తనకంటూ ఒక ఆర్థికపరమైన అస్తిత్వాన్ని తెచ్చుకోలేని దేశం.ప్రజస్వామ్యం ఇక్కడ మన్నదు. మనకు పక్కలో బల్లెమైన ఈ ప్రాంతానికి స్వావలంబన లేనప్పుడు అంతర్రాష్ట్రీయంగా ఉన్న పరిస్థితులలో పాకిస్తాన్ ను కలిపి నీ బ్రతుకింతేనని గుర్తు చేయటం తప్ప చర్చర్చలూ, వ్యవహారాలలో మరో అర్థం ఎన్నడూ కనిపించదు.

అదుగోండి సార్, వెళ్లాం, మాట్లడాం, వాళ్లు ఎప్పుడూ ఇంతే!ఆ కోవలో చేసిన చర్య అయితే సరేనని మన ప్రభుత్వాన్ని స్రిపెట్టుకోవచ్చు.ఒక బృహత్ పథకంలో ఇది ఒక చిన్న భాగం అని అనుకోటానికి మన ప్రభుత్వం దగ్గర అంత సత్తా ఏమీ లేదు.

ప్రపంచ దేశాలు చర్చలలోంచి ఏదో బయటకి వస్తుందనీ, వచ్చినా మల కాగలవనీ ఏ రోజూ భావించే పరిస్థితి లేదు.

జరిగిందేదో జరిగిపోయింది. ఎస్.ఎం.కృష్ణా గారు ఇంటికొచ్చాక చెప్పిన మాట కూడా బాగుంది. ఈ కురేషీ మాటలను పెద్దగా పట్టించుకోను …(ఇంతకంటే సీరియస్ విషయాలు చాలా ఉన్నాయి అన్నారాయన). ఒక విధంగా  చేతలలోనూ, మాటలతోనూ కావాలని కురేషీని అపహాస్యం చేసినట్లే!అతను అందుకు అలా మాట్లాడవలసి వచ్చింది.

అవన్నీ అలా ఉంచి ఈ చర్య తరువాత మన ప్రభుత్వం ఏ నీతిని అవలంబిస్తుంది అనేది వేచి చూడాలి.మన దౌర్భాగ్యం ఏమిటంటే ఏది జరిగినా అదుగో అందరూ చూడండి…అనే నీతి తప్ప పాకిస్తాన్ కు సక్ష్యాధారాలు ఇవ్వటమేమిటి? అది అడగటమేమిటి?

దాడి చేసి పి.ఒ.కేలోని స్థావరాలను ముట్టడించే పని అయినా (అమెరికాతో కలసి చిన్న  ఆలోచన చేసి)తలపెట్టందే మామూలు మనిషికి  మనలో ఏదైనా సత్తా ఉన్నదని అనిపించదు.పోనీ ఇది అంతర్జాతీయ విషయం అనుకుంటే ఎంత జరిగినా ఏమీ చేయలేమన్నది చైనా కూడా తన డైరీలో నోటు చేసుకుంటోంది.

స్వయంగానూ ఏదీ లేదు, ఇతర దేశాల మధ్య దీనిని బిగించే విషయంలోనూ పెద్దగా మనం సాధించిందీ లేదు.

ఈ చర్చలు అనే ఘటన పాకిస్తాన్ ను నువ్వింతేనని తేల్చి చెప్పటం అయితే మేమూ ఇంతేనని మనకి చెప్పటం అనిపించింది.

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: