14-20.02.2010 రాశి ఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక: నిరంతరం మంగళమాతనోతు

ఈ వారం గ్రహస్థితి:రవి శుక్ర గురు గ్రహాలు కుంభం,కేతువు మిథునం,కుజుడు కర్కాటకం,శని కన్య,రాహువు ధను,బుధుడు మకరం,చంద్రుడు కుంభ, మీన, మేష రాశులు సంచరిస్తారు.

రాజకీయ రంగంలో మొండి వైఖరులు,సిధ్ధాంతపరమైన విరోధాలు,పశువులకు ఆరోగ్య సమస్యలు,మార్కెట్ వారం మధ్య నుండి కొద్దిగా పుంజుకోవటం,అంతర్జాతీయ వ్యవహారాలలో ఒక విచిత్రమైన ఒరవడి,ఒక ఖనిజాన్ని ఆవిష్కరించటం కొన్ని సూచనలు.

గర్భిణీ స్త్రీలు విశేషమైన జాగ్రత్తలు తీసుకోవలసిన వారం.

మేష రాశి: ఆస్తి విషయాలు చర్చకు వస్తాయి.పెద్దల నుండి సంక్రమించిన అనారోగ్యం కూడా బాధించగలదు.మంచి సమయం కోసం వేచి యుండి భవిష్యత్తు ప్రణాలికలను పరిశీలించండి.గురువారం వ్యాపారం లాభించగలదు.ఈ శనివారం అప్పు చేయటం అంత మంచిది కాదు.అధ్యయనానికి మంచి వారం.శ్రీసూక్తం, విష్ణు సహస్రనామం చదవండి.

వృషభ రాశి: ఉపాసన మార్గం మీకు చేరువలోనున్నప్పటికీ మీరు ఏ కారణం చేతనో చేపట్టటం లేదు. కార్యాలయంలో కొన్ని విభేదాలుండవచ్చు.ఆశించిన డబ్బు కొంత ఆలస్యంగా అందగలదు.మీ సలహా పాటించి ఇతరులు లాభం పొందగలరు.సోమ బుధవారాలు అదృష్టం బాగుంటుంది.

మిథున రాశి: వింత ఆలోచనలు కలుగవచ్చు.ఇంటిలోని ఒకరి ఆరోగ్య పరిస్థితి అర్థం కాకపోవచ్చు.ఖర్చులు అధికం కావచ్చు.బుధ, శుక్రవారాలలో పెట్టుబడులు కలసిరాగలవు.విద్యార్థులకు మంచి అవకాశాలున్నాయి.సుబ్రహ్మణ్య కవచం చదవండి.

కర్కాటక రాశి:అనుకున్న కార్యాలు నెరవేరగలవు.కొంత సమయం వృధా కాగలదు.వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి.ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించాలి.

సింహ రాశి:సంఘంలో గౌరవం పెరుగుతుంది.కొత్త పనిని చేపడతారు.జీవిత భాగస్వామి మీ నుండి ఏదో ఆశించటం జరుగుతుంది.ఒక లేఖ అందుకుంటారు.ఈ మంగళ వారం అదృష్టం బాగుంది.మహాసౌరం చదవండి.

కన్య రాశి: బాధ్యతలు పెరుగుతాయి.ఒక్కొక్క పనిని నిదానంగా చేసుకోవటమే మంచిది.బంధువుల రాక ఉన్నది.మీ సహనం మీకు మంచి చేయగలదు.శ్రీసూక్తం చదవండి.

తుల రాశి:ఈ వారం ఒక చక్కని యోగం సంభవించనున్నది.వారాంతం లోపు ఏదైనా వీఅదం ఉంటే పరిష్కారం కోసం ప్రయత్నించండి. కొన్ని లావాదేవీలు జరుపుతారు.విష్ణు సహస్రనామం చదవండి.

వృశ్చిక రాశి: ఇంటి పనులు ముమ్మరం చేయగలరు.స్త్రీలతో వ్యవహరించునప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.స్థాన చలనం ఉండగలదు.మీ శ్రమకు తగు గుర్తింపు లభిస్తుంది.సోమవారం కలసి రాగలదు.

ధను రాశి:వారాంతానికి మంచి వార్త వింటారు.నూతన ఉత్సాహంతో పని చేస్తారు.విద్యార్థులకు పురోగతి బాగుంటుంది.ఈ వారమ్మీ అదృష్ట సంఖ్య 7.దుర్గా సప్తశ్లోకీ చదవండి.

మకర రాశి:మిత్రులతో విభేదాలు ఉండగలవు.భావోద్రేకంతో స్పందించటం కంటే సమయస్ఫూర్తితో స్పందించటం వలన లాభం పొందగలరు.దాచిపెట్టిన వ్యవహారం బయట పడటం వలన కొంత ఇబ్బంది ఉండవచ్చు.ఆదాయం బాగుంటుంది.

కుంభ రాశి:పరిస్థితులు మారినట్లు అనిపించగలదు.మారలేదని తెలుసుకుంటారు.లోపల అనుకుని బయట చెప్పని విషయాలు కాలం అయిపోయిన తరువాత చెప్పవలసి రావటం ఈ వారం విశేషం.నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభించగలవు.లింగాష్టకం చదవండి.

మీన రాశి: పెట్టుబడులకు మంచి అవకాశాలున్న వారం. విదేశాలలో ఒక అవకాశం రాగలదు. క్రీడలలో రాణిస్తారు.మధ్యవర్తిత్వం జరపవలసి ఉంటుంది.వాహనం సమస్య సృష్టిస్తుంది.పై అధికారులు కనిపెడుతున్నారు.జాగ్రత్త వహించండి.

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

38 thoughts on “14-20.02.2010 రాశి ఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: