కార్తిక్ కాలింగ్ కార్తిక్-చిత్రం గురించి వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు


ఒక గది తలుపు తెరిచే వరకు అది ఓ గదిలా కనిపిస్తుంది.తలుపు తట్టాలి,తెరవాలి,తొంగి చూడాలి.అది గుడి కావచ్చు,ఒక పురావస్తుశాల కావచ్చు,ఒక హోటల్,కార్యాలయం…ఏదైనా! ఒక వ్యక్తి లోని భావాలు,గతస్మృతులు,నిజాలనుకున్న మాయలు,ఊహలు…ఆశలు,తరాలు,అంతరాలు,అన్నీ కలుపుకుని ఒక వ్యక్తి కూడా ఒక అర్థం కాని మ్యూసియం!అర్థం కాని ఒక వస్తువును అభిమానించేదెంతమంది? ఆదరించేదెవరు?…
కార్తిక్ ను కాల్ చేద్దాం…
~~~***~~~
రితేశ్ సిధ్వాని, ఫర్హాన్ అఖ్తర్ నిర్మించి,విజయ్ లల్వాని దర్శకత్వం వహించిన ఈ హిందీ చిత్రం లో ఫర్హాన్ అఖ్తర్, దీపికా పాడూకొణే, రాం కపూర్ ఇత్యాదులు నటించారు.
ఫర్హాన్ స్ఖిజొఫ్రినియాతో బాధపడుతున్న వ్యక్తి. (డెల్యూషన్ల మధ్య తీవ్రమైన ఒక మానసిక స్థితి ఈ వ్యాధి.ఆ దృశ్యాలు నగ్న సత్యాలుగా నమ్ముతూ మరో వ్యక్తిత్వం లోకి జారిపోవు స్వభావం వీరికి ఉంటుంది.)
ఆ విషయం మనకు దర్శకుడు చెప్పడు.అతనికి అతని నుంచే ఫోన్లు వస్తూ ఉంటాయి.ఒక కన్స్ట్రక్షన్ కంపనీలో భయం భయంగా పని చేస్తున్న కార్తిక్ కు కార్తీకే ఫోనులో తరచూ మాట్లాడుతూ పధ్ధతులను మార్చుకోమంటాడు.ధైర్యంగా మాట్లాడి, తన ప్రతిభకు సరైన విలువను, విజయాన్ని పొందుతాడు.ఆ పరంపరలో తను ఇష్ట పడిన షోనాలి (దీపిక) తో కూడా సముచితమైన వ్యవహారం చేసి దగ్గరవుతాడు.షొనాలి అప్పటికే చాలా సార్లు మగవాళ్ల దగ్గర మోసపోవటం వలన కార్తీక్ ను నిజాలు తప్ప ఏమీ చెప్పవద్దని అడుగుతుంది.కార్తీక్ కు కార్తీకే చేసే ఫోన్ల గురించి ఎట్టి పరిస్థితులలో చెప్పకూడదని కార్తీకే చెబుతాడు.కానీ తప్పనిసరయి చెప్పేస్తాడు. షొనాలి డాక్టర్ దగ్గరకు బలవంతంగా పంపిస్తుంది.ఆ డాక్టర్ వీటిని నమ్మవద్దని చెప్పి అతనికి నమ్మకం కుదరాలని ఇంటికి కూడా వచ్చి ఆ ఫోను కోసం వేచి కూర్చుంటుంది.కార్తీక్ అక్కడ ఉండగానే ఫోను వస్తుంది. అతని గొంతు ఫోనులో విని ఆ డాక్టర్ గాభరా పడి వెళ్లిపోతుంది.షొనాలీ కూడా ఇంటికి వచ్చి ఆ గొంతు వింటుంది.

ఒక గది తలుపు తెరిచే వరకు అది ఓ గదిలా కనిపిస్తుంది.తలుపు తట్టాలి,తెరవాలి,తొంగి చూడాలి.అది గుడి కావచ్చు,ఒక పురావస్తుశాల కావచ్చు,ఒక వేశ్యాగృహం కావచ్చు,హోటల్,కార్యాలయం…ఏదైనా! ఒక వ్యక్తి లోని భావాలు,గతస్మృతులు,నిజాలనుకున్న మాయలు,ఊహలు…ఆశలు,తరాలు,అంతరాలు,అన్నీ కలుపుకుని ఒక వ్యక్తి కూడా ఒక అర్థం కాని మ్యూసియం!అర్థం కాని ఒక వస్తువును అభిమానించేదెంతమంది? ఆదరించేదెవరు?…
కార్తిక్ ను కాల్ చేద్దాం…
~~~***~~~
రితేశ్ సిధ్వాని, ఫర్హాన్ అఖ్తర్ నిర్మించి,విజయ్ లల్వాని దర్శకత్వం వహించిన ఈ హిందీ చిత్రం లో ఫర్హాన్ అఖ్తర్, దీపికా పాడూకొణే, రాం కపూర్ ఇత్యాదులు నటించారు.
ఫర్హాన్ స్ఖిజొఫ్రినియాతో బాధపడుతున్న వ్యక్తి. (డెల్యూషన్ల మధ్య తీవ్రమైన ఒక మానసిక స్థితి ఈ వ్యాధి.ఆ దృశ్యాలు నగ్న సత్యాలుగా నమ్ముతూ మరో వ్యక్తిత్వం లోకి జారిపోవు స్వభావం వీరికి ఉంటుంది.)ఆ విషయం మనకు దర్శకుడు చెప్పడు.అతనికి అతని నుంచే ఫోన్లు వస్తూ ఉంటాయి.ఒక కన్స్ట్రక్షన్ కంపనీలో భయం భయంగా పని చేస్తున్న కార్తిక్ కు కార్తీకే ఫోనులో తరచూ మాట్లాడుతూ పధ్ధతులను మార్చుకోమంటాడు.ధైర్యంగా మాట్లాడి, తన ప్రతిభకు సరైన విలువను, విజయాన్ని పొందుతాడు.ఆ పరంపరలో తను ఇష్ట పడిన షోనాలి (దీపిక) తో కూడా సముచితమైన వ్యవహారం చేసి దగ్గరవుతాడు.షొనాలి అప్పటికే చాలా సార్లు మగవాళ్ల దగ్గర మోసపోవటం వలన కార్తీక్ ను నిజాలు తప్ప ఏమీ చెప్పవద్దని అడుగుతుంది.కార్తీక్ కు కార్తీకే చేసే ఫోన్ల గురించి ఎట్టి పరిస్థితులలో చెప్పకూడదని కార్తీకే చెబుతాడు.కానీ తప్పనిసరయి చెప్పేస్తాడు. షొనాలి డాక్టర్ దగ్గరకు బలవంతంగా పంపిస్తుంది.ఆ డాక్టర్ వీటిని నమ్మవద్దని చెప్పి అతనికి నమ్మకం కుదరాలని ఇంటికి కూడా వచ్చి ఆ ఫోను కోసం వేచి కూర్చుంటుంది.కార్తీక్ అక్కడ ఉండగానే ఫోను వస్తుంది. అతని గొంతు ఫోనులో విని ఆ డాక్టర్ గాభరా పడి వెళ్లిపోతుంది.షొనాలీ కూడా ఇంటికి వచ్చి ఆ గొంతు వింటుంది.

కార్తీక్ లోని కార్తీక్ మాట్లాడటం అందరికీ తెలియటం పట్ల ఆగ్రహంతో ‘ఆ ‘ కార్తీక్ ఈ కార్తీక్ కి విరుధ్ధంగా అందరికీ ఫోన్లు చేసి మరల ఇతన్ని నిర్వీర్యుడిని చేస్తాడు.ఇతను ఉద్యోగం,అమ్మాయి అందరినీ వదిలేసి కేరళకు వచ్చేసి ఫోను లేకుండా చూసుకుని ఉద్యోగం చేసుకుంటాడు.తన వ్యక్తిత్వం తో సమాధానపడి తిరిగి షొనాలీకి మెయిల్ పంపుతాడు. సైకియాట్రిస్ట్ ఫోన్ల విషయంలో ఒక కొత్త ఆడ్లు ఉన్న బ్రోచర్ చదివి వెంటనే షొనాలీకి ఫోన్ చేసి మాట్లాడుతుంది.కార్తీక్ ఇంతకీ తన గొంతునే రికార్డ్ చేసి అయిదింటికి అలారం పెట్టి ఫోను వచ్చేటట్లు చేసి తనను తాను ఈ మానసిక రోగం వలన మోసం చేసుకుంటున్నాడని తేలుస్తుంది.

కార్తీక్ చిన్నప్పుడే అతనికి ఒక అన్న ఉన్నట్లు,అతడు ఒక బావిలో పడిపోయినట్లు,దనికి కార్తీకే కారణం అని అనుకుంటూ తరచూ కుమిలిపోవటం మనకు కనిపిస్తుంది.కానీ నిజానికి అన్నయ ఎవరూ లేరని,అది కూడా ఈ వ్యాధిలోని భాగమేనని చెప్పటం జరుగుతుంది. షొనాలితో కలసి కార్తీక్ తిరిగి చికిత్స పొందటం ప్రారంభిస్తాడు.

కాలర్ ఐ.డి ఫోనుతో చూడాలని సైకియాట్రిస్ట్ కు అనిపించకపోవటం కొద్దిగా కథకు గల ఇబ్బంది…

~~~***~~~

దర్శకుడు సులువైన మార్గం ఎంచుకున్నాడు.ప్రేక్షకులు ఈ ఫోను నిజమా,ఎవరిది అనే ఆలోచనకు కట్టు బడి సినిమా యావత్తూ ఉత్కంఠతో చూడాలని నిర్ణయించి ఈ వ్యాధికి గల అంశాలను చాలా జాగ్రత్తగా ప్రదర్శించాడు. కథ ప్రారంభమయిన కొద్ది వ్యవధిలో ఒక సంఘటన జరగకపోతే కథ నడుస్తుంది కానీ ప్రేక్షకుడి మెదడులో అది సాగదు.ఇది బాగా గుర్తించాడు.చాలా సార్లు ఈ మానసిక పరిస్థితిలో రోగి ఆ పరిస్థితితో ఒక మక్కువను పెంచుకోవటం కూడా ఉండవచ్చు.ఒక విశేషమైన పరిస్థితిని నేపథ్యంగా పెట్టి సగటు మనుషుల స్పందనను చాలా బాగా చిత్రీకరించారు.ప్రేక్షకుని దృక్పథం లోనే సాగాలని నిర్ణయించటం వలన అంతా చీకటి అయినప్పుడు కార్తీక్ అలా కేరళ వైపు వెళ్లాలని స్వయంగా ఒక నిర్ణయం తీసుకునే ముందు అలా ఎందుకు అనే ఆలోచనకు ఒక దృశ్యాన్ని కూడా కేటాయించలేదు. వాస్తవానికి కథ మొత్తం కార్తీక్ లోపల జరిగేది.మనకు కనిపించేది మరొకటి!అదే ఆ వ్యాధి లక్షణం.ఈ దర్శకుడిలో ట్రీట్మెంట్ విషయంలో అసమానమైన ప్రతిభ ఉంది.కథాంశంతో శ్రమ పడి పోరాడి కథనం, చిత్రీకరణ వంటి విషయాలలో తనలోనే ఒక క్లైమాక్స్ కు వచ్చి ఆ తరువాతఏ షెడ్యూల్ కు వెళ్లె దర్శకులు చాలా పైకి వస్తారు…

ఈ కోవలో తెలుగులో ‘శారద ‘,’ఆమె కథ ‘ అనే చిత్రాలు గుర్తుకు వస్తాయి.ఆమె కథ చిత్రం నిజ జివితంలో చుట్టూ జరిగే సంఘటనలు,అతి సామాన్యంగా కనిపించే పాత్రల మధ్య ఆ పాత్ర అలా అద్భుతంగా సాగిపోతుంది.కార్తీక్ కాలింగ్ కార్తీక్ చిత్రంలో సంవాదాలు నవ్విస్తాయి.ఏ క్షణంలోనూ సీట్లోంచి లేవాలనిపించదు. కథకు ఎంతో అనుగుణంగా నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు.

ఫర్హాన్ అఖ్తర్ నటన ఆకట్టుకుంటుంది.నా ప్రతిభ చూపించాలి అని అనుకుని నటించటం ప్రారంభిస్తే వెండి తెర మండి తగలడిపోతుంది! ఇక్కడే స్టేజ్ బేలెన్స్ ముఖ్యం.కథలో నటించటం, కథ కోసం నటించటం…ఈ రెండిటికీ వ్యత్యాసం తెలియటం అంత తేలిక కాదు.గాలిలో ఎగరటంలో గద్దలకూ కాకులకూ తేడా మనం చూస్తాం.గద్ద గాలికి అనుగుణంగా రెక్కలను ఒక కోణంలో స్థిరం చేసి ఆ గాలినే వాడుకుని ముందుకు పోతుంది.అలా కథాంశాన్ని వాడుకుంటూ సాగిపోయే నటుడు చాలా తెలివి గల నటుడు.కొంత సమయం గడచిన తరువాత కథే అతని నటన గురించి చెబుతుంది.

ఫర్హాన్ కొన్ని సన్నివేశాలలో కనుపాపలను ఒక కోణానికి కేవలం అరక్షణం తీసుకుని వెళ్లి ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపించి మరల మామూలుగా మట్లాడతాడు.ఇది చక్కని టెక్నిక్. ఈ వ్యాధి గల వారు దాదపు ఇలానే ప్రవర్తించటం మనం చూస్తాం.ఫర్హాన్ ప్రతిభ గల వాడు. మంచి పాత్రలు వస్తే ఎంతో ఖ్యాతి పొందగలడు.

దీపికా పాడుకొణె ఒక ‘ఆధునిక ‘ మహిళగా బాగానే నటించినప్పటికీ కెమెరా పట్టుకున్న వారు ఆమె విషయంలో జాగ్రత్త వహించాలి.కొన్ని కోణాలలో ఆమె విచిత్రంగా కనిపిస్తుంది.నవ్వినప్పుడు డింపుల్ కనపడాలని ప్రయత్నిస్తే క్లోస్ అప్ లో  నాసిక పరిస్థితి అదోలా ఉంటుంది….

~~~***~~~

ఎడిటింగ్ చేసిన ఆర్తీ బజాజ్ కష్ట పడ్డట్లే ఉన్నది.కాకపోతే సర్జెయి ఐసెన్స్టియన్ చిత్రాలు (అప్పటివయినా)-స్ట్రైక్,బేటల్ షిప్ పోటెంకిన్ ఒక సారి చూస్తే బాగుంటుంది.సెమియోలొజీ, డికన్స్ట్రక్షన్ ప్రక్రియలను మరో సారి అధ్యయనం చేస్తే ఈ చిత్రంలో జంప్ అయిన కొన్ని విషయాలు కనిపించగలవు.ఒక అంశానికి ఈ ప్రక్రియలలో ఎంత సమయం కేటాయించగలము (తెర మీద) అనేది అలాయిన్ రెస్నీఇస్ చిత్రం లాన్నీ దెర్నియర్ అ మరీంబాద్ (1961) చూసినప్పుడు అవగాహనలోకి రాగలదు.

~~~***~~~

‘కార్తీక్ కాలింగ్ కార్తీక్’  తప్పకుండా చూడవలసిన చిత్రం.

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “కార్తిక్ కాలింగ్ కార్తిక్-చిత్రం గురించి వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: