‘తుం మిలో తొ సహీ’చిత్రం మీద వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు


కబీర్ సదానంద్ రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిఖిల్ పంచమియ నిర్మించారు.

సామాజికపరమైన ఇతివృత్తాన్ని ఎంచుకుని కొన్ని పాత్రలను నిజ జీవితం నుండి ఎంచుకుని ఒక కనెక్షన్ ఏర్పరచి ఒక చిత్రమైన ప్రక్రియను ప్రయత్నించారు దర్శకులు. ఇందులో పూర్తిగా సఫలమైనట్లు కనిపించదు.కారణాలను పరీక్షించే ముందు చిత్రం లోకి వెళదాం…
లకీ కెఫే అనే ఒక పాత కెఫేను డింపల్ కపాడియా నడుపుతూ ఉంటుంది.ఆమె భర్తకు చెందిన కెఫే అది.ఆమె ప్రస్తుతం ఒంటరిది.నానా పాటేకర్ పాత కాలపు తమిళ వ్యక్తి. రిటైరయిపోయాడు. ఒంటరి వాడు.సునీల్ శెట్టీ,విద్యా మాల్వడె భార్యా భర్తలు.ఇతను పూర్తి ఆధునిక కార్పొరేట్ వ్యక్తి. ఆస్తులను కొనటం, అమ్మటం, హై స్పీడ్ లో పోతూ ఉంటాడు.ఆవిడ ఒక ప్రొఫెసర్.పిల్లవాడు వీళ్ల గొడవల మధ్య మానసికంగాదెబ్బ తింటూ ఉంటాడు.లకీ కెఫేలో వీళ్లిద్దరు మొదటి సారి కలుసుకున్నారని చెప్పుకుంటారు. తగువు అయినప్పుడు ఆమె అక్కడే ఉంటుంది.నానా పాటేకర్ ఒక పిల్లవాడి సైకిలు తిరిగి ఇచ్చేటప్పుడు అక్కడికి చేరుకుంటాడు. సునీల్ శెట్టీ తన కంపెనీ తరఫున ఆ కెఫేను కొనే ప్రయత్నం దగ్గర కథ ముందుకు వెళుతుంది.
డింపల్ అమ్మను అనేసరికి అది ఆమెకు చెందదనే గొడవ సృష్టించటం, అజయ్ భార్య విభేదించటం,నానా పాటేకర్ ఒకపటి న్యాయవాది కావటం వలన ఆ కేసును వాదించటం,చివరకు అజయ్ దేవ్ గణ్ స్వయంగా కొన్ని విషయాలను కోర్టులో ఒప్పుకోవటం,డింపల్ అసలు ఆ కెఫే తన కూతురుకు (పెళ్లి ముందే జన్మించిన కూతురు) చెందుతుందని చెప్పటంతో కథ ముగుస్తుంది.
దర్శకుడు ఈ మధ్య సాగుతున్న ముగ్గురు పాత్రల సమ్మేళనంలో వాళ్లు నిజానికి కలుసుకునే ప్లేట్ఫారం-వేదిక లకీ కేఫ్ అని చెప్పే ప్రయత్నం చేశారు.అది పాత అలవాట్లు,సన్స్కారం, పధ్ధతి ఇటువంటి వాటికి చిహ్నంగా హెరిటేజ్ సైట్ క్రింద అక్కడి జనం పోరాడటం, సైన్యం నుంచి వచ్చిన విక్రం ఆధునికరుగ్మతలలో ఇరుక్కున్న ప్రియురాలితో సహా అందులో పాల్గొనటం…ఇవన్నీ సింబాలిసం కోసం బాగానే పనికి వచ్చాయి. కానీ కోర్టు సీను అసహజంగా ఉన్నది.అసలు సునీల్ శెట్టీ కంపనీకి ఆ కెఫే ఎవరికి చెందాలనే మాట మీద లోకస్ స్టేండయి చూపించలేదు. సాక్ష్యాధారాలు తిన్నగా న్యాయమూర్తికే ఇచ్చేయటం,అది ఏ స్థాయి కోర్టో తెలియకుండా అలా అదోలా సాగిపోయింది. కోర్టులో లకీ కెఫెలో చెప్పుకోలేని కృత్యాలు కూడా జరుగుతున్నాయని మొహ్నీశ్ బెహ్ల్ వాదించినప్పుడు సునీల్ శెట్టీ గింజుకుని (తన భార్య అక్కడే ఉన్నందుకు)ఇవన్నీ అబధ్ధాలని చెప్పి (తన ఉద్యోగం పోతుందని తెలిసినా) అందరినీ ఆశ్చర్య పరుస్తాడు. ఆ దృశ్యంలో పండవలసిన భావోద్రేకం ముందుకు రాలేదు.

నానా పాటేకర్ నటన ఎప్పటిలాగే ఆకట్టుకుంటుంది.ఆయన తెర మీదకు వచ్చినప్పుడల్లా మంచి వడ్డన ఉంటుందనే నమ్మకం సృష్టిస్తారు.డింపల్ ఇంటికి వచ్చినప్పుడు చెప్పులు వదిలి రమ్మన్న వాడు ఆమె దగ్గరకు వెళ్లినప్పుడు బూట్లతోనే బెడ్ దాకా వెళ్లటం అనేది చూ  పించేటప్పుడు దర్శకులు ఆలోచించాలి…

డింపుల్ కపాడియా ఆ పాత్రలో చాలా మంచి నటనను ప్రదర్శించింది.టైటిల్ పాట బాగుంది.
~~~***~~~
ఒక రైల్వే జంక్షన్ ను చూడగానే ఇది జంక్షన్ అని తెలిసిపోతుంది. కథలో పాత్రల,ఇతివృత్తాలసంగమం జరగవలసిన ‘చోటును ‘ రచయిత చాలా జాగ్రత్తగా చిత్రీకరించాలి. కథ కోసం దీనిని సృష్టించామనిపించకూడదు. అది ఒక తప్పని సరైన చోటుగా అందరి ముందుకూ రావాలి. దో రాస్తే చిత్రంలో బల్రాజ్ సాహ్ని గ్రామొప్ఫోన్ రికార్డు వింటూ ఉంటాడు-‘ఎక్ బంగల బనే న్యారా…’ అది సైగల్ గొంతులో ఉంటుంది. ఆ చిత్రం లోని కథలో చెబుతున్న పాత కాలపు విలువలు ఆ గ్రామొఫోను,ఆ పాట ముందుకు రాగానే ప్రేక్షకుని మదిలో మెదలటం మొదలవుతాయి.లకీ కెఫె లోకి వీరందరూ అడుగు పెట్టటం అంత ఎఫెక్టివ్ గా జరగలేదు. సింబాలిసం విషయంలో దర్శకుడు చేయవలసిన కృషి చాలా ఉన్నది.
మెటోనిమీ,మెటఫర్ కు సంబంధించి ‘సిటిజెన్ కేన్ ‘ అనే చిత్రం (1941) చూస్తే పలు విషయాలు బయటకు రాగలవు.
~~~***~~~

హిందీ చిత్రాలలో కథను ఎంచుకుని కొత్తదనం కోరుకోవటం,ఒకప్పుడు కమర్షియల్ గా బాగా రాణించిన హీరోలు కూడా భిన్నమైన పాత్రలు చేయటానికి సిధ్ధపడటం తెలుగువారమైన మనకు ఎంతో ఆనందం కలిగిస్తుంది.

~~~***~~~

The English version can be viewed at www.sripatitimes.com & www.filmreviewsonline.org & www.chakpak.com

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: