రాబోవు రోజులు నీరు గార్చు రోజులు-వేదాంతం శ్రీపతిశర్మ


అల్ నినొ వలన  రాబోవు  రోజులలో  ఆస్ట్రేలియా, ఇండియా  దేశాలలో  జరుగబోయే  వితండం గురించి  మీరు వినే  ఉంటారు.ముందుగా  హిమాలయ  ప్రాంతం  నుండి  ప్రవహించే  నదులలో  ఉద్రిక్తత, వరదలు  సంభవించి  తరువాత  ఆ  నదులలోని  జలం  చాలా  మటుకు  తగ్గిపోగలదు. అలాగే  దక్షిణ  భారత   దేశం లో  తీవ్రతరమైన  అనావృష్టి  సంభవించగలదని భౌగోళ  శాస్త్రవేత్తల  అంచనా.

ఈ  రోజు  వాషింగ్టన్  పోస్ట్ లో  ఒక  పేధానమైన అంశాన్ని  చర్చించారు  ఉత్తం  కుమార్  సిణా  గారు.టిబెట్  ప్రపంచం లోనే  అతి  పెద్ద  జలాశయం. ఇక్కడి  నుంచే  దాదాపు సమస్త జలం  ప్రవహిస్తుంది.మనం  మన  దేశం లోని  రాష్ట్రాల    మధ్య  నదీ  జలాల ను  పంచుకోవటం లో  గొడవలు  చూశాం. ఇప్పుడు  భారత్ దేశానికి  కొత్త సమస్య   చైనా   వారు   టిబెట్ లో  తలపెట్టిన  నదీ  జలాల  వ్యవహారం! యార్లుంగ్  జాంగ్బొ నదిలి లో చైనా  ఉత్తర దక్షిణ  డైవర్షన్  ప్రారంభించింది. (దీనినే  మనం  బ్రహ్మపుత్ర  అంటం).అరుణాచల్  ప్రదేశ్ వ్యవహారం  లాగా  ఇప్పుడు  చైనా నదీ  జలాల మీద తన  పెత్తనం    ప్రారంభించనున్నది. ఉపరి తలం లో  ఉన్నందుకు  ఒక  లాభం  కూడా  ఆ  దేశానికి  ఉన్నది. అరుణాచల్  ప్రదేశ్  ను  చైనా  ఊరకే  గురి  పెట్ట లేదు. చైనాలో  నీరు  రాబోయే  రోజులలో  25   శాతం  తగ్గిపోగలదని  వారి  అంచనా.అరుణాచల్ లో  క్షణానికి  200 మిలియన్ క్యూబిక్  ఫీట్ నీరు  మీద  ఆ  దేశం కన్ను  వేసి  ఉంచిందననమాట. ఇటీవల  ఆ  ప్రాంతంలో  ఆక్రమణలు  చేయటం  ఊరకే  కాదు.

అదలా  ఉంచి  పైన  ఉన్న  వారికి, క్రింద ఉన్న వారికి  మధ్య  జలాల  విషయంలో  ఎటువంటి  ఒప్పందాలు  లేకపోవటం  శోచనీయం. ఇది  తీవ్రంగా  పరిగణించి  ఒక   అంతర్జాతీయ  చర్చ  ప్రారంభించే  సమయం  ఆసన్నమైనది. మన  దేశం  త్వరగా  ఏ  రోజూ  నిద్ర  లేవదు.దాదాపు  రెండు  బిలియన్ల  ప్రజానీకం టిబెట్  నుండి  ప్రవహించే  నదుల    మీద  ఆధారపడి యున్నది. మన  దేశం,  పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బాంగ్లదేశ్,బర్మా, లావోస్,కంబోడియా,వియత్ నాం  వంటి  దేశాలు  సంఘటితంగా  ఈ  విషయంలో  ఇప్పుడే  ముందుకు  రావాలి.

ఉత్తం కుమార్  గారు  మరొక  ప్రధానమైన విషయం  గుర్తు  చేశారు.నదీ  జలాల  అంశం  కేవలం  త్రాగు నీటి  వ్యవహారం  దగ్గర  కాదు.పర్యావరణం  విషయం  కూడా  గంభీరంగా  ఉన్నది. చైనా లోని  యెల్లో  నది,యాంగ్త్సె  నదులు  త్రాగటానికి  పనికి  రాకుండా  పోయాయి.  ఆ  పరిస్థితి  ఇలా  టిబెట్  నుండి  ప్రవహించే  మెకోంగ్, సల్వీన్, బ్రహ్మపుత్ర, ఇండస్, సత్లెజ్  నదులకు   కూడా    పడితే    మనం   సన్యాసం  పుచ్చుకుని  హిమాలయాల  వైపు…కాదు  సముద్రం  వైపు  పరుగులు  తీయాల్సిందే!

మనకు ఇంకొకళ్లు  చెబితేనే    వినాలని  ఉంటుంది!    నాయకులు   పరిస్థితిని  అర్థం  చేసుకుంటారని  ఆశిద్దాం!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: