కిర్ ఘిస్తాన్-ఎటు వెళుతోంది?


కొద్ది  కాలం   క్రితం  కశ్మీర్  లో  ఒక  ఆపరేషన్ లో  ఇళ్లు  ఖాళీ  చేయిస్తున్నప్పుడు  ఒక  ఇంటిలో  కేవలం  ఒక  వృధ్ధ  మహిళ  మంచాన్ని  గట్టిగా  పట్టుకుని  కూర్చుంది. దగ్గరగా  వెళ్లి  ఒక జవాను  ‘కాంపుకు  రా ‘ అన్నాడు,’ నీకేమీ  కాదు ‘
ఆమె గాభరా  పడలేదు.’ ఇది  నా  ఇల్లు ‘,అన్నది.
‘ఇక్కడ  ప్రమాదం. చాలా గొడవలుగా  ఉంది. పద.’
‘గొడవ ఎప్పుడు  లేదు?’
‘…’
‘మాజీ…’
‘బేటా…నువ్వు  ఇంటికి  వెళ్లు.’
ఇంకొకడు  దగ్గరగా  వచ్చాడు.
‘మళ్లీ  ఇక్కడికే  వచ్చేస్తారు  మాజీ…పదండి  ‘
‘ఇది  నా  ఇల్లు, నా  వతన్.ఇదే  నా  దేశం.ఎక్కడికెళ్లి  ఎక్కడికి  రావాలి?’
‘మాజీ…’
‘ఇలా  అక్కడికీ  ఇక్కడికీ  తిరుగుతూ  ఉంటే  ఇల్లు  ఇక్కడుండదు.ఇల్లే  తల్లి,తల్లిని  వదులుతావా? ఇదే  మాతృభూమి.మీరు  వెళ్లి  పని  చూసుకోండి!మీరు  దేశం  కోసం చస్తారు, మీరు  పోయినా  దేశం  ఉండాలని! నేను  నా  ఇంటిలోనే  చస్తాను.నా  ఇల్లు  ఇలానే  ఉంటుంది ‘

~~~***~~~

కిర్ ఘిజ్ లో  మొన్న  వేల  సంఖ్యలో  ఉజ్బెక్  వైపు  పరుగులు  తీశారు.మగవాళ్లు  ఇళ్లల్లో  ఉండి  పోయి  స్త్రీలు  బర్డర్  దాటారు.చాలా  ఇళ్లు  తగులబడిపోయాయి.యోర్  కిష్లోక్  అనే   ఊళ్లోని  రెఫ్యూజీ  కాంపులో  కూర్చున్న  ఖఫీజా  బరువుగా  గోడకి  ఆనుకున్నాడు.
‘ఏ  ఊరు  మీది?’
‘…’
‘ఎక్కడి  నుండి  వచ్చారు?’
‘ఇల్లు  తగులబడింది ‘
‘మీ  కుటుంబం, పిల్లలు…’
‘ఇల్లు  తగులబదీంది ‘
‘మీరు  ఏమి  చేస్తూ  ఉంటారు?’
‘ఇల్లు  కాలిపోయింది.’
‘మీకు ఇక్కడ…అన్నీ  అందుతున్నాయా?’
‘ఇల్లు…’
‘ఖఫీజా…’
‘ఖఫీజా  ఇల్లు  కాలిపోయింది!’
~~~***~~~

కిర్ ఘిస్తాన్  జనాభా  దాదాపు  అయి దు  మిలియన్  ఉంటుంది.ఇందులో  పదిహేను  శాతం  ఉజ్బెక్  నుంచి వచ్చినవారు. ఓష్ మరియు  జలాలాబాద్  లో  వీరు  కిర్ఘిజ్  వాసులకు  దాదాపు  సమంగా  ఉంటారు.ఈ  ప్రదేశం  లోని  లోయ  (వాలీ) ఆర్థికంగా  చాలా  ఉపయోగపడుతుంది.తాజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్  వారి  భాగాలు  కూడా  ఇక్కడ  కనిపిస్తాయి.

కిర్ ఘిస్తాన్  లో ఇద్దరీ  సైన్యాల  బేసులు-(అమెరికా, రషియా) ఉన్నాయి. ఏప్రిల్ లో   బాకియెవ్  ను  దింపేసి  కొత్త   ప్రభుత్వం  గద్దె  ఎక్కింది.ప్రజాస్వామ్యం  ఊపిరి  తీసుకుంటోందా  అని  కొందరు  అనుకున్నారు. ఒక  సారి  ఈ ‘పార్టీలు ‘  ఏమంటున్నాయో  చూద్దాం…

కిర్ ఘిజ్  ప్రభుత్వం  రషియాను  సైన్యాన్ని  పంపమని  కోరినప్పుడు  వారు ‘ ఇది  కిర్ ఘిజ్  ఆంతరంగిక  సమస్య! మేము  లోపలికి  వస్తే  సమస్య  తీవ్రత  పెరుగగలదు ‘అని  వ్యాఖ్యానించారు.

అమెరికా  వారు  పరిస్థితిని  గమనిస్తున్నామన్నారు. ఏదయినా  ప్రపంచ  ఏజన్సీ ని  రంగం లోకి  దింపితే  బాగుండవచ్చు  అన్నారు.

అసలు  పార్టీ-బకియెవ్  మాటలు  జాగ్రత్తగా  చదువుదాం…
‘కిర్ ఘిస్తాన్  తన  స్వాతంత్ర్యం  కోల్పోయే  దిశగా  నడుస్తోంది.చాలా  మంది  ప్రాణాలను  కోలుపోతున్నారు. ఈ ప్రభుత్వం  ఎవరినీ  కాపాడలేదు…’

ప్రభుత్వం  ఏమంటోందో  విందాం ‘కొత్త  రాజ్యాంగానికి  రిఫరెండం  దగ్గరలో  బాకియెవ్  ఈ  పని  చేయించి  మా  తాత్కాలిక  ప్రభుత్వాన్ని  పనికి  రాని దాని క్రింద  చూపిస్తున్నాడు!’
ముసుగుల్లో  వచ్చి  ఇరు  వర్గాలు  అందరినీ  ఊచకోత  కోసినట్లు  కొన్ని  వర్గాల  ద్వారా  త్లుస్తోంది.బాకియెవ్  మాటలలోంచి  కొంత  భావం  తెలుస్తోంది.రషియా  లేదా  అమెరికా  వారు  రంగం లోకి  దిగుతారేమోనని  స్వాతంత్ర్యం  అన్నాడు. ఈ  ప్రభుత్వం  ఉండగూడదని  ఇది మిమ్మల్ని  కపాడలేదన్నాడు!

దీనికి  మరో  కీలకం  ఉన్నది. ఈ ఓష్  అనే  ఊరు  అఫ్ఘాన్  ద్వారా  జరుగు  హెరోయిన్  వ్యాపారానికి  సులభమైన  మార్గం! అది  కొత్త  ఎకనమిక్స్!

~~~***~~~
ఏ  దేశానికయినా   బార్డర్లలో  రక రకాల తెగల  మధ్య  ఘర్షణలు  సాధారణం. అక్కడ  పెద్ద  దేశాలు  కాపులు  వేసుకుని  పరిస్థితులను  గమనించటం లో  ఏమిటి  అర్థం? బార్డర్లలో  ఉన్న  తెగలు  భూ భాగాల  మధ్య  జరిగే  అక్రమ  వ్యాపారాలలో  ఎంత  పాలు  పంచుకుంటున్నారు  అనేది  ప్రధానమైన అంశం.ఇది ముందుకు  సాగి  ఆయుధాల  వ్యాపారంగా  తయారవుతుంది.   తీవ్రవాదం , బై లేటరల్  టాక్స్…ఇంతే  కథ!

పెద్ద  దేశాలు  అక్కడ  కూర్చుని  ప్రజాస్వామ్య  ప్రక్రియను, ఆర్థికపరమైన  వైవిధ్యాన్ని పెంచే   ప్రయత్నాలు  చేస్తూ  జనం లో  ప్రాంతీయత  కట్టుబాట్ల  నుంచి  బాహుల్యం  వైపు  కొత్త  ఒరవడులను  తెచ్చేలా  కొన్ని  ప్రక్రియలను  తేవలసిన  అవసరం  ఉంటుంది.ఒకరి  నిత్య  జీవితం  దేని మీద  ఆధారపడియున్నది  అనేది  మరో  దశలో  వికృత రూపం  దాల్చుతుంది.     బాకియెవ్  లాంటి  వారు  అల్ప సంఖ్యలోకి  వెళ్లే  మార్గం  యోచించటం  అత్యవసరం.

కిర్ ఘిజ్  ప్రజలు  రిఫరెండం  చేసుకుని  రాజ్యాంగాన్ని  సిధ్ధం  చేసుకుని  గట్టి  పట్టుదలతో  అక్రమ వ్యవహారాలను  రూపు  మాపే  దిశగా  ముందుకు పోవాలి.ప్రస్తుతం  ప్రజలు  ఇచ్చిన  బలిదానాలు  భవిష్యత్తుకయినా  ఉపయోగపడాలి.ఇలా  కాకపోతే  ఇళ్లు  ఉంటాయి…ఇంటి  చుట్టూతా, ఇంటిలోనూ  అని  రకాల  వారూ  ఉంటారు.ఆ  ఇంటిలో  ఎలాగ, పరిసరాలను  మారుద్దాం అనే  యోచన  చేయవలసిన  దుస్థితి  తప్పటం  లేదు.

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “కిర్ ఘిస్తాన్-ఎటు వెళుతోంది?

  1. మీ విశ్లీషణ చాలా విషయాలు తెలియజేసింది. మొదట రాసిన కాశ్మీర్ మాజీ వ్యాఖ్యలు అంతటా వర్తిస్తాయి. ప్రస్తుతం మనదేశంలో కూడా దండకారణ్యంలో జరుగుతున్నది ఇదే. అక్కడి ఆదివాసులను తరిమే ప్రయత్నంలో MNC లకు కార్పొరేట్ హోంమంత్రిగారు సాయపడుతున్నారు.
    కిర్ఘిస్తాన్ ప్రజల ఊచకోతకు అమెరికా రష్యాలే బాధ్యత వహించాలి. ఒక దేశంలో అశాంతిని సృష్టించి ఆ దేశాన్ని ఆక్రమించుకో జూడడం సామ్రాజ్యవాదులకు సాధారణమైపోయింది. అక్కడ వాళ్ళ తొత్తులను అధికారంలో కూచోబెట్టి వాళ్ళ వ్యాపారాలు చేసుకోజూస్తున్నారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: