‘కార్పొరేట్’ (1) చిత్రం మీద వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు


2006 లో విడుదలయిన హిందీ చిత్రం ఇది.సాఫ్ట్ డ్రింక్సులలో పెస్టిసైడ్లు కలుపుతున్నారన్న వార్తలు ప్రబలంగా వచ్చి వాటి వ్యాపారం మీద హడావుడి చేసిన రోజులు.ఈ  రోజుకీ వాటిలో ఉందో లేదో నిర్ధారణగా ఎవరూ చెప్పరు.రోజులు అలా గడిచిపోతూ ఉంటాయి.వ్యాపారం, రాజకీయం…అన్నీ అలా చరైవేతి, చరైవేతి…

వ్యాపార సంస్థల పోటీల మధ్య కొన్ని పాత్రలను చక్కగా చిత్రీకరించారు దర్శకుడు.నరనరాలకీ వ్యాపార ధోరణి పాకేసిన కుటుంబాలివి.కార్పొరేట్ పేరుతో చేసేదంతా నీచమైన వ్యాపారం. కబడ్డీ ఆట లాగా ఎప్పుడు ఎవరిని కాలు పట్టి లాగేద్దామా లేక ఎవరిని బలవంతంగా గంజేద్దామా ఇంతే ఈ ప్రపంచం.తోడుగా రాజకీయ నాయకులు చక్కని మసాలా జల్లి మరింత రసవత్తరంగా ఈ ఆట ఆడిస్తూ ఉంటారు.

సెహ్ గల్ సంస్థ అధినాయకుడు వినయ్ సెహ్ గల్ (రజత్ కపూర్).మార్వాహ్ సంస్థకు రాజు ధర్మేశ్ (రాజ్ బబ్బర్).  మహరాష్ట్ర ప్రభుత్వం పి.ఎస్.యు లను కార్పొరేట్ కు అమ్మేసే టెండర్ పిలుస్తుంది. మంత్రిగారు గులాబ్ రావ్ ఇంగ్లె (వినయ్ ఆప్తె) ఇద్దరినీ నమ్మించి చివరికి ధర్మేశ్ దగ్గర ఎక్కువ సంఖ్యలో కోట్లు,ఒక సినీ అమ్మయితో ఒక రాత్రి సంపాదించి టెండర్ అతనికి ఇచ్చేస్తాడు.ధర్మేశ్ అక్కడ మింట్ బేస్ తో కూల్ డ్రింకు ఫాక్టరీ తలపెట్టి ముందుగా కేవలం మినరల్ వాటర్ తయారు చేస్తామని చెబుతాడు.

ఈ లోపల వినయ్ ఒక ఫారిన్ సంస్థతో టై అ అవుతాడు.పబ్లిక్ ఇస్స్యూ ఇచ్చే ముందు ఈ సమస్య ఎదురవుతుంది.వినయ్ దగ్గర పని చేసే నిశి (బిపాషా బసు) ధర్మేశ్ దగ్గర పని చేస్తూ తనని కోరుకున్న పర్వేజ్ (సందీప్ మెహతా) ను బురిడీ కొట్టించి ఆ పానీయాల ప్రాజెక్ట్ తాలూకు వివరాలను సేకరిస్తుంది. దాని ఆధారంగా వినయ్ తన బావమరిది రితేశ్ (కే కే మెనన్) ఆధ్వర్యంలో నలభై రోజులలో జస్ట్ చిల్ అనే కూల్ డ్రింకు ప్రాజెక్టు సిధ్ధం చేయిస్తాడు. లైసెన్స్ లేకపోయినా , ఆ నీళ్లల్లో పెస్టిసైడ్లు ఉన్నయని తెలిసినా ముందుకు వెళ్లిపోతాడు.ఈ దెబ్బను తట్టుకోవటానికి ధర్మేశ్ వినయ్ కంపనీలోని వ్యక్తిని దగ్గరకు చేరదీసి (అతనికి రితేశ్ బదులు సి.ఇ.ఒ రావాల్సి ఉన్నది) స్వంత వ్యాపారానికి డబ్బు ఇప్పించి పెస్టిసైడ్ వ్యవహారం గురించి తెలుసుకుని మీడియా, రాజకీయ రంగం…అన్ని చోట్లా నానా హంగామా చేసి వినయ్ ను బజారుకీడుస్తాడు.

ఆ  వ్యవహారాన్నంతా తనే చేసినట్లు అఫిడవిట్ మీద సంతకాలు చేసి వినయ్ బదులు నిశి జైలుకు వెళుతుంది.రితేశ్ కు తెలియకుండా ధర్మేశ్,వినయ్ ల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి, రాష్ట్ర మంత్రి సమక్షంలో ఒప్పందం కుదిరి తిరిగి ఇద్దరి వ్యాపారాలు బాగు చేసుకోవటం జరుగుతుంది.దీనికి విదేశీ కంపనీ వాడి గొడవ కూడా ప్రోద్బలం అవుతుంది.రితేశ్ అలిగి 48 గంటలలోపు నిశి ని బయటకు తేకపోతే మీడియా ముందు కూర్చుని మాట్లాడతానంటాడు.అతనికి ఆ అవకాశం రాదు. పై అంతస్తు నుండి మందులో ఉన్నప్పుడు పడిపోయి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతారు కానీ  ఎవరో కాలింగ్ బెల్ కొట్టినట్లు మనకి కనిపిస్తుంది…

నిశి  బెయిల్ మీద విడుదలయి కేసు పోరాడుతున్నట్లు చూపించి చిత్రాన్ని ముగిస్తాడు దర్శకుడు.
బిపాషా , కే కే మెనన్ పాత్రపోషణలు బాగున్నాయి.సందీప్ మెహతా కూడా బాగా చేసాడు.ఈ చిత్రానికి దర్శకుడు మధుర్ భండార్ కర్.ఈయన అజయ్ మోంగా,మనోజ్ త్యాగీలతో కలసి చిత్రానికి స్క్రిప్ట్ రచించినట్లు తెలుస్తోంది.

~~~***~~~

కథ ఉత్కంఠఓ సాగినా కళాత్మకత లేకపోవటం వలన పేపర్లలో చదివింది తెరకెక్కించారు అంతే కదా? అనిపిసుంది. దర్శకుడు ఏంబియన్స్ విషయంలో మంచి కృషి చేసాడు.కాకపోతే ఈ పానీయాన్ని సరైన గ్లాసులో నింపలేదు.ఉదాహరణకి సయి పరాంజపే గారు ‘కథా ‘ అని క చిత్రం తీసారు. కుందేలు, తాబేలు కథకు నసీరుద్దిన్, ఫరూక్ షేఖ్ జీవం పోస్తారు.సంఘటనలూ జరగాలి,తోడుగా ఒక ప్రక్రియ తీగెలా సాగాలి. ఇది ట్రీట్ మెంట్ వ్యవహారానికి చెందినది.తెర మీద కథ నడపటం కూడా కవిత్వమే!

ఈ దర్శకుడు మోడ్లెస్కి అనే ఆవిడ 1988లో నరేటివ్ స్ట్రక్చర్ గురించి చర్చిస్తూ  పేరలల్ రివర్సల్ గురించి చేసిన వ్యాఖ్యలను చూడాలి.ప్రారంభంలో చూపించిన ఒక దృశ్యం మరో విధంగా ఆఖరి దృశ్యంగా మారుతుంది. ముఖ్యంగా ఒక పోటీ, ఒక ఆట చూపిస్తున్నప్పుడు ఇది కథనానికి ప్రాణపోషణ చేస్తుంది.

గోవింద్ నిహలాని ‘అర్థసత్య ‘ లో ఒక చిన్న కవితను వాడుకున్నాడు. (ఇది కథా రచయిత సూరజ్ అనే కథలో వ్రాసినదే).ఎక్ పలడే మే…అంటూ సాగి మిగిలింది ఏమిటి? అర్థసత్య? అని ఓం పురి ప్రశ్నిస్తాడు.

‘ఒక్కడు ‘ అనే తెలుగు చిత్రంలో ఈ పంథాను చాలా బాగా వాడుకున్నారు దర్శకుడు గుణశేఖర్. ప్రారంభంలో ఒకవృత్తంలో కొందరు నిలబడతారు.కెమెరా దృశ్యం పరిధిని పెంచుతుంది.వారిని చుట్టు ముట్టిన మరి కొంత మంది కనిపిస్తారు.అలా కథ సాగిపోతుంది.ఆట (కబడ్డీ) చివరి స్థాయిలోకి చిత్రం చేరుకుంటుంది. కొద్దిగా ముందు ప్రకాశ్ రాజ్ ని, అతని మనుషులని ఇదే వృత్తంలో ట్రాప్ చేసినట్లు చూపిస్తాడు.

హిచ్ కాక్ చిత్రాలలో కూడా ఈ ప్రక్రియను వాడటం మనం చూస్తాం. అది గుండెలకు హత్తుకుంటుంది.మనం సేవించే ఏ పదార్థమైన కొంత ఆ గ్లాసు మీద ఆధారపడి ఉంటుంది మరి!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: