జులై 2010 రాశిఫలాలు


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక: నిరంతరం మంగళమాతనోతు

మేష రాశి:బంధువర్గానికి దగ్గరవుతారు. ఒక మంచి కార్యక్రమాన్ని చేపడతారు.కొత్తగా పెళ్లయిన జంటతో పరిచయం కాగలదు.నూతన జివన శైలిని అవలంబించే ఆలోచన కలుగవచ్చు.ఈ మాసం వ్యాపారం లాభించగలదు.సంతానం అభివృధ్ధిలోకి రాగలదు.మూడవ వారం బి.పి పరీక్ష చేయించుకోవాల్సి రాగలదు. విష్ణు సహస్రనామం చదవండి.

వృషభ రాశి: విరోధులను అధిగమించాలనే తీవ్రమైన ఆలోచనలు కలుగవచ్చు.రెండవ వారంలో ప్రయాణం చేయాల్సి రావచ్చు. సరైన సమాచారం సమయానికి రాకపోవటం వలన కొంత వృధా ఖర్చు చేస్తారు.ఉద్యోగస్తులకు కోరుకున్న చోట బదిలీ జరుగగలదు.సన్నిహితుల సహాయం పొందుతారు.నూతన వాహనయోగం ఉన్నది.ఇంటికి సంబంధించిన నిర్ణయాలు రెండవ వారంలో,వ్యాపారానికి సంబంధించినవి నాల్గవ వారంలో తీసుకోవటం మంచిది.

మిథున రాశి: జీవితభాగస్వామి వ్యవహారం అర్థం కాదు! ఒక విషయంలోకి లోతుగా వెళతారు. మీ తెలివితేటలు ప్రదర్శనలోకి వస్తాయి.కొనుగోళ్లు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలి.ఉపాధ్యాయులకు మంచి మాసం. కొందరు ఉద్యోగాలు మారగలరు.ప్రేమలో పడ్డవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించవలసి ఉంటుంది.విద్యార్థులు మరి కాస్త పైకి యోచించి నిర్ణయాలు తీసుకోవాలి.ఈ మాసం చివర కొత్త అవకాశాలు రాగలవు.దుర్గా సప్తశ్లోకీ చదవండి.

కర్కాటక రాశి: రెండవ వారం నుంచి మీ కార్యక్రమాలు ఒక ఊపు అందుకుంటాయి. కళ్ల విషయంలో జాగ్రత్త వహించాలి. మీకంటే చిన్నవారు వాద్వివాదాలకు దిగగలరు.ఇంటర్వ్యూలకు వెళ్లే వారికి మంచి ఫలితాలుండగలవు.రసాయనాలతో పని చేసే వారు జాగ్రత్తలు వహించాలి.గతం, స్వగతం కంటే ప్రస్తుతం ఉన్న కాలాన్ని గమనించి ముందుకు సాగవలసిన అవసరం ఉన్నది. సుబ్రహ్మణ్య కవచం చదవండి.

సింహ రాశి: ఇంటిలోని పెద్దవారి వ్యవహారం కొద్దిగా చికాకు కలిగిస్తుంది.స్థలం మారాలని కొందరు యోచించగలరు. ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు సమానంగానే ఉంటాయి. ఒక కోరిక నెరవేరగలదు.మాసం మూడవ వారంలో కొత్త వ్యక్తులు పరిచయం కాగలరు.ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.కొన్ని పానీయాలు సేవించటం వలన ఆరోగ్య సమస్య తలెత్తగలదు. ఇంటిలో పని చేసే స్త్రీలను ఒక కంట కనిపెట్టవలసి యున్నది.

కన్య రాశి: కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులున్నప్పటికీ అనుకోని చోటు నుండి డబ్బు అందగలదు.మీరు  అనుకున్న కార్యానికి అడ్డంకులు తొలగిపోగలవు.పాత మిత్రుల కలయిక ఉండగలదు.ఇంటిలో కొన్ని పనులు చేయించాల్సి రావచ్చు.ఉద్యోగస్తులు మంచి వార్తలు వింటారు. మాసం రెండవ వారంలో దూరప్రయాణం ఉండగలదు.శ్రీసూక్తం చదవండి.

తుల రాశి: సంసారంలో కొన్ని అపశృతులుండగలవు.ప్రభుత్వం వారి వద్ద నుండి జరుగవలసిన పనులు పూర్తి కాగలవు.కొత్త వస్తువులు సేకరిస్తారు. రాజకీయరంగంలోని వారు పట్టుదలతో కార్యం నెరవేర్చుకుంటారు.విదేశీ వ్యాపారం గలవారికి మంచి మాసం.ఇనుము, నూనె వ్యాపారం కలసిరాగలదు.మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్త వహించాలి.హనుమాన్ చాలీసా చదవండి.

వృశ్చిక రాశి: మీ సద్బుధ్ధి మిమ్మలను ఒక క్లిష్టమైన పరిస్థితి నుండి కాపాడగలదు.ఓపికతో నిర్వహించిన బాధ్యతలు రాబోయే రోజులలో మంచి ఫలితాలనివ్వనున్నాయి.నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి మంచి అవకాశాలున్నాయి.హోటల్, కేటరింగు,ఎలెక్ట్రికల్ రంగం వారికి రెండవ వారం నుండి మంచి ఫలితాలున్నాయి.ఇంటిలో పూలను ఎక్కువగా వాడండి.మానసికంగా చిరాకులు పరాకులున్న వారు మంచి  ఫలితాలను పొందగలరు.

ధను రాశి: కొద్ది కాలంగా మీరు కొన్ని రంగాలను విస్మరిస్తూ వచ్చి యుండవచ్చు.ఈ మాసం తిరిగి వాటిని పరిశీలించి  చూడవలసిన అవసరం ఉన్నది. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు వహించాలి.స్థిరాస్తి కలసిరాగలదు. కొన్ని నిర్ణయాలను ఆలస్యం చేయటం వలననష్టపోగలరు.ఉబ్బసం వ్యాధి ఉన్నవారు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఋణం అందగలదు. క్రీడాకారులకు మంచి మాసం.

మకర రాశి: బంధువులు, మిత్రులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలున్నాయి.మనోరంజకమైన సాధనాల కోసం ఖర్చులు చేయగలరు.వారసత్వం వ్యవహారాలు ముందుకు వస్తాయి.కళాకారులకు ప్రోత్సాహం లభించగలదు. మొదటి రెండు వారాలు మంచి ఫలితాలనివ్వగలవు.మాటలో నిదానం, నిగ్రహం అవసరం.లక్ష్మీ అష్టోత్తరం చదవగలరు.

కుంభ రాశి: ఈ మాసం స్త్రీలది పై చేయిగా కనిపించగలదు. మనసు కొన్ని చిత్రమైన అనుభూతులకు లోను కాగలదు.ఉపాసనా మార్గంలో ఉన్నవారికి కొత్త విషయాలు తెలియగలవు. విద్యార్థులకు మంచి మాసం. వైద్యులు వృత్తిలో జాగ్రత్తగా మసలుకోవలసి ఉండగలదు.మీ రాయబారం వలన ఇతరుల సమస్యలకు పరిష్కారం దొరకగలదు.

మీన రాశి: సంఘంలో  గౌరవం పెరగగలదు. తీర్థక్షేత్రసందర్శనం జరుగగలదు.పట్టు వదలవలసిన కాలం. మూడో వారం ఇతరుల వ్యవహారాలలో జోక్యం మంచిది కాదు. మార్కెటింగు రంగం వారికి ఉత్తర దిశగా చేయు ప్రయాణాలు కలసిరాగలవు.మాసం చివర పై వారితో గట్టిగా మాట్లాడవలసియుండగలదు. లింగాష్టకం చదవండి.

~~~***~~~

నిరుపేదకబ్బిన నిధిరీతి దొరికితివి, వరత్యాగరాజ వరద మ్రొక్కేరా,నా పాలీ శ్రీరామా!

సర్వే జనా: సుఖినో భవంతు!
ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

3 thoughts on “జులై 2010 రాశిఫలాలు

  1. బాగుంది కాని ట్యాగ్స్ వాడండి. రాశి ఫలాలు అనో ఏదో ఒకటి. ఉదాహరణకి నాకు జూన్ మాస ఫలితాలు కావాలంటే మీ జూన్ మాస పోస్ట్ లు అన్నీ చూడాలి. ఒక వేళ మీరు రాయకపోతే మాకు తెలిసే అవకాశం లేదు. ట్యాగ్స్ వాడితే, వాటి మీద క్లిక్ చేస్తే, ఆ ట్యాగు ఉన్నవన్ని మేము చూడవచ్చు. ఉదాహరణకి జూన్, జ్యూలై, ఆగస్ట్ రాశి ఫలాలకి రాశి ఫలాలు అనే ట్యాగు ఇచ్చారనుకోండి.మేము రాశిఫలాలు అన్న ట్యాగు మీద క్లిక్ చేయగానే ఆ ట్యాగు ఉన్న పోస్ట్ లు అన్ని చూడవచ్చు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: