‘వికృతి’ ఏమంటున్నది?-వేదాంతం శ్రీపతిశర్మ


శ్లో: సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థసాధికే

శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే
మిత్రులందరికీ వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు! ఈ సంవత్సరం అందరికీ శుభములు చేకూరాలనీ, మనస్తాపాలు తొలగిపోవాలనీ,’విరోధాలు ‘ పోయి మనస్సుకు కలిగే వికృతపు ఆలోచనలు మాయమవ్వాలనీ,దేశంలోనూ, లోకంలోనూ సుఖ శాంతులు సమృధ్ధిగా ఉండాలనీ ఈశ్వరుని ప్రార్థిస్తూ…గ్రహ సంచారం పరీక్షించి ఎటువంటి ఫలితాలుండగలవో ఒక సారి చెప్పుకుందాం.
ఓం వికృత్యై నమ:!
ఈ సంవత్సరం దేశంలో అనుకోని కాలంలో వర్షాలు,ఉత్తరార్థంలో వ్యాపారంలోనూ, ఆర్థికంగానూ మంచి పరిణామాలూ,సాంకేతిక రంగంలో,వైఙ్ఞానిక రంగంలో మంచి పురోగతి,క్రీడా రంగంలో మంచి ఫలితాలు,భారతీయులకు ప్రపంచ వ్యాప్తిగా గుర్తింపు పొందు పురస్కారాలు,విదేశ వ్యవహారాలలో మంచి పురోగతి కనిపిస్తున్నాయి.
పకృతి వైపరీత్యాలు ఆగస్ట్ తరువాత విరివిగా ఉండవచ్చు.ముఖ్యంగా భూకంపాలు-నేపాల్,ఉత్తరఖండ్,నాగ్ పూర్, హైదరాబాద్, నెల్లూరు ప్రాంతాల వారికి బెడద ఉన్నది.హైదరాబాదులో ముంబయి హైవే కు దగ్గరగా ఉన్న ప్రదేశానికి మరింత సమస్య కనిపిస్తున్నది. వంతెనలు కూలిపోవటం వలన ఉత్తర వాయువ్య ప్రదేశాలలో రైలు, రోడ్డు ప్రమాదాలుండవచ్చు.
గనులు,భూ వివాదాలు,ప్రభుత్వ పథకాల విషయాలలో కొన్ని స్కాం లు ఉండవచ్చు.
సంవత్సరం ఉత్తరార్థంలో రాజకీయ జట్ల కూటమిలో మార్పులుండగలవు.

మేష రాశి: స్త్రీల మధ్య విభేదాలుండవచ్చు.మనస్తాపాలు తొలగిపోతాయి.ఉత్తరార్థంలో మంచి ఫలితాలున్నాయి.పెద్దల మాట గౌరవించటం చాలా అవసరం.ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించాలి.ఆదాయం వ్యయం వెనుక పరుగు తీస్తుంది.నిరుద్యోగులకు మంచి అవకాశాలున్నాయి. ఈ వికృతి నామ సంవత్సరంలో మీరు తరచు చేయవలసిన పూజ-మాసానికి ఒక సోమవారం తప్పక శివునికి అభిషేకం జరిపించాలి.దీర్ఘకాలీన సమస్యలు తొలగిపోవటం శుభసూచకం.

వృషభ రాశి: ఇది అదృష్టం కలసి వచ్చే సంవత్సరం. కాకపోతే పెద్దల మధ్య భేదాభిప్రాయాలుండటం వలన కొంత వ్యవధి వృధా కాగలదు.ఆస్త్తి కొనుగోలు సంభవం.మే నెలలో చక్కని అవకాశాలున్నాయి.పిల్లలు మాట వినకపోవటం వలన కొంత చికాకు ఈ సంవత్సరం కనిపిస్తున్నది.ఆదాయం బాగానే ఉన్నది.ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఎక్కువగా దాన ధర్మాలు ఆచరిస్తే మంచి ఫలితాలుండవచ్చు. నవంబర్ మాసంలో చేసే పనులు ఆలోచించి చేయాల్సి ఉంటుంది.

మిథున రాశి: మీ ఓర్పు వలన అనుకోనివి సాధిస్తారు.మీ మీద ఉన్న అభియోగాలు తొలగిపోతాయి.సంతానం అభివృధ్ధిలోకి రాగలదు.నలుగురికీ సహాయం చేస్తారు.సెప్టెంబర్ తరువాత ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.మొత్తానికి ఇది అద్భుతమైన సంవత్సరం.ఈ రాశి వారు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య కవచం చదవటం మంచిది.ఇంటిలో ఈ రాశివారు ఎవరైనా ఉంటే వారిదే పై చేయి.

కర్కాటక రాశి:ఈ రాశి వారికి పదోన్నతులు కనిపిస్తున్నాయి.కొన్ని అప్పులు చేయగలరు.జూన్ తరువాత స్థానచలనం ఉండగలదు.వివాహయోగం బాగుంది.

ఏప్రిల్ మే నెలలలోని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించినందుకు ఈ రాశి వారికి జులై నుండి మంచి ఫలితాలుండవచ్చు.ఉద్యోగస్తులు కోరుకున్న చోటుకు బదిలీ పొందగలరు.వ్యాపరస్తులు కొత్త వ్యాపారాలు ప్రారంభించగలరు. ఈ రాశి వారు ఈ సంవత్సరం కులదైవాన్ని ప్రతి మాసం కొలవటం చాలా మంచిది.

సింహ రాశి: కొన్ని అపవాదులు ఈ సంవత్సరం మీ మీద మోపబడగలవు. ఎక్కువ భాగం మౌనం పాటించటం ఎంతో శ్రేయస్కరం.ఆలోచనల  కంటే ఆలోచనల అమలు విషయంలో ఆసక్తి చూపాలి. ఈ సంవత్సరం ప్రణాలికలకు కాదు.ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.గతంలో ఆచరించిన సత్కార్యాలకు మంచి ఫలితం లభిస్తుంది.వ్యాపారస్తులు డిసెంబర్ తరువాత మార్పులు తలపెట్టగలరు.ఈ రాశి వారు ప్రతి ఆదివారం మహాసౌరం చదవటం చాలా మంచిది.
కన్య రాశి: ఒక నిర్లిప్తత నుండి ఈ సంవత్సరం బయట పడతారు.మీకు తెలియని ధైర్యం మీలోంచి బయట పడగలదు.పలువురికి మీరు అర్థం కాకపోవచ్చు.న్యాయపరమైన విషయాలలో మీదే పై చేయి ఉండగలదు.ఆగస్ట్ లో విదేశీ యానం ఉండగలదు.జీవితం అనుకోని మార్పులకు గురి అయ్యే అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నవి. ఈ రాశి వారు ఈ సంవత్సరం నిత్యం శ్రీసూక్తం పారాయణ చేయటం చాలా మంచిది.
తుల రాశి: బంధువుల వలన చికాకులు ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నాయి.వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు మంచి లాభాలున్న సంవత్సరం.భాగస్వామ్యానికి కొందరు ముందుకు రాగలరు.స్త్రీలు పలు రంగాలలో రాణించగలరు.ఆధ్యత్మికత వైపు మనసు లగ్నం కాగలదు.రాజకీయ రంగంలోని వారికి సంవత్సరం తొలి దశలో కంటే మలి దశలో మంచి విజయాలున్నాయి.ఈ రాశి వారు ఈ సంవత్సరం ప్రతి శనివారం అయినా విష్ణు సహస్రనామం చదవాలి.
వృశ్చిక రాశి: ఈ సంవత్సరం మీరు ఇష్ట పడని పై అధికారులే మంచివారని గ్రహిస్తారు.మీరు మీ తెలివితేటలతో, విచక్షణా ఙ్ఞానంతో కార్యాలను సాధించవలసియుంటుంది.జూన్ మాసంలో ఒక చిక్కు సమస్య కలవరపెట్టగలదు.జనవరి 2011 లో దీర్ఘకాల సమస్య ఒకటి పరిష్కారం కాగలదు.బంధు వర్గంలో వివాహాలు జరుగగలవు.ఈ రాశి వారు ఈ సంవత్సరం దుర్గా సప్తశ్లోకీ నిత్యం పారాయణ చేయవలసి యుంటుంది.
ధను రాశి:మనోవాంఛలు అధికంగా ఉండు సంవత్సరం.నూతన వాహనయోగం ఉన్నది.జులై మాసంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.మార్కెట్లో మే వరకు,ఆ తరువాత అక్టోబర్ నుండి పెటుబడులకు మంచిది.నూతన పరిచయాలు ఏర్పడగలవు.కుటుంబాన్ని వదిలి వెళ్లలేకపోవటంతో మంచి ఆదాయం గల మార్గాలను వదులుకుంటారు.సార్వజనిక రంగంలో ఉన్నవారు అధికంగా ప్రయాణాలు చేయాల్సి ఉండవచ్చు.ఈ రాశి వారు ఈ సంవత్సరం నిత్యం శ్రీదత్తస్తవం చదవటం మంచిది.
మకర రాశి: సంవత్సరం మొదటి భాగంలో శ్రమ పడి పలు కార్యాలను పూర్తి చేయవలసి యుండగలదు.స్పష్ట మైన కార్యప్రణాలిక లేకపోవటం వలన కొన్ని ఎదురుదెబ్బలు ఉత్తరార్థంలో ఉండగలవు.నూనె, గ్యాసు వ్యాపార్స్తులు మంచి లాభాలు పొందగలరు.విద్యార్థులు అధికంగా శ్రమించవలసి యుంటుంది.మార్కెటింగ్ రంగం, ఏజెన్సీలు నడుపువారికి మంచి లాభాలుండగలవు.దూర ప్రయాణాలు,ఖర్చులు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం మంచి ఫలితాలతోనే ముగియగలదు. ఈ రాశి వారు ఈ సంవత్సరం నిత్యం లక్ష్మీ అష్టోత్తరం చదవటం మంచిది.
కుంభ రాశి: కొన్ని పనులను వేగంగా పూర్తి చేయవలసిన అవసరం ఉన్నది. కొన్ని బాధ్యతలను ప్రక్కన పెట్టి ప్రవర్తించటం వలన సమస్యలుండగలవు. ఋణ ప్రయత్నం ఫలించగలదు.మీడియా వర్గం వారికి మంచి ఫలితాలున్నవి. రాజకీయ రంగంలోని వారు సమయానుకూలతతో వ్యవహరించి లబ్ధి పొందగలరు.మే మాసంలో సంతకాలు చేసే సమయంలో ఒకటికి రెండు సార్లు చదివి చేయవలెను. ఈ రాశి వారు ఈ సంవత్సరం దేవీ ఖడ్గమాలా స్తోత్రం చదివితే మంచిది.
మీన రాశి:  ఈ సంవత్సరం ఈ రాశి వారు అనుకోని రీతిగా ప్రజల మధ్యలోకి రాగలరు.గౌరవం పెరగగలదు.విదేశాల నుండి  మంచి అవకాశాలుండగలవు. విద్యార్థులకు జూన్ తరువాత విదేశ యానం ఉండవచ్చు. పరిశోధనా రంగం లోని వారికి తగు గుర్తింపు లభించగలదు. సంతానం అభివృధ్ధి లోకి రాగలదు.ఈ రాశి వారు ఈ సంవత్సరం ప్రతి శని వారం గోవులకు గ్రాసం వేయాం మంచిది. ఈ సంవత్సరం మీ స్వంత విచక్షణను వాడ వలసిన అవసరం యున్నది.
~~~***~~~
‘వికృతి ‘ లో మన ప్రకృతిని  ,పర్యావరణాన్ని సంరక్షించే సంకల్పం చేద్దాం.
~~~***~~~
సర్వే జనా: సుఖినో భవంతు!
ఓం శాంతి: శాంతి: శాంతి:
~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

9 thoughts on “‘వికృతి’ ఏమంటున్నది?-వేదాంతం శ్రీపతిశర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: