ఈ ధరల గోల ఏమిటో చూద్దాం…


‘డబల్ రోటీ కే దాం…డబల్ హోగయే…’చాలా కాలం క్రితం టి.వీలో ప్రభుత్వ సంస్థలలో పని చేసే వారి మీద ఒక వ్యంగ్యాత్మకమైన కార్యక్రమం వచ్చేది.బావుండేది కూడా!
ప్రస్తుతం ధరల విషయానికి వస్తే మరి ప్రభుత్వాన్నే తప్పు పట్టాలా?
తప్పకుండా!మనమే కాదు. ఎకనమిక్ సర్వే కూడా ప్రభుత్వాన్నే తప్పు పట్టింది మరి!అదేమిటో చూద్దాం…

వ్యవసాయ రంగానికి నాలుగు శాతం అభివృధ్ధి ధ్యేయంగా పెట్టుకుని ఆర్థికాభివృధ్ధి 9 శాతం ఉండగలదనే ఆశ అందరూ వ్యక్తపరచటం మనం చూశాం.ఇది 2.8 ఉండటం ఒక సమస్య.ఇంఫ్లేషన్ గురించి చెప్పాలంటే ఆహార పదార్థాలకు సంబంధించిన ఇంఫ్లేషన్ మామూలు ఇంఫ్లేషన్ ను 2009 లోనే దాటిపోవటాన్ని ప్రభుత్వం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేకపోయిందో ఇద్దరు గడ్డపోళ్లూ-మనమోహనుడు, మోంటెక్కూ కలసి (హుక్కా ప్రణవం గారితో పాటు) ప్రజలకి సమాధానం చెప్పవలసి ఉన్నది.దీని పరిణామమే స్క్యూఫ్లేషన్. మామూలు ఇంఫ్లేషను, ఆహారపదార్థాలకు సంబంధించిన ఇంఫ్లేషనూ కొట్లాడుకుంటున్న భార్యాభర్తల్లాగా చెరో దారి పట్టినప్పుడు ఏర్పడే ‘చక్కని ‘ పరిణామం ఇది!

సర్వే ఆహార విడుదల విధానాన్ని తీవ్రంగా తప్పు పట్టింది.ఒ.ఎం.ఎస్.ఎస్-ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీం సరిగ్గా లేదు.ధాన్యం చిన్న మొత్తాలలో వ్యాపారాలకు చేరాలి, సూటిగా రిటెయిల్ కు పోవాలి. దీని వలన ధరల మీద కొంత పట్టు దొరకగలదు.పంచదార లాంటి సరుకులు సరైన సమయానికి దిగుమతి చేసుకోవటంలో అశ్రధ్ధ చేసింది ఈ ప్రభుత్వం.

పప్పుల దగ్గరకి వద్దాం.తలచుకుంటేనే భయం వేస్తోంది.అంతర్జాతీయంగా ఇవి ఒక స్టాండర్డ్ సరుకు కాదు కాబట్టి కొద్దిగా కాంట్రాక్టింగులోకి జాగ్రత్తగా వెళితే సమస్య ఉండేది కాదు.మిళ్ల మీద 20 శాతం లెవీ కోటా అనవసరంగా వేశారు. అది ప్రజల మీద గట్టిగా పడింది.సరుకులకు అధిక మార్కెట్ సపోర్ట్ ధర వలన నిజంగా చిన్న రైతులకు మేలు జరగలేదని తేలిపోయిందని ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకుని ఒప్పుకోవాలి.ఎరువుల విషయం లో సూటిగా సబ్సిడీ ఏర్పాటు చేయటమే ఉత్తమం.

వ్యవసాయ ఉత్పత్తుల మీద ఫ్యూచర్స్ మార్కెట్ ట్రేడింగు మీద కొన్ని సరైన విధానాలు అవసరంగా ఉన్నాయి.ఆలుగడ్డ, సోయా నూనె విషయాలు దీనికి నిదర్శనాలు.

ఈ రకమైన ఇంఫ్లేషన్ గురించి రిసర్వ్ బ్యాంకు గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు గత డిసెంబర్ లో ఒక  మారు సూచనగా చెప్పారు. ఎవరూ పట్టించుకోలేదనిపిస్తోంది.మార్కెట్ లో లిక్విడిటీ,పాకేజీలు , అంతర్జాతీయ మార్కేత్, ఇలాంటివి ఎక్కువగా బుర్రలో ఉండిపోయి డొమెస్టిక్ మార్కెట్ ను అంతగా పట్టించుకోకపోవటం ఇన్ని డైనమిక్స్ గల దేశానికి విచారకరం!

జాగ్రత్తగా చూస్తే ఈ సమస్యలో ప్రశాసనికపరమైన లోపాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పూర్తిగా సమన్వయం లేకపోవటం,ఆయా మంత్రిత్వ శాఖల్లో సమయానికి సరిగ్గా దొరబాబులు పని చేయలేదన్న పలు విషయాలు సింపుల్ గా కనిపిస్తున్నాయి.

ఈ ధరల సమస్యను మెక్సికో ఆయిల్ స్పిల్ లోకి నెట్టేసి ప్రక్కకు తప్పుకోకుండా ఇప్పటికైనా సరైన పనులు చేస్తారని ఆశిద్దాం.

మన దేశం 9% అభివృధ్ధితో సూపర్ పవర్ అవుతోందో లేక ఒక మహా అణుశక్తిగా కాలు మోపుతుందో ఎవరిక్కావాలి?ఈ రోజు టమాటా 35 రూపాయలు కిలో, రేపు ఇరవై, ఆ  మరునాడు తిరిగి నలభై అంటే అందరికీ మెంటల్ వస్తోంది.

సోనియా గాంధీ గారు వాళ్ల మీద, విళ్ల మీదా ఎగరటం కాదు.ఉన్నదున్నట్లు సూటిగా చెప్పి కార్యాచ్చరణలో పెట్టే వ్యక్తులు ఏ ప్రశాసనానికైనా చాలా అవసరం.ప్రస్తుతం ఉన్న దిక్కుమాలిన వ్యవస్థలో చాలా అరుదు కూడా.అటువంటి వారు వ్యవస్థలోంచి తప్పుకుని చాలా కాలం అయింది.తానున్న పరిధిలోంచి ఇవతలికి వచ్చి వారిని వెతికి పట్టుకునే ప్రయత్నం చేయాల్సి ఉన్నది.మీ రాజకీయాలతో మాకు ఏమి పనుంటుంది? లా అండ్ ఆర్డర్ , మంచి ప్రశాసనం కాంగ్రెస్ అనే పార్టీ నుంచి ప్రజలు ఆశించటం మానేసి కూడా చాలా కాలం అయింది.ఈ రెండూ సరిగ్గా ఉండకూడదనే వ్యాపార సమాజం వారిని గద్దె ఎక్కిస్తుందనే భావన కూడా చాలా మందికి ఉన్నది.

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: