‘మై నేం ఈస్ ఖాన్…’హిందీ చలన చిత్రం మీద వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు


వార్తలు చూస్తూ వీటి మీద ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనుకోవటం వేరు,ఒక కాన్సెప్ట్ ను ఎంచుకుని కథలో దానిని ఘటింపచేయటం వేరు.వీటికి తేడా తెలియని వారు తెలుసు అనుకుని తీసిన చిత్రం ఇది.
రిజ్వాన్ ఖాన్ (షాహ్ రుఖ్) అటిసం (ఒక మానసిక ప్రవృత్తి) తో బాధ పడుతున్న వ్యక్తి.తన తమ్ముని దగ్గరకు (అమెరికా) చేరుకుని అతని ప్రాడక్టులను అమ్మటానికి సేల్స్ మన్ గా చేరుతాడు.మందిరా(కజోల్)కు దగ్గరయి వివాహమాడతాడు.కజోల్ కి అప్పటికే ఒక పిల్లవాడు ఉంటాడు.అమెరికాలో జరిగిన ట్రేడ్ సెంటర్ అటాక్ ల తరువాత ఆ దేశంలో మహమ్మదీయుల పట్ల వారు కనపరచిన ద్వేషాన్ని దర్శకుడు ఇతివృత్తంగా ఎంచుకున్నాడు అని చెప్పటానికి ప్రేక్షకులను తేరగా ఎంచుకున్నట్లు కనిపిస్తుంది.అది ఇద్దరి ప్రేమ వ్యవహారంతో అతి కష్టంతో ముడి పెడతాడు.ఆ ముడికి సినిమా యావత్తూ వ్రేలాడి,సాగి, సాగి చివరకు కనీసం పది సార్లు టైం ఎంత అయింది అని చూసుకోమన్నాడు దర్శకుడు.
సామాన్యంగా షాహ్ రుఖ్ సినిమాలలో ఒక వేగం, ఒక జీవ కళ మనం చూస్తాం. పాపం ఆయన ఇలా సాగిపోవటం కొంత బాధే మిగిల్చింది. అమెరికా అధ్యక్షుని కలుసుకుని ‘మై నేం ఈస్ ఖాన్, అయాం నాట్ ఎ టెరరిస్ట్.’ అని చెప్పమంటుంది కజోల్.నీ వల్లనే కుర్రాడు చంపబడ్డాడని(తండ్రి మహమ్మదీయుడైనందుకు).ఆ ప్రయత్నంలో అతను ఎక్కడెక్కడో తిరిగి ఒక బీద పల్లెలో వరదలో సహాయ చర్యలు లేని పరిస్థితిలో ఇతను అక్కడికి చేరుకుని మహమ్మదీయులందరినీ ఏకం చేయగలిగి వారిని ఉధ్ధరించి ఒక తీవ్రవాదిని పట్టించి చివరకు హాలీవుడ్ లో అమెరికా అధ్యక్షుని పర్యటనలో ఆయనే స్వయంగా రిజ్వాన్ ను పిలచి మాట్లాడగా ‘మై నేం ఈస్ ఖాన్..’ అంటాడు! ఆ బాధలో పాపం షాహ్ రుఖ్ ‘మై నేం ఈస్ షాహ్ రుఖ్, అయాం నో లాంగర్ ఎ స్టార్…’అంటాడేమోననిపించింది!
షాహ్ రుఖ్ ‘రెయిన్ మాన్ ‘ చిత్రంలోని డస్టిన్ హాఫ్ మాన్ నుంచి బాగానే ఈ ‘ఆటిసం ‘ ప్రవృత్తికి గల మేనరిసం ను అవలంబించినట్లు కనిపిస్తుంది.కాకపోతే షాహ్ రుఖ్ సహజ నటుడు కాబట్టి ఆ పాత్రలో కూడా కొంత వైవిధ్యం తెచ్చాడు. ముఖ్యంగా ఒక చిన్న నవ్వు చేర్చి అదే సమయంలో కనుపాపలను దగ్గరకు తేవటం అంత తేలిక కాదు.ఆయన ప్రతిభను దర్శకుడు (కరణ్ జోహర్), స్క్రిప్ట్రైటర్ (శిబనీ భతీజా)కలసి చాలా జాగ్రత్తగా బూడిదలో పోశారనే చెప్పాలి. శిబాని భతీజా,నిరంజన్ ఐయంగార్ వ్రాసిన మాటలు కొద్దిగా చిత్రాన్ని నిలబెట్టాయి.
కథాంశం మంచిదైనా సినిమా ఎందుకు విఫలమవుతుంది అనేందుకు కథ పట్ల, ట్రీట్మెంట్ పట్ల సమగ్రమైన, సమతుల్యమైన అవగాహన లేకపోవటమే కారణమని చెప్పాలి. జరీనా వహాబ్ సినిమా ప్రారంభంలో షాహ్ రుఖ్ కు చెబుతుంది-లోకంలో రెండు రకాల మ్నుషులే!ఒకడు మంచి వాడు, రెండు చెడ్డ వాడు. ఆందరూ మనుషులే! నిజమే! కథాంశంలో వాస్తవం ఉన్నప్పటికీ ఈ సరైన అధ్యయనం,ఘటనాత్మకమైన తీరు తెన్ను లేనప్పుడు సినిమాలలో రెండే రకాలు మిగులుతాయి-మంచివి,పిచ్చివి…
~~~***~~~
ఒక పెద్దాయన ఇదంతా విని ఒక సవాలు విసిరారు. ఇదే కథాంశం ఆకట్టుకునే విధంగా ఎలా చేయవచ్చు అని!
నాకేమి తెలుసు? నేను సినిమా చూసి నా అనుభూతిని చెప్పాను. అంత మటుకే!
తప్పించుకుంటున్నారు అన్నారాయన.
‘ద టర్మినల్ ‘ చిత్రం చూసి కథ ఎక్కడ మొదలయిందో చెప్పండి, అన్నాను.ఒక మామూలు మనిషి అక్కడ ఇరుక్కున్నాడు.విధానాలు, సమస్యలు,దేశ విదేశ సంబంధాలు,నానా సమస్యలను అక్కడే చూపించేశాడు దర్శకుడు!
ప్రేక్షకుడు 9/11 ను లింకు చేసి మన హీరోను చూడాలంటే తెర మీద ఒక అమెరికాలో నివసిస్తున్న మహమ్మదీయుడు ఆ సంఘటనలో ఇరుక్కున్న వడిగా కనిపించాలి.తెర మీద ఈ సినిమాలో ఇది జరగకపోవటం ముందు చెప్పిన మాటను గుర్తు చేస్తుంది…వార్తలు చూస్తూ వీటి మీద ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనుకోవటం వేరు,ఒక కాన్సెప్ట్ ను ఎంచుకుని కథలో దానిని ఘటింపచేయటం వేరు.వీటికి తేడా తెలియని వారు తెలుసు అనుకుని తీసిన చిత్రం ఇది.
~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “‘మై నేం ఈస్ ఖాన్…’హిందీ చలన చిత్రం మీద వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: