ఈ భాష అర్థం కాదు…


‘ A riot is at the bottom, the language of the unheard’~Martin Luther King

కొన్ని తరాలు గడిచాయి.ఋతువులు దొరలిపోయాయి…

ప్రతి సంవత్సరం వర్షాలకోసం అలమటిస్తాం.అవి కురుస్తున్నప్పుడు నీటి స్టోరేజ్ సరైన చోట్ల సరిగ్గా ఉన్నదా లేదా అని ముక్కు మీద వేలేసుకుంటాం.

ఈ ఐ.ఎ.ఎస్ దొరబాబులూ,ఈ కాంట్రాక్టర్లు, ఈ ఇంజనియర్లు ప్రతి ఏటా ఇంతేనా?

పంజాబ్, హరియాణా, చండీగఢ్  ప్రాంతాలలో మళ్లీ పాత కథే! అతివృష్టి వలన నష్టపోతున్నారు జనం.సాగు నీటి ప్రాజెక్టులు ఏమవుతున్నాయి? అంత దూరం అక్కరలేదు.గత సెప్టెంబర్ లో మహబూబ్ నగర్, కర్నూల్ ప్రాంతాలలో ఏమయిందో చూసాం. వరద రిసర్వాయర్లు ఏర్పాటు ఎందుకు చేయలేదు అని ప్రధాని ఆయన టూరులో అడిగారు. నేనూ అడుగుతున్నాను, ఏడాది అవుతోంది.రిసర్వాయర్లలోని సిల్టు విషయంలో ఈ అధికారులు ఈ సంవత్సరం లో ఏమి చేసారు? అడిగే వారు లేరు!…

ప్రకృతికి కోపం.స్వాతంత్ర్యానికి వంద సంవత్సరాలయినా ఈ వ్యవస్థ ఇంతే! ఈ అధికారులు ఇంతే!

అ…అమ్మా కంటే ఆ…ఆకలి అనే పదాన్నిముందు నేర్చుకున్న దేశం.ఆకలిని మించిన నిజం లేదు.అదే సత్యం! ఈ ఏడాదికి చూద్దాం మరో అవకాశాన్ని ఇద్దాం  అనుకుంటూ గరళాన్ని దిగమింగి స్థాణువులుగా బ్రతికేస్తున్న శివులం! అందచందాలా దేశం, ఎంతో సుందర దేశం.రంగు రంగులా భారతదేశం,చిరుగు చెంగులా భారతి వేషం…సుందరమైన త్రివర్ణపతాకానికి సుందరంగా సెల్యూట్ కొడుతున్నాం!

సత్య శివ సుందరం…ఈ భాష అర్థం కాదు.ప్రకృతిలో ఏ వైపరీత్యమూ లేదు.

యుగాలు గడిచినా దేశం వైపు ఒక చూపు కూడా చూడలేని ఈ వ్యవస్థను కడుపులో దాచుకునేందుకు నిండా గుడ్డ కప్పి ఈ ప్రకృతి ముంచేస్తోందా? తన క్రోధాగ్నిని మల మలా మాడే ఎండలో మాట్లాడకుండా చూపిస్తోందా?

మన మధ్య ఈ భాషలు వద్దు! అది పంజాబవనీ,కశ్మీరవనీ,నా రాష్ట్రమవనీ, అది ఆంధ్ర అవనీ, తెలంగాణ కానీ…నేను స్పందించను. మామూలు మనిషికోసం ప్రకంపిస్తాను.ఈ ప్రచండాగ్ని నన్ను కాల్చి బూడిద చేయనీ, నేను పన్నీరులా పైకి లేస్తాను!
ఈ జలప్రళయం నన్ను ముమ్మాటికీ ముంచేయనీ…నేను బడబాగ్నిలా ప్రజ్వలిస్తాను! నిజమే చెబుతాను…

ఏమిటో…ఈ భాష అర్థం కాదెందుకో!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “ఈ భాష అర్థం కాదు…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: