మే 2010 రాశి ఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక: నిరంతరం మంగళమాతనోతు
ఈ మాసం ముఖ్యమైన గ్రహ సంచారం గురు గ్రహం మొదటి వారంలో కుంభం నుంచి మీన రాశికి చేరటం. కేంద్రం లోని ప్రభుత్వానికి ఒక సంచలనం సృష్టించే సంఘటన ఎదురు కావచ్చు. ప్రస్తుతం ఉన్న విపక్షానికి కొంత బలం చేకూరవచ్చు. ప్రధానమంత్రి గారి ఆరోగ్యం కలవర పెట్టగలదు. మాసం చివర పార్టీల కూటములలో భేదాభిప్రాయాల వలన సమస్యలు రావచ్చు. ఈశాన్య రాష్ట్రాలలో చిత్రమైన సమస్య ప్రారంభం కావచ్చు. రాజకీయంగా ఇది అలజడుల మాసం.
వ్యాపారస్తులు మాసం మధ్య కాలం వరకు ఆగి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. మినుములు, కందులు, గోధుమ వ్యవసాయం వారు జాగ్రత్తలు వహించాలి.
విదేశీ అవకాశాలు వచ్చినప్పుడు ఆలోచించి విద్యార్థులు నిర్ణయాలు తీసుకోవాలి. నిరుద్యోగులకు మంచి మాసం.
బదిలీల వలన భార్యా భర్తలు దూరం కాగలరు. అందరూ విష్ణు  సహస్రనామం చదవాలి. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు భూమి సూక్తం,అఘమర్షణసూక్తం చదవటం లేదా వినటం మంచిది.
మాసానికి ఒక సారైనా శివునికి అభిషేకం చేయించాలి.

మేష రాశి: మాసం మంచి ఉత్సాహంతో ప్రారంభమైనప్పటికీ మధ్యలో అలసటలు, ప్రయాణాలు,అజీర్ణం ఉండగలవు.ఆధ్యాత్మిక చింతనతో పాటు ఒక నూతన ఒరవడి జీవితంలో ఏర్పడగలదు. మాసం మధ్యలో మంచి వార్తలు వింటారు.ఒక కార్యం పూర్తి కాగలదు. పెట్టుబడులు ఆలోచించి చేయగలరు. జీవిత భాగస్వామికి మంచి అవకాశాలు రాగలవు.ఒక సామూహిక విందులో పాల్గొని మంచి పేరు తెచ్చుకోగలరు. ఉద్యోగాలలోని వారికి కొత్త పని చేయవలసి రావటం, బంధువర్గం నుండి సరిక్రొత్త బాధ్యతలు,శ్రమ ఉండవచ్చు. మాటలు, ఆలోచనలు రెండూ తగ్గించి కేవలం పనిలోకి మనస్సును లగ్నం చేసిన వారికి సమస్యలు ఉండకపోవచ్చు.శ్రీసూక్తం చదవండి.మీకు ఈ మాసం కలసి వచ్చే సంఖ్యలు 6,14.

వృషభ రాశి: పరపతి పెరిగే మాసం ఇది.దానికి ఒక లంకె కూడా ఉన్నది.ఒక బంధుత్వం కలుపుకోవటమో లేదా ఒక ఇష్టం లేని వ్యవహారమో నిర్వహించవలసి ఉండవచ్చు.రెండవ వారం నుండి ఆదాయం బాగుంది.ఇంటిలోని వారి ఆరోగ్యం-ముఖ్యంగా తల్లి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరం ఉన్నది.స్త్రీల పేరు మీద పెట్టుబడులు రాణించగలవు.ఇంటిలోని ఒకరికి వివాహం కుదరగలదు.కలుషితమైన నీరు త్రాగటం వలన ప్రమాదం ఉన్నది. జాగ్రత్త వహించాలి. ఒక విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటారు. లోకం పోకడ ఎలా ఉన్నా మీరు నమ్మిన సిధ్ధాంతాలను అనుసరించటం వలన ఈ మాసం మంచి ఫలితాలుండగలవు. మహా సౌరం చదవండి. మీకు ఈ మాసం కలసివచ్చే సంఖ్యలు 7,12.

మిథున రాశి: కొన్ని బహుమతులు అందుకోగలరు.ఉబ్బసం ఉన్న వారు జాగ్రత్తలు వహించాలి. కొత్త పనులకు మంచి మాసం.నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు బాగున్నాయి. ఈ రాశి వారు ప్రయాణాలు చేయటం అంత మంచిది కాదు. విద్యార్థులు రాణిస్తారు.ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు మౌనం పాటించటం మంచిది.ప్రేమ వ్యవహారాలలో ఉన్న వారు కొంత పెద్దల మాటలు వినటం వలన లాభమే పొందగలరు.కార్మిక సోదరులు యంత్రాలు, పనిముట్లతో జాగ్రత్తలు వహించాలి.కొత్తగా వివాహం అయినవారు గర్భం విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఎగుమతుల వ్యాపారాలు చేసే వారు మాసం మధ్య నుండి లాభాలు పొందగలరు.విష్ణు సహస్రనామం చదవండి.మీ అదృష్ట సంఖ్యలు ఈ మాసం 3,11.

కర్కాటక రాశి: తలచిన కార్యాలు నెరవేరుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది.ఆదాయం బాగుంది.ఆగ్నేయ దిశ నుండి మంచి సమాచారం అందగలదు. కొత్త పరిచయాలు ఏర్పడగలవు.సంతానం అభివృద్ధి బాగుంది. ఉద్యోగస్తులకు మార్పులు తప్పవు.చాలా కాలంగా నిర్వర్తించని బాధ్యత తప్పనిసరిగా ఇప్పుడు నిర్వర్తించవలసి యుంటుంది.స్త్రీల వలన లాభాలున్నాయి.పరిశోధనా రంగంలోని వారికి పురోగతి బాగున్నది. స్టాక్ మార్కెట్ జోలికి ఈ మాసం వెళ్లటం అంత మంచిది కాదు.వాహనం మరమ్మత్తుకు రాగలదు.పెద్దల ఆశీస్సులు పొందుతారు.హనుమాన్ చాలీసా చదవండి.ఈ మాసం మీ అదృష్ట సంఖ్యలు 7,15.

సింహ రాశి: అనుకోని సంఘటనలు ఎదురు కాగలవు. మిత్రులు రంగులు మార్చగలరు.కాగితాల మీద సంతకాలు చేసే ముందు జాగ్రత్తలు వహించాలి. ఆస్తి విషయాలు చర్చలోకి వస్తాయి. అనవసరమైన ఖర్చులు ఉండవచ్చు. అనీమియా ఉన్న స్త్రీలు జాగ్రత్తలు వహించాలి. జీవిత భాగస్వామికి ఉద్యోగరీత్యా స్థానచలనం ఉండగలదు. మందులు, పానీయాల వ్యాపారస్తులకు లాభాలుండగలవు. గతంలో చేసిన అప్పులు తీరిపోగలవు. మానసికపరమైన విషయాలలో పరిశోధనలో ఉన్న వారికి మంచి పరిణామాలుండగలవు.సుబ్రహ్మణ్య కవచం చదవండి. ఈ మాసం మీ అదృష్ట సంఖ్యలు 6,19.

కన్య రాశి:వ్యవహారాలలో విజయం పొందుతారు.ఇంటి సమస్యలు తీరుతాయి. ఒక విదేశీ యానానికి సంబంధించిన సూచన లభిస్తుంది.అప్పుడప్పుడు కొంత ఆవేశానికి గురి కాగలరు.ప్రయాణాలు సంభవం.ఆదాయం బాగుంది. విరివిగా ఖర్చు చేస్తారు.ఒక సదుపాయాన్ని సంపాదించి సద్వినియోగం చేస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొత్త మలుపులు కనిపించగలవు.అవివాహితులకు మంచి కాలం. నూతన విద్యాభాసం ఉండగలదు. మీడియా రంగం వారికి మంచి కాలం.ఒక మంచి మిత్రునితో భేటీ కాగలరు.ఆరోగ్యం విషయంలో శ్రధ్ధ వహించాలి. లక్ష్మీ అష్టోత్తరం చదవండి. ఈ మాసం మీ అదృష్ట సంఖ్యలు 5,12.

తుల రాశి:లావాదేవీలు తీవ్రతరం అయ్యే మాసం ఇది.మీ చుట్టూతా ఉన్న వారు ఎప్పటికప్పుడు లెక్కలు వేస్తున్నారు. రాజకీయ పరిణామాలు కూడా వేడిగా సాగగలవు. మీరు ఆశించిన పదవి రాకపోవచ్చు. కాకపోతే కొంత కాలం తరువాత రాకపోవటమే మంచిదనిపించగలదు.ఉద్యోగాలలో ఉన్నవారికి పదోన్నతులు ఉండగలవు.మీ నివాస స్థానంలో కొన్ని మార్పులు చేసిన యెడల కొంత కలసిరాగలదు. నూనె వ్యాపారంలో ఉన్నవారికి మంచి కాలం. వ్యంగ్య ధోరణి అవలంబించే వారికి సమస్యలు తప్పవు.ఒక ప్రదర్శనలో పాల్గొనగలరు.మాసం చివర వ్యాపారరీత్యా ప్రయాణం చేయగలరు.చాలా కాలంగా మీరు చేసిన ఒప్పందాలను నిలబెట్టలేకపోతున్నట్లు తెలుస్తున్నది. మానసిక ప్రశాంతత కోసం వాగ్దానాలను నిలబెట్టటం మంచిది. దేవీ ఖడ్గమాలా స్తోత్రం చదవండి. ఈ మాసం మీ అదృష్ట సంఖ్యలు 9,19.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఇది అద్భుతమైన మాసం.మంచి యోగాలు కనబడుతున్నాయి.వ్యూహాత్మకంగా సాగిన ఆలోచనలన్నీ ఈ మాసం అమలులోకి తేవటం మంచిది. కొందరిని నొప్పించగలరు. తప్పకపోవచ్చు.ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్నవారు కొత్త ఉద్యోగంలోకి అడుగు పెట్టగలరు.బంధువులు పెరగనున్నారు. బహుకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు మంచి వైద్యం పొందగలరు.ఋన సదుపాయం లభించగలదు. ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తారు.వైద్యులు, న్యాయవాదులు మంచి సమాచారాలు వినగలరు.శ్రీ దత్తస్తవం చదవండి. ఈ మాసం మీ అదృష్ట సంఖ్యలు 11,21.

ధను రాశి: సకాలంలో డబ్బు అందగలదు. సోదరీమణులకోసం ఖర్చు చేస్తారు. బాంకింగు రంగం వారు ఊరు మారగలరు.మాసం మధ్యలో బంధువర్గంతో చిన్న చిన్న విభేదాలుండగలవు. కొందరిని క్షమించి వదిలి వేయగలరు.రవాణా రంగంలోని వారికి లాభాలు బాగున్నాయి.మీరు ఆ మాట చెప్పాలని ఆమె, ఆమె చెప్పాలని మీరు అనుకుంటూ ఈ మాసం గడిపితే లాభం లేదు. ఎవరో ఒకరు చెప్పి ముందుకు వెళ్లవలసిన మాసం.ఉద్యోగాలలో ఉన్నవారికి కొంత పట్టింపు వ్యవహారం ఉండగలదు. విద్యార్థులు మరింత శ్రమించాలి. దుర్గా సప్తశ్లోకీ చదవండి. ఈ మాసం మీ అదృష్ట సంఖ్యలు 4,14.

మకర రాశి: వాద్వివాదాలకు దూరంగా ఉండవలసిన మాసం. మీ తెలివితేటలు అందరినీ ఆకర్షిస్తాయి.రచనా రంగంలోని వారు మంచి అవకాశాలు పొందుతారు.పారిశ్రామిక రంగం వారికి మాసం మొదటి వారం, రెండవ వారం లాభాలు బాగున్నాయి.క్షేత్ర దర్శనం ఉండగలదు.స్త్రీలు అన్ని రంగాలలోనూ రాణిస్తారు. దీర్ఘకాలీన పెట్టుబడులకు మాసం చివరి వారం ఉర్త్తమం. మధ్యవర్తులు రెండవ వారం, ఉపాధ్యాయులు, సలహాదారులు మూడవ వారం లోనూ మంచి అవకాశాలు పొందగలరు.లలితా సహస్రనామం చదవగలరు. ఈ మాసం మీ అదృష్ట సంఖ్యలు 7,16.

కుంభ రాశి: నువ్వా నేనా అనే ఆలోచన అన్ని రంగాలలోనూ తలెత్తవచ్చు.ఈ రాశి వారు స్వాతిశయాన్ని దాచుకుంటూ మాట వింటున్నట్లే నటిస్తూ అంతా చెడకొట్టుకోవటం అలవాటు చేసుకుంటారు.అలా కాకుండా సూటిగా పనులు చేసుకుంటూ వెళితే మంచి ఫలితాలుండగలవు.ముఖ్యంగా మాసం మధ్య నుండి మంచి యోగాలు ఉన్నవి. తలచిన పనులు నెరవేరగలవు. బంధువుల రాకతో కొన్ని పనులు ఆలస్యమయినప్పటికీ మొత్తానికి పూర్తి కాగలవు.మాసం చివర జీవితభాగస్వామితో చిన్న సైజు వివాదం విస్ఫోటానికి దారి తీయగలదు. మాట పట్టింపుకు వెళ్లవద్దని సూచన.డే ట్రేడింగు చేసే వారికి మంచి లాభాలున్నాయి.లింగాష్టకం చదవండి. ఈ మాసం మీ అదృష్ట సంఖ్యలు 4,23.

మీన రాశి: వృత్తిలో రాణిస్తారు.దూరదృష్టి పెరుగుతుంది.కాలేయం విషయంలో జాగ్రత్త వహించాలి.మీరు ఊహించిన విధంగా కాకుండా మరో విధంగా పనులు పూర్తి కాగలవు.పిల్లల విషయంలో శ్రధ్ధ అవసరం.సోదరులు సహకరిస్తారు. పెద్దల ధోరణి మనసును కలవర పెట్టగలదు.విదేశాలలో ఉన్న వారు వారు ప్రయత్నిస్తున్న పనులు పూర్తి చేసుకుంటారు.మాసం చివర అర్థం కాని తలనొప్పి (శారీరిక సమస్య) బాధించగలదు.గతంలో ఒకరి విషయంలో తొందర పడ్డట్లు గ్రహిస్తారు.కార్యాలయంలో మీ ఆసనం ఈశాన్యం లేదా తూర్పునకు మార్చుకున్న యెడల సత్ఫలితాలను పొందగలరు. ప్రస్తుతం అలా లేదని అర్థమవుతున్నది…శ్రీ వెంకటేశ ప్రపత్తి చదవండి. ఈ మాసం మీ అదృష్ట సంఖ్యలు  21,24.

~~~***~~~

ఈ మాసం మంచి మాట:

మయి సర్వమిదం ప్రీతం సూత్రే మణిగణా ఇవ (శ్రీకృష్ణుడు,భగవద్గీత, 7.2)

(ఒక సూత్రంలో మణులు కూర్చినట్లు నా యందే సర్వమూ ఆధారపడియున్నవి)

సర్వే జనా: సుఖినో భవంతు!

హరి ఓం తత్సత్!

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~

Predictions in English according to Sun Signs can be viewed by logging into www.sripatitimes.com, by directly browsing www.sripati.com or www.squidoo.sriwrites.com

P.S: This astrologer will be available on live chat for astrological purposes on the following ‘chats’:

TWITTER : SATURDAY 08 AM TO 09 AM IST

FACEBOOK: THURSDAY 08 PM TO 09 PM IST

ORKUT: 04.30 AM TO 05.15 AM IST

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

22 thoughts on “మే 2010 రాశి ఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ

  1. Hi Naa Peru Santhoshi kumari Nenu 12-01-1990 night 11:30 pm Friday janminchanu. Na Nakshathram Ashlesha 1 va Padham, Rasi Karkataka Rasi Nenu oka Abbaini Love Chesthunnanu Abbai Peru Venkata Ramesh Puttina Vivaramulu 24-06-1986 Tuesday Evining 5:30 Pm Nakshatram Uttarashada Rasi Makara Rasi. Memu Okariki Okaramkam Baga Istam Famalylo vallu andharu ma Vivaham Cheyadaniki Angikarincharu. Nest Yearlo Chestham Annaru. Kani Ma Iddari Jathakalu Kalisaya Vivaham Valana Maku Lifelo Yela Untundhi.Nannu Chesukovadam Valla Thanaku Valla Family ki Yela Untundhi Theluukovalani Undi Dhaya Chesi Thelia Cheppandi

    1. Hi Naa Peru Santhoshi kumari Nenu 12-01-1990 night 11:30 pm Friday janminchanu. Na Nakshathram Ashlesha 1 va Padham, Rasi Karkataka Rasi Nenu oka Abbaini Love Chesthunnanu Abbai Peru Venkata Ramesh Puttina Vivaramulu 24-06-1986 Tuesday Evining 5:30 Pm Nakshatram Uttarashada Rasi Makara Rasi. Memu Okariki Okaramkam Baga Istam Famalylo vallu andharu ma Vivaham Cheyadaniki Angikarincharu. Nest Yearlo Chestham Annaru. Kani Ma Iddari Jathakalu Kalisaya Vivaham Valana Maku Lifelo Yela Untundhi.Nannu Chesukovadam Valla Thanaku Valla Family ki Yela Untundhi Theluukovalani Undi Dhaya Chesi Thelia Cheppandi

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: