ఫొటో జవాబు


అజబున్ నెషా దెవాన్. ఈ నేపాలీ వనిత సౌదీ అరేబియా నుండి వెన్నెముక విరగకొట్టుకుని తిరిగి వచ్చింది. ఈమెను అక్కడి ఇంటి యజమాని (మహిళ) రెండవ ఫ్లోర్ నుండి తోసేసింది. ఉద్యోగం కోసం అక్కడికి వెళ్లిన ఈమె విపరీతమైన మానసిక వేదనతో తిరిగి వచ్చింది.
నేపాలీ వుమెన్ మైగ్రెంట్ వర్కర్స్ మీద జరిగే దాడులు చాలా దారుణంగా ఉన్నాయి. విదేశీయులు చాలా మంది ఇలా వేదనకు గురి అవటం మనం వింటాం. భారతీయులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. సౌదీ వారు భారతీయులైన పని వాళ్లను ‘డర్టీ ఇండియన్ ‘ అని పిలవటం సర్వ సామాన్యం…
ముఖ్యంగా నేపాలీ మహిళలు గల్ఫ్ లో పడుతున్న శారీరిక హింస సామాన్యమైనది కాదు. ప్రాణాలు తీసేస్తామనే బెదిరింపులు కూడా ఎక్కువే.
లక్షకు పైగా వీరు లెబనన్, సౌదీ, యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్, కటార్,బహ్రెయిన్,ఒమాన్ వంటి దేశాలలో ఉన్నారు.  అయినా ప్రతి రోజూ 800 కుటుంబాలు (నేపాల్ నుంచి) గల్ఫ్ కు వలస వెళుతున్నారని అంచనా.
అన్ని సమస్యలూ డబ్బు దగ్గరే! నేపాల్ జి.డి.పి లో అయిదులో ఒక వంతు ఈ విదేశీ రెమిటెన్స్ నుంచి వస్తోంది! వ్యవసాయ రంగం 32 శాతం ఉండగా దాని తరువాత ఆర్థిక వ్యవస్థ ఈ విదేశీ నౌకరీల మీద ఆధారపడి ఉండటం శోచనీయం. నేపాల్ ప్రభుత్వం సత్వరమే అంతర్జాతీయంగా ఒక విధానాన్ని తెచ్చే ప్రయత్నం చేయాలి. మన దేశం కూడా జత కావాలి. పడ్డ వాళ్లు చెడ్డ వారు కారు. మానవ హక్కుల గురించి నేపాల్ మావోయిస్టులు ఏమి చేస్తున్నారో కనుక్కోవచ్చా?
పనికోసం వచ్చిన మైగ్రెంట్ మహిళలకు భౌగోళికంగా కొన్ని హక్కులున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఆయా దేశాలతో కొన్ని ఒప్పందాలు చేసుకోవటం మొదటి పని. ఇలా ప్రవర్తించిన వారిని ఆ దేశ చట్టం ప్రకారమే కాకుండా ఈ దేశంలోని చట్టం ప్రకారం కూడా కఠినాతి కఠినంగా శిక్షించే ప్రక్రియను ప్రారంభించాలి.
కాయక్ష్టానికి దిగిన వారు ఏ పరిస్థితిలో అలాంటి నిర్ణయం తీసుకున్నారోనని యోచించి గౌరవించి మసలుకోవటం మానవత్వం లోని మొదటి పాఠం. ఇది ఒక దేశానికి కాదు.  సమస్త మానవాళికి వర్తిస్తుంది.

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: