‘చెత్త’ మేనేజ్ మెంట్


చెత్త కుండీలోంచి ఏరుకునే వాళ్ల మీద కుక్కలు అరుస్తూ  ఉంటాయి. ఎవరికీ మరో ఆలోచన రాదు…

2009 లో బొగోటా అసోసియేషన్ ఫర్ వేస్ట్ పికర్స్ వారు ఒక ప్రపంచ సమావేశం జరిపారు. ఇది తొలి ‘వర్ల్డ్ కాంఫరెన్స్ ఆఫ్ వేస్ట్ పికర్స్ ‘.ఇందులో ఇద్దరు మన దేశం నుంచి కూడా పాల్గొన్నారు! (చెత్త ఏరే వారు).

వివిధ దేశాల వారు ఎన్నో అనుభవాలను పంచుకున్నారు.జి.డి.పీకి, చెత్తకీ చాలా చెత్త సంబంధం ఉంది.పైకి వస్తున్న దేశాలు-ముఖ్యంగా చైనా, భారత్ దేశాలకు చెత్తను మేనేజ్ చేసే విషయంలో చాలా చెత్త సమస్య ఉన్నదని స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్  వారు వివరించారు.
మన దేశంలో ఇ-వేస్ట్ 330000 టన్నులు ఉండగా మరో యాభై వేల టన్నులు 2009 లో అక్రమంగా దిగుమతి చేసుకున్నామని తెలుసోంది.(ప్రస్తుతం మన దేశంలో 130 పట్టణాలు దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. హైదరాబాదు లిస్టులో బాగా పైన ఉన్నదని చెప్పక్కరలేదు)
మన దేశంలో కంపెనీలకు వారి చెత్తను రిసైకల్ చేయించటానికి ఖర్చు పెట్టవలసింది లేదు.(ఇతర దేశాలలో ఈ విధానం ఉంది).ఎదురు ,ప్రభుత్వ సంస్థలు,ఇతర కంపెనీ వాళ్లు వేలం పెట్టి సొమ్ము చేసుకుంటారు.(చెత్త తయారు చేయటానికి మనకి పూర్తి స్వాతంత్ర్యం ఉన్నదన్నమాట)
అలా  చెత్తని తీసుకెళ్లిన వాళ్లు ఎవరి వీలును బట్టి వారు ధరలను నిర్ణయించుకుంటున్నారు. రిసైక్లింగు విషయంలో సరైన విధానం మన దేశం తయారు చేయలేదు.
జుట్టు తో ఒక చెన్నై సంస్థ వ్యాపారం చేస్తోంది.ఇది చైనా, కొరియా,ఇటలీ దేశాలకు ఎగుమతి అవుతున్నది.ఏటా ఇది 225 కోట్లు గడిస్తుంది.ఒక బిలియన్ డాలర్ల మార్కెట్ దీనికి ఉన్నది.
ఇటీవల చాలా రిసైక్లింగు కంపెనీలు కోట్ల టర్న్ ఓవర్ చూపుతున్నాయి…కాకపోతే క క్లిష్టమైన సమస్య లెడ్ కంటెంట్ తో ఉన్నది. ఇది ఆభరణాల వ్యాపారంతో ముడిబడి ఉండటమో లేక మరి ఏ కారణం చేతనో మన దేశంలో ఈ రిసైక్లింగు వారికి లెడ్ విషయంలో సరైన నిర్దేశాలు లేవు.ఇది చాలా విచారకరం. అమెరికా, యూరోప్ దేశాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.బేసల్ కన్వెన్షన్ లోని ఒక సరైన విధానం పాటించటం మంచిది.ఇక్కడ చెత్త తయారు చేసే వాడు ఒక మూల్యం చెల్లించే మాట ఉన్నది. అది లేకపోతే విచ్చలవిడిగా పర్యావరణాన్ని రిసైక్లింగు నెపంలో పాడు చేయటం  జరుగుతోంది.

ఈ రోజు ఇంటిలోని చెత్తలో అరవై శాతం అలా బయట పారేస్తున్నారని తెలుస్తోంది.కంపోస్టింగ్ గురించి, రిసైక్లింగ్ గురించి ఎన్నో సంస్థలు మంచి ప్రచారం చేస్తున్నాయి.ఈ క్రింది వెబ్ సైటును ఒక సారి చూడండి:

http://vegweb.com/composting

ప్రభుత్వం ఏదో అక్కడ చేశారని ఇక్కడ నిర్దేశించటం కాకుండా అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి విధానాన్ని రూపొందించాలి. లెడ్ విషయంలో త్వరగా నిద్ర లేవాలి.శిశు మరణాలకు ఇది ప్రధాన కారణమని తెలుస్తోంది.ముఖ్యంగా రంగులు,హంగులు,హంగామాల నుంచి ప్రజలు బాగా దూరం అవ్వాలి.
విధనం చేయటంలో తిరిగి చెత్తలో కూడా నాకేమి దొరుకుతుందని మన వాళ్లు ఎలాగో ఆలోచిస్తారు! వీరికంటే చెత్తలోకి చేతులు పోనించి బగోటా దాకా వెళ్లి గంభీరంగా చర్చించిన వాళ్లు మేలు!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: