లాయర్లూ కత్తులూ…


రాజు అనే లాయరు నవీన అనే జూనియర్ లాయరును కర్ణాటక హై కోర్టులో కత్తితో పొడిచి చంపేశాడు.ఆమెకు మరొకరితో ఎంగేజ్ మెంట్ అయిందని తట్టుకోలేకపోయాడుట!

సినిమాలలో చూపిస్తే కోర్టులలో ఇలా జరుగగలదా అని అనుకునే వారున్నారు!

కాలేజీలలో జరుగుతున్న రాక్షసత్వం కనిపిస్తూనే ఉంది.హై కోర్టుకు మినహాయింపు లేదంటే మన సమాజం ఏ రకమైన  తరం చేతులలోకి వెళ్లిపోయిందా అని ఒక్క సారి బాధగా ఆలోచించాల్సి వస్తోంది. పోలీసు కాన్స్టబుల్ ను ప్రేమించి ఎస్. ఐ లు ఏసిడ్ పోసేయగలరు. ఎస్.పీలు, రేప్ కేసులు అలా ఉండనే ఉన్నాయి.కొద్దిగా జగ్రత్తగా ఆలోచించాలి…

ఆలోచన, ఆవేశం, దౌర్జన్యం అన్నీ తృటిలో జరిగిపోతున్నాయంటే …

ఎంత నేర్చినా ఎంత చూసినా వ్యక్తి ఒక పరిధి దాటి జీవితం, ప్రాణం విలువలను గుర్తించి ఆలోచించలేకపోవటానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి.
చెత్త  సమాచార  ప్రచారం,తీవ్రమైన భావకాలుష్యం ,పశువులు కూడా మొహం తిప్పేసుకునే మనోరంజనానికి ఏర్పరచుకున్న సాధనాలు,అన్నీ చెల్లుతాయనే విచ్చలవిడితనం,అనవసరమైన చర్చలు,పోటీలు,ప్రతి మనిషికీ ఒక జట్టు,ఒక వర్గం,ఒక రాజకీయం,అందరూ హీరోలే!

ఇలా సాగిపోతూ వెళ్లిపోతే బయటకు నెట్టలేని ఒక అసహనం తప్ప చుట్టూ ఏమీ మిగలదు.ఒక పిల్లవాడికి ఇదిగో ఇది గౌరవప్రదమైన వృత్తి అని ఒక తండ్రి చెప్పగలిగే పరిస్థితి లేకపోవటం నిజమైన దౌర్భాగ్యం…

ఈ దారి చివర ఏముందీ , ఏమి లేదు అని గట్టిగా యోచించకుండా అర్థం లేని ఒరవడులను అలవోకగా అవలంబించి చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారనుకుంటున్న తల్లిదండ్రులు మరో ఛాన్స్ ఇస్తే బాగుండునని అనుకుని ఉపయోగం లేదు.

ఎదుటా నివే ఎదలోనా నీవే…ఏ మనిషిని చూసినా ఎదుటా చెత్తే, ఎదలోనా చెత్తే!

బాహ్య ప్రపంచం, బజారు, నడి వీథి…ఈ సంస్కారం నుండి కొద్దిగా స్వగృహం,కుటుంబం వైపు జనం తిరిగు ప్రయాణం కట్టవలసిన అవసరం ఉన్నది. అక్కడినుండి సరైన విద్యాభ్యాసం ప్రారంభమవగలదు.
జ్యోతిష శాస్త్రంలో తల్లికి, తొలి విద్యాభాసానికి నాల్గవ స్థానమే పరిశీలించటం జరుగుతుంది. తొలి పాఠం తల్లి ఒడిలో కాక మరెక్కడా లేదు! నాల్గవ స్థానమే ఇంటికి సంబంధించిన స్థానం. మన బాడీ మైండ్ సిస్టమే తొలి స్వగృహం, నిజమైన స్వగృహం. ఆ లోపలికి వెళ్లి ఒక్క సారి తొంగి చూడవలసిన అవసరం ఉన్నది.

స్కెలిటన్లను చూస్తే ఎలా భయపడి అసహ్యించుకుంటామో సగటు మనిషి మనసులోకి తొంగి చూస్తే అంతకంటే జుగుప్సాకరమైన ప్రపంచం తయారవటానికి కారణం ఈ బజారు సంస్కృతి తప్ప మరొకటి కాదు.

ఇంత పనికి దిగజారాక చివర ఇది నేనే చేసానా, ఎంత పని చేసాను, అని వీళ్లు ఆలోచించగలిగే పరిస్థితిలో ఉంటారని నేననుకోను.
ఆ శక్తి వాళ్లకి లేదు.  దానిని పొందే చోట్లు మనకు అక్కరలేదు…

మనం ఎటు పోతున్నాం?

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: