28.02.2010-06.03.2010 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక: నిరంతరం మంగళమాతనోతు

ఈ వారం గ్రహస్థితి: రవి,బుధ,గురువులు కుంభం, శుక్రుడు కుంభ మీన రాశులు, కేతువు మిథునం, కుజుడు కర్కాటకం,శని కన్య,రాహువు ధను,చంద్రుడు సింహ,కన్య,తుల,వృశ్చిక రాశులు సంచరిస్తున్నారు.

బాధ్యతల నడుమ కొంత ఊరట కోసం సమయం,ధనం రెండూ వెచ్చించాలని పలువురు ఈ వారం  యోచించగలరు.కళాకారులకు,స్త్రీలకు మంచి అవకాశాలున్న వారం.నూతన వస్తు సేకరణ,పాత సంబంధాలు మెరుగు పడాలనే సంకల్పం,ఆదాయం పెంచుకునే మార్గాలను వెతకటం జరుగగలదు.   వ్యాపారం,స్టాక్ మార్కెట్ మంచి వృధ్ధిలోకి రాగలదు.రసాయన రంగం,ఐ.టి రంగం లాభాలు చూపగలదు.ఆటో మొబయిల్ రంగం కూడా మెరుగు పడగలదు.ప్రముఖమైన స్థలాలలో దొంగతనాలు జరుగగలవు.

మేష రాశి: మీ అంచనా తారుమారు కాగలదు.ఆలోచనా విధానం ఒకే పంథాలో సాగటం వలన మీ చుట్టూ ఉన్న వారిని మీరు తక్కువగా అంచనా వేయగలరు.కొన్ని నిజాలు తెలుసుకుంటారు.రాబోయే శనివారం ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి.ఖర్చులు అధికంగా ఉండవచ్చు. విష్ణు సహస్రనామం చదవండి.

వృషభ రాశి:ఇంటిలోని సభ్యులలో భిన్నాభిప్రాయాల వలన ఒక చిత్రమైన పరిస్థితి ఏర్పడగలదు.వారాంతానికి సద్దుకోగలదు.ఆదాయం బాగుంది.బుధవారం మంచి లాభాలు ఉండగలవు.అవివాహితులకు మంచి సమయం.వాహన సౌఖ్యం బాగుంది.

మిథున రాశి: నూతన వ్యక్తులు పరిచయం కాగలరు.దీర్ఘకాలీన సమస్య ఒకటి పరిష్కారం వైపుకు పయనించటం వలన కొన్ని అర్థం కాని సన్నివేశాలు ఎదురు కాగలవు.నవ్వేసి వదిలేయగలరు.ఉద్యోగంలో మార్పులుండవచ్చు.శుక్రవారం మంచి వార్త వినగలరు.దుర్గా సప్తశ్లోకీ చదవండి.

కర్కాటక రాశి:దైవ చింతన పెరగగలదు.ఖర్చులు అధికంగా ఉండగలవు.సంఘంలో గౌరవం పెరగవచ్చు.స్త్రీల వలన లాభాలున్నాయి.కొత్త అలోచన వలన ఒక పనిని వాయిదా వేస్తారు.కలుషితమైన నీరు త్రాగటం వలన ఇబంది ఉండగలదు.దూరపు బంధువులు మీ యోగక్షేమాలు తెలుసుకుంటారు.

సింహ రాశి: పిల్లలు మంచి పురోగతి చూపగలరు.ఇతరుల విషయాలలో జోక్యం చాలా హానికరం.పెద్దల ఆరోగ్యం కలవరపెట్టగలదు.జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలుండగలవు.పరిశోధనా రంగం వారికి మంచి ఫలితాలుండగలవు.శివాలయం సందర్శించగలరు.

కన్య రాశి: పోయిందనుకున్నది మరింత దృఢమయి మీ వద్దకు రాగలదు.మనోధైర్యం పెరుగుతుంది.మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది.శ్రమతో పనులు పూర్తి చేస్తారు.ఆదాయం ఉత్సాహకరంగా ఉంటుంది.కొందరు అహంకారంతో ప్రవర్తించగలరు.అది వారి సమస్య.శ్రీసూక్తం చదవండి.

తుల రాశి:చాలా యోగాలున్న వారం.దీర్ఘకాలీన ప్రణాలికలు రూపొందనున్నాయి. ఒక సార్వజనికమైన ప్రదేశంలో మీరు పలికిన మాటలు  అందరినీ ఆకట్టుకుంటాయి. విద్యార్థులకు విదేశాలలో అవకాశాలు రాగలవు.కార్యాలయంలో కొత్త పని ప్రారంభం కాగలదు.

వృశ్చిక రాశి: మీకు ఏ రంగంలోనైతే ప్రతిభాపాటవాలు కలవో అవి ఎల్ల వేళలా మీ ముందు ఉండకపోవటమే జీవితం నేర్పే పాఠం.మీ పధ్ధతి అన్నింటిలో పనికిరాకపోవచ్చు.గుర్తించి మసలుకోవలసిన అవసరం ఉన్నది.వారాంతానికి మీ అదృష్టం కలసిరాగలదు.లక్ష్మీ అష్టోత్తరం చదవండి.

ధను రాశి:మధ్యవర్తిత్వం చేసే వారు జాగ్రత్తగా మసలుకోవాల్సిన వారం.ఇంటిలోని సమస్య ప్రస్తుతానికి సద్దుకో గలదు.నిరుద్యోగులకు మంచి అవకాశం ఉండగలదు.ఆరోగ్యం మెరుగుపడుతుంది.మంగళవారం లాభాలు పొందుతారు.కొత్త పనులకు సమయం ఇంకా రాలేదు. వేచి చూడండి.హనుమాన్ చాలీసా చదవండి.

మకర రాశి:కొంత అవకాశవాదం కనిపిస్తున్నది.అందరికీ ఒకే కథ వినిపించటం వలన మిత్రులు అపార్థం చేసుకోగలరు. ఒక సభలో పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రధ్ధ వహించాల్సి ఉంది. పెద్ద వారి కోసం కొన్ని ప్రణాలికలు వేయగలరు.స్త్రీల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉన్నది.

కుంభ రాశి: ప్రేమ వ్యవహారం పాకాన పడనున్నది. దూర ప్రయాణం,స్థాన చలనం,నలుగురితో సంప్రదింపులు ఉండవచ్చు.కొన్ని బాధ్యతలను విస్మరించినట్లయితే సమస్యలుండగలవు.దేవీ ఖడ్గమాలా స్తోత్రం చదవండి.

మీన రాశి: ఈ వారం మంచి సౌఖ్యం,అదృష్టం కలసి రాగలవు.ఒక ఆస్తి వివాదం తలెత్తగలదు.ఇటీవల మీరు ఇతరులకు సహకరించి పూర్తి చేసిన పని మెప్పు పొందగలదు.బంధువర్గమ్నుండి మంచ్ వార్తలు వింటారు.ఉద్యోగంలో మార్పు కోరటం ప్రస్తుతానికి మంచిది కాదు.

ఈ వారం మంచి మాట:

శ్లో: వ్యసనే హి కచ్చిదాఢ్యస్య దుర్బలస్య చ రాఘవ

అర్థం విరాగా: పశ్యంతి తవామాత్యా బహుశృతా:

(శ్రీమద్వాల్మీకి రామాయణం,కచ్చిత్సర్గ,58)

ఉన్నవారికి, లేనివారికి మధ్య తగువు ఏర్పడి నీ వద్దకు వారు వచ్చినప్పుడు నీ మంత్రులు వారితో సమానంగా వ్యవహరిస్తున్నారా లేదా?

(శ్రీరాముడు భరతుని ప్రశ్నిస్తాడు)

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి:శంతి:

~~~***~~

(Predictions in English according to the Sun Signs  for the month of March 2010 can be viewed  by clicking www.sripati.com)

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “28.02.2010-06.03.2010 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: