జూన్ 2010 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక: నిరంతరం  మంగళమాతనోతు

మేష   రాశి: ఈ      మాసం      వింత    అనుభవాలతో       ప్రారంభం   కాగలదు.  పెద్దలతోనూ   కావలసిన   వారితోనూ   జాగ్రత్తగా   వ్యవహరించవలసి   ఉంటుంది. కొత్త   వ్యక్తులు   పరిచయం      కాగలరు.   ఏదైనా   కొత్త   పనిని   మొదలు   పెట్టటం   మంచిది.  మూడవ   వారంలో   ఒక   కార్యక్రమం   చేపడతారు. పెద్దల   ఆశీర్వాదం   పొందుతారు.రవి,బుధ, శుక్ర   వారాలు  కలసి   రాగలవు. మంగళ   వారాలు     మౌనం    పాటించటం   మంచిది.

వృషభ   రాశి: మూడవ   వారంలో   అనారోగ్యం    బాధించగలదు. వ్యాపారం      బాగుంటుంది. ఇంటి   విషయాలలో   శ్రధ్ధ   వహించాల్సి  ఉంటుంది.    ప్రయాణాలలో నూ   వస్తువులతోనూ   జాగ్రత్తలు   వహించాల్సి   ఉంటుంది.    ఒక   విషయంలో   పట్టింపు   పెరగగలదు. సరైన   సమయానికి   భుజించకపోవటం   వలన   ఇబ్బందులు   ఉండగలవు.  శుక్ర   వారాలు   కలసి   రాగలవు.

మిథున రాశి: మాసం   చివరి   వారంలో    ఎక్కువ   కలసి రాగలదు. అనుకోని   సంబంధాలు     మెరుగుపడగలవు. నూతన   గృహప్రవేశం      చేయగలరు. స్త్రీల      మధ్య   కొన్ని   విభేదాలు   ఏర్పడగలవు. ఆర్థిక   లవాదేవీలు   జరిగేటప్పుడు   జాగ్రత్త   వహించాల్సి   ఉంటుంది. రాజకీయాలలో   ఉన్న   స్త్రీలకు   మంచి   పదవులు   లభించగలవు.  దుర్గా   సప్తశ్లోకీ   చదవండి.

కర్కాటక   రాశి: న్యాయం      కోసం      పోరాడటం   అన్యాయంగా   సమయాన్ని   వృధా   చేసుకోవటం   అని   యోచిస్తారు. ఒక   విషయంలో   మాట    జారుతారు.   కార్యాలయంలో   కొంత   వేడి   ఏర్పడగలదు.   ఒక రి   సలహా     పొంది   ఒక   పనిని   పూర్తి   చేయగలరు.   రచయితలు   ఒక   కొత్త   రచన   చేపట్టగలరు. కొన్ని   అనవసరమైన   ప్రయాణాలు   తగ్గించుకోవటం      మంచిది.

సింహ   రాశి: భాగస్వాముల   మధ్య   వ్యవహారాలు   కొంత   చికాకు   కలిగించగలవు.   నిరుద్యోగులకు   మిత్రుల   ద్వారా   మంచి   ఉద్యోగం   లభించగలదు. వృధాగా   ఉండిపోయిన   వస్తువుల    నుండి   మంచి   లాభాలు   సంక్రమించగలవు. చిన్న   వారు    ఒక   సమస్య   సృష్టించగలరు.   కత్తెర్లు,   బ్లేడులు   వాడేటప్పుడు   జాగ్రత్త   వహించాల్సి   ఉంటుంది.   10, 14   సంఖ్యలు   కలసి   రాగలవు.   సుబ్రహ్మణ్య   కవచం   చదువగలరు.

కన్య   రాశి: ఒక   మంచి     నిర్ణయం   తీసుకుంటారు.  చెడు   దృష్టి   బాధిస్తున్నదని   గమనించగలరు.  మీరు   సాధించారని   అనుకున్నది   పేపరులో   వేసుకోవటం   అంత     మంచిది   కాదు. కొన్ని   దానధర్మాలు   చేస్తారు. మాసాంతంలో   బంధువుల   రాక   ఉండగలదు.     వ్యాపారులకు   మంచి   మాసం. సంఘంలో   గౌరవం   పెరుగగలదు. శ్రీసూక్తం   చదవండి.

తుల   రాశి: గోపనీయమైన      విషయం   బయటకు   రాగలదు. మీరు   శ్రమించి   చేసిన    పనికి   కొంత      ఆలస్యంగా    మంచి   ఫలితం   లభించగలదు. అకస్మాత్తుగా    ఒక   తెలియని      పనిని      నిర్వహించాల్సి   ఉంటుంది.      బంగారు     వస్తువుల   విషయంలో   తగు   జాగ్రత్తలు   వహించాల్సి    ఉంటుంది.   శని, శుక్ర   వారాలు     కలసి   రాగలవు.        హనుమాన్   చాలీసా   చదవండి.

వృశ్చిక   రాశి: మీ   మీద   ఎన్నో   ఆశలు   పెట్టుకుని   మీ   పై   అధికారి   చాలా   పనులు      అప్పచెబుతారు.  మీరు     అందుకున్న   పొగడ్తకు,  చేతికి  వచ్చిన   బాధ్యతలకు   మీకు   నవ్వాలో   ఏడవాలో   తెలుసుకునే   లోపు   అన్నీ   జరిగిపోగలవు. దైవ   దర్శనం   చేసుకుంటారు. గర్భిణీ   స్త్రీలు      మరి   కొన్ని   జాగ్రత్తలు      తీసుకోవాలి.    సోమ      వారాలు    ఈ   మాసం   కలసి   రాగలవు.

ధను   రాశి:  కొన్ని   అనవసరపు   భయాందోళనల   నుండి   బయట   పడతారు. మాసం   మూడవ   వారంలో   ఒక  మంచి   యోగం   ఉన్నది. కోరుకున్న   చోటుకు   బదిలీ  జరుగవచ్చు. ఒక   స్త్రీ   వలన   లాభం   పొందుతారు. అనారోగ్యంతో   బాధ   పడుతున్న   వారు   వాడుతున్న   మందు    విషయంలో   మరో   సారి   వైద్యుని   సంప్రదించాల్సి   రావచ్చు. కాకపోతే   ఈ   మాసం    ఆరోగ్యం   మెరుగు  పడుతుంది. పెట్టుబడులు   మందగించి   పుంజుకోగలవు. అవివాహితులు   వేటలో   పంథా      మార్చుకుంటారు.   దాని    వలన   లాభం   పొందుతారు. విష్ణు   సహస్రనామం   చదవండి.

మకర   రాశి: ఆభరణాలు   కొనుగోలు  చేస్తారు.ఆదాయం   బాగుంటుంది. కొందరితో   విభేదిస్తారు. వైద్య   రంగంలో   ఉన్న వారికి   మంచి   గౌరవం   లభించగలదు. విదేశాలకు   వెళ్ళే   అవకాశాలు   రాగలవు. ఇంటికి   మరల   మరమ్మత్తులు     చేయాలని   సంకల్పిస్తారు.విద్యార్థులకు   అదృష్టం   కలసి   రాగలదు.  ఈ   మాసం   5,15   సంఖ్యలు   మంచివి.

కుంభ   రాశి: ఒంటరితనం   మాసం   ప్రారంభంలో   బాధించినా   మాసం  చివర   పూర్తిగా   భిన్నంగా   కనిపించగలదు. ఉద్యోగావకాశాలు   బాగున్నాయి. మిత్రులను   పూర్తిగా   నమ్మటం   అంత   మంచిది   కాదు. అనవసరమైన   మధ్యవర్తిత్వం   వలన   ఇబ్బందులుండగలవు. ప్రణాలికలు      బాగా    తయారు   చేయగలరు. జీవితం   కొత్త      మలుపులు   తిరుగబోతున్నది. శివాలయ      సందర్శనం   మంచిది.

మీన   రాశి: శత్రువుల   వలన   లాభాలు   పొందగలరు. కొత్త   ప్రదేశాలు    చూడాలని   యోచిస్తారు. పిల్లల      విషయంలో      కొత్తగా      ఆలోచిస్తారు. వ్యాపారం      బాగుంటుంది. అన్నీ   లాభసాటిగా    సాగు     మాసం. అడ్డ   దారులు     తొక్కే   యోచన     మంచిది   కాదు. పెద్దలు    ఉపాసనలు    చేపట్టగలరు.  రాజకీయాలలోని   వారికి   వారి   వర్గం     నుండి   తీవ్రమైన     అసంతృప్తి     వ్యక్తమవగలదు. మాసం     చివర      మంచి   పరిణామాలుండగలవు.

ఈ   మాసం   మంచి   మాట:

శ్లో:   ధర్మశ్రేయస్సముద్దిష్టం   శ్రేయోభ్యుదయలక్షణం
స చ పంచవిధప్రోక్త: వేదమూలస్సనాతన:
అస్య సమ్యగనుష్ఠానాత్స్వర్గో   మోక్షష్చ     జాయతే
ఇహలోకే సుఖైశ్వర్యమతులం చ ఖగాధిప:

(మనుస్మృతి)

ఇహలోక, పరలోకాభ్యుదయసాధకములగు   సకల   కర్మలు   ధర్మమని   చెప్పబడును. అది   వేదమూలకము, సనాతనము, అట్టి   వేదమూలమైన, సనాతన ధర్మమునాచరించుటవలన, ఇహలోకసుఖముతో బాటుగ, స్వర్గ మోక్షములు గూడ   సిధ్ధించును.

హరి ఓం తత్ సత్!

సర్వే   జనా:  సుఖినో   భవంతు!

ఓం   శాంతి:   శాంతి:   శాంతి:

~~~***~~~

Predictions in English according to Sun Signs can be viewed at www.sripati.com

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “జూన్ 2010 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: