ఇంద్రధనుసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని…


  • కృష్ణ శాస్త్రిగారి ఈ పాట చాలా అందంగా చిత్రీకరించారు.ఇంద్రధనుసుపల్లకీ …అని పలికినప్పుడు జయప్రద తొంగిచూడటం నిజంగానే మెరుపులా ఉంటుంది.సత్యజిత్ రాయ్ జయప్రదను మన దేశంలోనే అత్యంత సుందరమైన ముఖం అని పేర్కొన్నాడు.ఈ పాటలోంచి చందమామలా తొంగి చూశాడేమో!
    ముఖ్యంగా ఈ పాటను సాహిత్యం,సంగీతం కోసం ఎంచుకున్నా,మరో ప్రధానమైన అంశం ఉంది.హార్మోనియం వాయిస్తున్న సాక్షి రంగా రావు గారి పాత్రపోషణ గొప్పది. ఆయనను హార్మోనియం పెట్టె పట్టుకునే వాడే అనుకోగలం.నటుడిలా కనిపించడు.పాటలో ఆ స్వరం కదులుతున్నప్పుడే హార్మోనియం మెట్లు ఆయన కూడా సరిగ్గా రాగం తో పాటే నొక్కుతూ తొడ చిన్నగా కదుపుతూ అటూ ఇటూ చూడటం అనేది చక్కని ప్రదర్శన.
  • ఈ చిత్రం దర్శకులు చక్రపాణి. సంగీతం పెండ్యాల.

దర్శకులు కె.విశ్వనాథ్ గారు,పాట రచన వేటూరి సుందరరామమూర్తిగారు,సంగీతం మహదేవన్ గారు

ఈ పాట గురించి మనకు తెలిసిందే!చిత్రం తుది మాట తుది పాటలో రసవత్తరంగా సాగిపోతుంది.ఎన్నో విషయాలున్నా  ప్రస్తుతం సాక్షి రంగారావుగారి కోసం ఈ పాటలోకి వచ్చాను.ఇంతాకటి పాటలో హార్మోనియం  వాయించే పాత్ర తీరు,ఇక్కడ మృదంగం వాయిస్తున్న పాత్ర తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.మృదంగం మీద తాళం,ఆయన చేతులు సరిగ్గా పాటలో ఉన్న తాళంతో కలసి మృదంగాన్ని తాకటం విశేషం.అదే ఆలోచనతో వీణ వాయిస్తున్న వ్యక్తిని గమనిస్తే చిత్రంగా అనిపించింది.పాటలో వీణ శబ్దం లేనప్పుడు కూడా ఆయనను పాపం కచేరీ దృశ్యం కాబట్టి వాయించమన్నట్లుంది!
ఈ సమస్య ‘మనసున మనసై ‘ పాటలో కూడా సితార్ వాయిస్తున ఎ.ఎన్.ఆర్ విషయంలో కూడా చూడవచ్చు.అలా అని ఈ గొప్ప పాటల,వాటి చిత్రీకరణను తప్పు పట్టటం కాదు.
సాక్షి రంగారావు గారి పాత్రపోషణలు తగినంతగా గుర్తిoపు పొందలేదనే చెప్పాలి.

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “ఇంద్రధనుసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: