ఏప్రిల్ 2010 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక: నిరంతరం మంగళమాతనోతు

ఈ మాసం గ్రహస్థితి: రవి మీన మేష రాశులు,బుధుడు మేషం,శుక్రుడు మేష, వృషభ రాశులు,కేతువు మిథునం,కుజుడు కర్కాటకం,శని కన్య,రాహువు ధను,గురువు కుంభ రాశులు సంచరిస్తున్నారు.

ఈ మాసం మేష సంక్రమణం విశేషం,కుంభ మేలా లో స్నానం విశేషమైన ఫలితాలను ఈయగలదు.మాసం మధ్య నుండి అనారోగ్యంతో బాధ పడు స్త్రీల ఆరోగ్యం బాగు పడగలదు.విషజ్వరాల బాధలు అధికంగా ఉండగలవు. ఒక విదేశీ నాయకుడు తీవ్రమైన అస్వస్థతకు గురి కాగలడు.ఆగ్నేయ ప్రాంతానికి కొన్ని అలజడులు తప్పవు.మాసం మధ్యలో కొన్ని చిత్రమైన రాజకీయ పరిణామాలు ఉండగలవు.పలు వ్యాపారాలలో ఆదాయం వచ్చే విధానాలలో మార్పు సంభవం.రోడ్డు ప్రమాదాల విషయంలో జాగ్రత్తలు వహించాలి.భాగస్వామ్య వ్యాపారం అభివృధ్ధిలోకి రాగలదు.ఉత్తర వాయువ్య ప్రాంతాలలోని సరిహద్దులలో పరిస్థితులు తీవ్రతరం కాగలవు.కొన్ని వాస్తవాలు బయట పడగలవు.రసాయనాలకు సబంధించిన ప్రమాదాలు కనిపిస్తున్నాయి.తుల రాశి వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.నిరుద్యోగులకు మంచి అవకాశాలున్నాయి.

మేష రాశి: ఎన్నో సంఘటనల మధ్య ఒక ప్రేక్షకునిలాగా కూర్చుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడగలవు.జీవితం నూతన అధ్యాయం లోకి అడుగు పెట్టినట్లు కనిపించవచ్చు.మాసం రెండవ వారం నుండి ఆదాయం బాగున్నది. ప్రభుత్వోద్యోగులకు కొన్ని వాద్వివాదాలుండగలవు.ప్రేమ వ్యవహారం ఉన్నవారికి మంచి అదృష్టకాలం.మందులు,మీడియా రంగం వారికి పై చేయి కనిపిస్తున్నది.ఈ మాసం మీ అదృష్ట సంఖ్యలు 3,6. శ్రీసూక్తం నిత్యం పారాయణ చేయాలి.

వృషభ రాశి: బంధువుల తాకిడి ఎక్కువగా ఉండవచ్చు.ఒకరికి చేసిన వాగ్దానం పూర్తి కానందున కలవర పడగలరు. ఆదాయం బాగున్నది.ఒక సమస్య పరిష్కారం కాగలదు.మామూలుగా చేపట్టిన ఒక పని మంచి పరిణామాలను ఇవ్వగలదు. ఆధ్యాత్మిక చింతన అనివార్య కారణాల వలన తగ్గు ముఖం పట్టగలదు.రొయ్యలు,పండ్ల వ్యాపారస్తులు తగు జాగ్రత్తలు వహించాలి.రవాణా రంగం వారికి మంచి లాభాలున్నాయి. ఈ మాసం మీ అదృష్ట సంఖ్యలు 1,7. విష్ణు సహస్రనామం పారాయణ చేయాలి.

మిథున రాశి: స్టాక్ మార్కెట్ లోకి తొంగిచూసే వారు కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మేనమామల ఆరోగ్యం విషయం ఆలోచించాల్సి ఉంటుంది.దూరం నుంచి మంచి వార్తలు వింటారు.వ్రాత పనులలో ఉన్న వారు కొద్దిగా ధికంగా శ్రమ, శ్రధ్ధ వహించవలసి యున్నది.కొత్త కోర్కెలను కొద్దిగా పోస్ట్ పోన్ చేయండి.విద్యార్థులు కొద్దిపాటి తొందరపాటు వలన ఇబ్బందులకు గురి కాగలరు.బాంకింగు రంగం వారికి,పప్పుల వ్యాపారం వారికి మంచి మాసం. ఈ మాసం మీ అదృష్ట సంఖ్యలు 5,6. దుర్గా సప్తశ్లోకీ చదవండి.

కర్కాటక రాశి: నూతన ఉద్యోగం దొరకగలదు. మీ భూమి, మీ పట్టుదల ఎక్కడికీ పోవు.సమయాన్ని వృధా చేయకండి.సంఘం లో గౌరవం పెరగగలదు.నటులకు మంచి అవకాశాలున్నాయి.సాంకేతిక రంగం లో ఉన్న వారికి అభివృధ్ధి బాగున్నది.దూర ప్రయాణాలు తలపెట్టకపోవటం మంచిది.విద్యా రంగంలో ఉన్న వారికి,రాజకీయ నాయకులకి మంచి మాసం.అట్టహాసం వలదు.మాసం చివరి వారంలో కొన్ని అంచనాలు తారుమారు కాగలవు. కలవరచెందనవసరం లేదు.ఈ మాసం మీ అదృష్ట సంఖ్యలు 1,3. శ్రీ దత్తస్తవం చదవండి.

సింహ రాశి: మీకు హితము చేయు వారిని తొందరపాటు వలన దూషించటం జరుగగలదు.తస్మాత్ జాగ్రత్త.మీ ఇంటిలోని వారు గానీ దగ్గర బంధువులెవరైనా గానీ తప్పి పోవు ప్రమాదం ఉన్నది.కొత్తగా వివాహం అయినవారు తిరుపతి సందర్శించటం మంచిది. ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి.వైద్య రంగంలోని వారికి,ఎగుమతులు,దిగుమతులలో ఉన్నవారికి,వాహనాల వ్యాపారం వారికి లాభాలు బాగున్నాయి.చిత్ర పరిశ్రమ లోని వారు మరింత శ్రమించాలి.ఈ మాసం మీ అదృష్ట సంఖ్యలు 5,4.మహాసౌరం చదవండి.

కన్య రాశి: శ్రమ ఫలిస్తుంది. మీడియా రంగంలోని వారికి, సాంస్కృతిక, కళా రంగంలోని వారికి మంచి ఫలితాలున్నాయి. ఆదాయం బాగుంటుంది. ఒక మంచి భాగస్వామ్యం కలసి వస్తుంది.ఇంటి పనులకు కొంత వ్యయం కాగలదు.సూక్ష్మ బుధ్ధి ఉపయోగపడగలదు.మాసం చివర దూర ప్రయాణాలు సంభవం.కొత్త పనులను చేపడతారు.దైవ కార్యాలతో పాటు కొంత విలాసానికి కూడా ఖర్చు చేస్తారు.ఇంటిలోని పెద్దవారి ఆరోగ్యం విషయం ఆలోచించవలసి వస్తుంది.ఒక విదేశీ ఆహ్వానం రాగలదు.ఈ మాసం మీ అదృష్ట సంఖ్యలు 2,3.లక్ష్మీ అష్టోత్తరం చదవండి.

తుల రాశి: భార్యా భర్తలు తగువులకు వెళ్లటం జరుగగలదు.పోటీలు పోట్లాటలకు విషబీజాలు.అన్ని విషయాలోనూ కొలతలను వాడుకున్నప్పుడు కలతలు తప్పవు.వివాదాలకు దూరంగా ఉండండి.కొన్ని విషయాలలో సుదీర్ఘమైన చర్చలు జరుపుతారు.పిల్లలు మంచి అభివృధ్ధి కనబరుస్తారు. చక్కెర వ్యాధి ఉన్నవారు,కీళ్ల నొప్పులున్న వారు మాసాంతం సమయానికి జాగ్రత్తలు వహించాలి. విదేశాలలో ఉన్న వారికి మంచి ఫలితాలున్నవి.వివాహం కాని వారికి మంచి యోగం కనిపిస్తున్నది.ఈ మాసం మీ అదృష్ట సంఖ్యలు 14,17.హనుమాన్ చాలీసా చదవండి.

వృశ్చిక రాశి:ఈ మాసం మంచి యోగాలు ఉన్నాయి.తలచిన కార్యాలు నెరవేరుతాయి.మాట వినం అన్న వారు కొద్దిగా మరో సారి ఆలోచిస్తారు.మీరు సంకల్పించిన పనులను వివరంగా ముఖ్యమైన వారికి తెలియపరచటం చాలా అవసరం.పెట్టుబడులు జాగ్రత్తగా నిర్వహించాలి.డెయిరీ వ్యాపారం,రచనా రంగంలో ఉన్నవారికి,మైక్రో బయాలజీకి సంబంధించిన వారికి ఈ మాసం మంచి ఫలితాలున్నాయి.విదేశీ యానం తలపెట్టు వారకు అవకాశాలు బాగున్నాయి.మాసం మధ్య నుండి ఆదాయం పుంజుకోగలదు.ఏదైనా వ్రాయునప్పుడు ఒకటికి రెండు సార్లు యోచించవలసిన అవసరం ఉన్నది.ఈ మాసం 7,1 అదృష్ట సంఖ్యలు.ఆదిత్య హృదయం చదవండి.

ధను రాశి: గుండె సమస్యలున్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.సంతానం అభివృధ్ధి బాగున్నది.ఉద్యోగంలో మార్పు సంభవం.స్త్రీలు అధికంగా ఖర్చులు చేయగలరు.బ్రోకరేజ్,సర్వీస్ రంగం వారికి మంచి ఫలితాలుందగలవు. ఈ మాసం కొత్త పనులు ప్రారంభించగలరు.సోదరీమణుల నుంచి మంచి వార్తలు వినగలరు.పెట్టుబడులు మాసం ఉత్తరార్థంలో రాణించగలవు.నల్ల రంగును వాడకపోవటం మంచిది.వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం.ఐ.టి రంగం వారికి విదేశీ అవకాశాలు బాగున్నాయి.మీ మాటకు మంచి విలువ ఏర్పడగలదు.ఈ మాసం మీ అదృష్ట సంఖ్యలు 11,12.దేవీ ఖడ్గమాలా స్తోత్రం చదవండి.

మకర రాశి: నూతన వస్తువులు,వాహనాలు కొనుగోలు చేస్తారు.ఇంటిలో మార్పులుండగలవు.రెండవ వారం నుండి ఊహించని విధంగా ఒక యోగం కలసిరాగలదు.మంచి మిత్రుల సలహాలను పొందుతారు.జీవిత భాగస్వామి ఆరోగ్యం మీద దృష్టి సారించాలి. ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించటం మంచి ఆలోచన.సకాలానికి డబ్బు అందగలదు.ఒక కార్యక్రమంలో పాల్గొంటారు.కొందరు ఒక సార్వజనికమైన కార్యక్రమంలో మీ సహాయం కోరుతారు.ఈ మాసం మీ అదృష్ట సంఖ్యలు 6,14.సుబ్రహ్మణ్య కవచం చదవండి.

కుంభ రాశి: కొన్ని వృధా ఖర్చులతో మాసం ప్రారంభమయినప్పటికీ మాసం మొత్తంలో మంచి పరిణామాలుండగలవు.కొన్ని ఆహ్వానాలను అందుకుంటారు. స్థిరాస్తుల అమ్మకం జరగవచ్చు.మీ వ్యవహారం మిమ్మల్నే ఆలోచింప జేయగలదు.పట్టు విడుపు వలన  భవిష్యత్తులో కొన్ని సత్ఫలితాలుండగలవు.ఒక అవాంఛనీయ సంఘటన వలన కొంత కలవర చెందుతారు.గతంలో నిర్వర్తించని బాధ్యత అదనంగా నిర్వర్తించవలసి రాగలదు.ఈ మాసం మీ భవిష్యత్తు ప్రణాలికలకు మంచి మాసం. కాకపోతే మాసాంతానికి ఒక నిర్ణయం తీసుకోవటం అవసరం కాగలదు.నిత్యావసర వస్తువులు,దుస్తులు,దిగుమతుల రంగాల వారికి మంచి సమయం. ఈ మాసం మీ అదృష్ట సంఖ్యలు 4,12. విష్ణు సహస్రనామం చదవండి.

మీన రాశి: ఎన్నో సంఘటనల మధ్య,రక రకాల వ్యక్తుల మధ్య నిర్విరామంగా సాగిపోయే మాసం ఇది.సంగీతఙ్ఞులకు, కళాకారులకు విదేశీ అవకాశాలుండగలవు. చేతులలోంచి నాజూకైన వస్తువులు జారి పడగలవు. జాగ్రత్త వహించండి.ఉద్యోగాలలో రాణిస్తారు. వ్యాపారం ప్రారంభించే వారికి మంచి మాసం.ఉపాసనా మార్గంలో ఉన్న వారికి మంచి అనుభవాలుండగలవు.మాసం చివరి వారంలో ఆదాయం,ఆరోగ్యం బాగున్నాయి.వ్యవసాయం,కోళ్ల పరిశ్రమల వారికి లాభాలు బాగున్నాయి.ఈ మాసం మీ అదృష్ట సంఖ్యలు 19,21.

~~~***~~~

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~

Predictions according to the Sun Signs can be viewed at www.sripati.com

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “ఏప్రిల్ 2010 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: