ఎందుకు చదువుతాం…


వాస్తవాన్ని  మరింత  తేలికగా  భరించాలంటే  ఒక  కాల్పనికమైన  ప్రపంచం  లోకి  వెళ్లటం  తప్పు కాదని  రసెల్  ఒక  సారి అన్నాడు!కొందరు   చదువుతున్నప్పుడు  వారి  అభిప్రాయాలకు  ప్రతిబింబాలను  వెతుకుతూ  ఉంటారు. ఒక  కొత్త  విషయం  ఉంటుందేమోనని  కొందరు, ఎక్కడైనా   చెప్పేందుకు  పనికి వస్తుందేమోనని  కొందరు.  ..

అదలా   ఉంచండి. అసలు   మనం  చదువుతున్నామా? స్వతంత్రంగా  వ్రాయటం  ఒక  ఎత్తు.స్వతంత్రం గా  చదవటం  మరో  ఎత్తు! అవసరానికి చదవటం, ఒక   ప్రణాలికలో  భగంగా  కొంత  సమాచారాన్ని  సేకరించటం…అందులో  భాగంగా  ఏదో  చదవటం  ఇవి  మన  చదువులు.ఒక  పుస్తకాలయంలోకి  వెళ్లి  ఇష్టం  వచ్చినది  చదువు  అని  చెప్పే  ఒక  తండ్రిని  చూడాలని  ఉంది!వేర్ ద మైండ్  ఈస్  వితవుట్  ఫియర్…ఆ   స్వాతంత్ర్యం    మనకు  వచ్చిందా?
దీని  అర్థం  విచ్చలవిడితనం  కాదు.బేకన్  చెప్పినట్లు  చదివినదనిని  తూకం  వేయాలి…సత్యాన్ని  శోధించి  ఒక  అనుభూతిగా    ఆస్వాదించాలి.

ఆలోచనలు   సర్పాలలా  పాకుతూ   ఉంటాయి, జారిపోతూ    ఉంటాయి.  కొన్ని  విషం  చిమ్ముతాయి.కొన్ని  దాక్కుంటాయి.  కొన్ని   చుట్టేసి  బిగిస్తూ   ఉంటాయి. ఊపిరి  ఆడదు…వీటిని  ఆయుధంగా  స్వీకరించి  బుధ్ధితో    మథించి   జీవితసత్యాలను  అమృతంలా  అనుభవించినవారికి  అక్షరసత్యాలు  అణు బాంబులలాగా  శక్తివంతంగా    చిత్తంలో  దాగి  ఉంటాయి…

కొందరు   గొప్ప  కళాకారులు! ఈత  రాకుండానే  కాల్పనికమైన  సముద్రంలోకి  దూకేయగలరు! ఈది  చూపగలరు. రెక్కలు  లేకుండానే  అనంతమైన  ఆకశంలో    ఎగురగలరు. ఒక  చిన్న  గుడిసెలో  కూర్చుని  ఒక  చిన్న  పాట  పాడుకుంటూ  ఇదిగో  ఇక్కడే  మరో  ప్రపంచం  ఉన్నదని  చూపించగలరు.
వెర్రి తలలే   వేయి  తలలుగా  వేయి  ఆలోచనల  పురుషునిలా  జీవించేయగలరు.

అప్పుల  బాధల  నుండి  ముక్తి  పొందటానికి మొజార్ట్  సంగీతం  లోని  అమృతవర్షిణిలో  మునిగి  తేలాడు. ఏ  మానసిక  శాస్త్రవేత్తనో  కలసి  డిప్రెషన్ కు  మాత్రలు  వేసుకుని  ఉంటే  ఆ  సంగీతం    మనకు   మిగిలేది  కాదని  రసెల్  అంటాడు!

~~~***~~~

సరే! ఇది  మీరిప్పుడు  ఎందుకు  చదివారు?!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “ఎందుకు చదువుతాం…

  1. మీ రాతలకూ నాకూ భావసారూప్యం ఉంది కాబట్టి చదువుతున్నాను. 🙂
    చాలా చక్కగా వ్రాసారు. ధన్యవాదాలు.

    //వాస్తవాన్ని మరింత తేలికగా భరించాలంటే ఒక కాల్పనికమైన ప్రపంచం లోకి వెళ్లటం తప్పు కాదని రసెల్ ఒక సారి అన్నాడు!

    సైన్సు ఆవిష్కారాలు చేయడానికి కూడా చాలా సార్లు కాల్పనిక ప్రపంచంలోనికి ఎంతో మంది శాస్త్రవేత్తలు వెళుతూ ఉంటారు. తద్వారా వాస్తవాలని శోధిస్తారు.

    //ఒక పుస్తకాలయంలోకి వెళ్లి ఇష్టం వచ్చినది చదువు అని చెప్పే ఒక తండ్రిని చూడాలని ఉంది………..దీని అర్థం విచ్చలవిడితనం కాదు.బేకన్ చెప్పినట్లు చదివినదనిని తూకం వేయాలి…సత్యాన్ని శోధించి ఒక అనుభూతిగా ఆస్వాదించాలి.

    బాగుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: