ద ఐడియా ఆఫ్ జస్టిస్-అమార్త్య సెన్ గారి పుస్తకం మీద వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు


ఇటువంటి పుస్తకం చూడగానే చాలా మందికి ఈ విషయం మీద అధ్యయనం చేసిన వారు చదివితే మంచిది, మనకెందుకు అనిపించగలదు.ఆ మాటకి వస్తే ఏ పుస్తకం చదవాలన్నా ఒక ‘ఒ ఎం ‘ అంటే ఒక ఓపెన్ మైండ్ చాలా అవసరం.ఇదే నన్నడిగితే నిత్య జీవితానికి కావలసిన నిజమైన ఓంకారం!ఇది లేనప్పుడు మన ముందుకు వచ్చేవి లెక్కలు,వెక్కిరింతలు!వాటి లోపలే జీవిత కాలం గడచిపోతుంది…మనకు మనం న్యాయం చేయలేము, ఏ విషయానికీ న్యాయం చేయలేము.న్యాయం అనే అంశం ఎంతో అన్యాయానికి గురి అయిన సంగతి మనం చూస్తూనే ఉంటాం. అమార్త్య సేన్ గారు రచించిన ఈ పుస్తకం ‘బుధ్ధి జీవుల ‘ కోసం అని అనుకుంటే పొరపాటు. కేవలం విద్వత్తు వైపు చర్చ ఉండదు.పాఠకుడిని ఒక సక్రియమైన చర్చలోకి అద్భుతంగ దించుతుంది ఈ పుస్తకం.ఆ చర్చలో న్యాయానికి సంబంధించిన పలు సిధ్ధాంతాలను -గతం లోనివి, వర్తమానం లోనివి ముందుకు వస్తాయి.వాటి గురించి కూడా మనకు కొంత తెలుస్తుంది.
ఈ దృక్పథాలలో ప్రధానంగా సేన్ గారు జాన్ రాల్స్ ను పేర్కొంటూ ముందుకు వెళతారు. ఆయనకే ఈ పుస్తకం అంకితం ఇవ్వటం జరిగింది.
ఒక ఓపెనింగు లాగా సద్దాం హుసేన్ చర్చలోకి వస్తాడు.నిజానికి ఇరాక్ మీద దాడి, రసాయనిక ఆయుధాలున్నాయని గోల, అవి దొరక్క పోవటం,నన్ను ట్రయల్ లోకి తేవటానికి నువ్వెవరని సద్దాం ప్రశ్నించటం,ఇరాక్ లోని జైళ్లలో జరుగుతున్న అరాచకాలు…ఇవి ఒక సామాన్య మానవుడిని కలవర పెట్టినంతగా ఈ మధ్య కాలంలో ఏదీ కదిలించి ఉండకపోవచ్చు.అయితే ఇటువంటి ప్రక్రియ వెనుక ముందు ఐడియా ఆఫ్ జస్టిస్ అనేది ఏమిటి అనే ప్రాతిపదిక నుండి పుస్తకం ఎక్కడెక్కడో సంచరించి చివరకు మనకు మన సహజీవనం లో భౌగోళికంగా ఒక భాగస్వమ్యం ఉందా అనే ఆలోచన కలుగ జేస్తుంది.కాకపోతే సేన్ గారు చాలా చిత్రంగా ఈ అంశాన్ని చిన్నగా తొలుత ప్రస్తావించి సిధ్ధాంతాలలోకి వెళ్లిపోతారు…
పుస్తకంలో నాలుగు భాగాలున్నాయి.1. డిమాండ్స్ ఆఫ్ జస్టిస్ 2.ఫారంస్ ఆఫ్ రీసనింగ్ 3.మేటీరియల్స్ ఆఫ్ జస్టిస్ 4.పబ్లిక్ రీసనింగ్ అండ్ డెమాక్రసీ. ఈ శీర్షికలను నేను కావాలనే తెలుగులో చెప్పటం లేదు. అనువాదం తప్పు దారి పట్టించే ఆస్కారం ఉన్నది.ఆ అంశాల సందర్భాలను బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.ఇక్కడ కేవలం పుస్తక పరిచయం లోకి వెళ్లాలని   నా సంకల్పం.
మొదటి భాగం లో చర్చ స్మిత్, రాల్స్ సిధ్ధాంతాలకు గల అన్వయం,వైపరీత్యంతో ముగుస్తుంది.ప్రపంచ తీవ్రవాదం నేపథ్యంలో స్మిత్ ‘ఇంపార్షియల్ స్పెక్టేటర్ ‘ ముందుకు వస్తాడు.ఎలెక్ట్రానిక్ మీడియా, భౌగోళిక చర్చల పాత్రలు,ఇవన్నీ చర్చిస్తూ అన్ని సంస్కృతులూ కలుస్తున్న తరుణంలో వివక్ష లేని ఒక ఆధునిక మానవుడు ముందుకు రాగలడనే ఆశాభావం వ్యక్త పరచారు.స్మిత్ ఆలోచనలను ప్రస్తుత సమస్యల దృష్ట్యా పునరుధ్ధరించాలనే అభిప్రాయం కూడా కనబడుతుంది.
రెండవ భాగంలొ ప్రపంచంలో జరిగే సంఘటనలకు ‘పబ్లిక్ ఆర్గ్యుమెంట్ ‘ మీద ఫోకస్ కనిపిస్తుంది.ఒక ఆకస్మిక వివాదాస్పదమైన విషయంలో ఫలిత రహితమైన సమీక్షకు,చివరకు మిగిలే పరిణామాన్ని అనుసరించి చేసే విశ్లేషణకు మధ్య గల ఒక ద్వైదీభావం ప్రస్తుత పరిస్థితుల మధ్య ఒక ప్రశ్నగా కనిపిస్తుంది.ఇక్కడ భగవద్గీత లోని అంశం చర్చకు వచ్చింది.కొద్దిగా ఆలోచింపచేస్తుంది.(అందరూ నా చేతిలో చనిపోతే చివరకు లోకం ఏమి కావాలనే ప్రశ్న అర్జునుడు వేసినప్పుడు దాదాపు నీకది అనవసరం అని శ్రీకృష్ణుడు చెప్పినట్లుంటుంది!)అది పారమార్థిక చింతనలోకి వెళ్లిన విషయం అయితే మరి లౌకిక వ్యవహారం పరిస్థితి ఏమిటి అనే అంశం దగ్గర లౌకికమైన అంశం సార్వజనికమైన చింతనకు లోబడి యుండటం స్మిత్ ఆలోచనలో దొరుకుతుంది.రాచరికం శూన్యమయినప్పుడు ప్రజాస్వామ్యం ముందుకు వచ్చినప్పుడు పవర్ అనేది ప్రజలలోకి పంచటం అయినప్పుడు చర్చ కూడా సమానంగానే  సాగాలన్నది నిజమే!
(యుధ్ధం అనివార్యమైనప్పుడు, అవతలి ప్రక్క వాడూ దానికే  సిధ్ధమైనప్పుడు యుధ్ధం తప్ప మరో న్యాయం ఉండకపోవచ్చు.)
సేన్ గారు దీనిని కేవలం ఒక ఉదాహరణగా ఈ విషయాన్ని చెప్పి ‘కాన్సిక్వెన్స్ ఇండిపెండెంట్ ‘ విశ్లేషణను చర్చించారు.
మూడవ భాగంలో రచయిత కొద్దిగా చర్చలోంచి బయటకు వచ్చి ఒక మూలస్తంభం దగ్గర నిలబడతాడు.సమానత్వం, స్వాతంత్ర్యం అంశాల గురించి మాట్లాడుతునప్పుడు సేన్ గారి తత్వం ముందుకు వస్తుంది. అర్థికపరమైన విషయాలు, సంతోషం,మంచి ఆరోగ్యం,సమజం లోని అవకాశాలు, సమానాంతర స్వేఛ్చ …ఈ అంశాలకు గల సంబంధాన్ని ఆయన చక్కగా చెప్పారు.
చివరి భాగం న్యాయం,ప్రజాస్వామ్యం, భౌగోళిక తర్కం…వీటిని లోతుగ పరిశీలిస్తుంది. సోషల్ ఛాయిస్, సోషల్ కాంట్రాక్ట్-ఈ రెండిటినీ ఎదురు బదురు పెట్టి చేసిన విశ్లేషణ సామన్యమైనది కాదు.
ఒక నిర్లిప్తత నుండి బయటకు రమ్మని రచయిత చెప్పకుండా చెబుతున్నట్లు కనిపిస్తుంది.న్యాయం అనే విషయానికి సంబంధించిన రక రకాల సిధ్ధాంతాలలోని వ్యత్సాలను వాటి దేశ కాల పరిస్థితులతో పోల్చి, తెలుసుకుని,వ్యక్తిని న్యాయం అనే అంశం మీద ఒక అవగాహనకు రావలసిందిగా కోరుతున్నట్లుంటుంది. జాగ్రత్తగా చదివితే కేవలం ఆలోచనకు పరిమితమవకుండా ఒక సక్రియమైన జీవన విధానానికి వచ్చి ప్రతి మానవుడూ ఐడియా ఆఫ్ జస్టిస్ లో భౌగోళికంగా పాల్గొనాలి అనేది ఆంతర్యం అనిపిస్తుంది.
రక రకాల సామాజిక స్పందనలు,వ్యత్యాసాలు,సమస్యలు,అన్యాయాలూ, అరాచకాలు,అసంతృప్తులూ,ఆందోళనలు…వీటిని దూరం నుండే కొద్దిగా దగ్గరగా అర్థం చేసుకుని న్యాయం ఎందుకు అలా కనిపిస్తుంది, అలా ఎందుకు వ్యవహరించారు అనేది తెలుసుకోవాలంటే ఏ కాలం లోనైనా అలా షెల్ఫ్ లో ఉంచుకోవలసిన పుస్తకం,’ద ఐడియా ఆఫ్ జస్టిస్ ‘.
~~~***~~~
The review in English can be viewed at www.sripati.com

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

4 thoughts on “ద ఐడియా ఆఫ్ జస్టిస్-అమార్త్య సెన్ గారి పుస్తకం మీద వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు

  1. మంచి పుస్తకం. బాగా రాశారు. ఇదే పుస్తకం మీద ఆమర్త్యా సేన్ గారి ఇంట్రడక్షన్ మరియు ప్రశ్నలు-సమాధానాలు ఆయన మాటల్లోనే చూడండి, ఈ క్రింద లింకులో. గంటన్నర ప్రోగ్రాం కాబట్టి, తీరిక ఉన్నప్పుడు చూడండి.

    http://www.c-spanvideo.org/program/292560-1

  2. కేవలం ఆలోచనకు పరిమితమవకుండా ఒక సక్రియమైన జీవన విధానానికి వచ్చి ప్రతి మానవుడూ ఐడియా ఆఫ్ జస్టిస్ లో భౌగోళికంగా పాల్గొనాలి అనేది ఆంతర్యం అనిపిస్తుంది.
    యీ మీ విశ్లేషణ బాగుంది…నూతక్కి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: