శ్రీమద్రామాయణం-కచ్చిద్సర్గ (2)


శ్లో:రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయా: పతయే నమ:

శ్లో: చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం
ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం

శ్లో:కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

శ్లో: కచ్చిద్ దేవాన్ పితృన్ భృత్యాన్ గురూన్ పితృసమానపి
వృధ్ధాంశ్చ తాత వైద్యాంశ్చ బ్రాహ్మణాంశ్చాభిమన్యసే

దేవతలను, పితరులను,భృత్యులను,గురుజనులను,తండ్రితో సమానులైన వృధ్ధులను,వైద్యులను,బ్రాహ్మణులను ఆదరిస్తున్నావా?

శ్లో: ఇష్వస్త్రవరసంపన్నమర్థశాస్త్రవిశారదం
సుధన్వానముపాధ్యాయం  కచ్చిత్ త్వం తాత మన్యసే

మంత్రరహిత బాణములు, మంత్రసహిత ఉత్తమ అస్త్రముల ప్రయోగముల గురించి , అర్థశాస్త్రము,రాజనీతి గురించి తెలిసిన పండితులు,ఆచార్యులు ఐన సుధన్వుని ఆదరిస్తున్నావా?

ఒక రాజ్యం విఛ్చిన్నమవటానికి గల కారణాలు ఎన్ని ఉండగలవో దాదాపు అన్నిటినీ కనుక్కుంటున్నాడు శ్రీరాముడు.మనకే అన్నీ తెలుసు అనుకుంటూ తెలిసిన వారిని దూరం చేసుకోవటం  రాజధర్మం అనిపించుకోదు.అలాగే ఏ సమయంలోనూ పెద్దల, విఙ్ఞుల ఆశీర్వాదానికి దూరం కాకూడదు.

శుభం భూయాత్!

(మరల కలుద్దాం)

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: