07-13.02.2010 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక: నిరంతరం మంగళమాతనోతు
ఈ వారం గ్రహస్థితి:రవి మకర కుంభ రాశులు,గురు శుక్రులు కుంభం,కేతువు మిథునం,కుజుడు కర్కాటకం,శని కన్య,రాహువు ధను,బుధుడు మకరం,చంద్రుడు వృశ్చిక,ధను,మకర రాశులు సంచరిస్తారు.
ఈ గ్రహస్థితి ప్రజలలో ఒక అసంతృప్తి,కొంత ప్రలోభం,కార్యాచరణలో కొత్త ఒరవడులకు,అలవాటు పడ్డ పధ్ధతులకు మధ్య ఘర్షణ,మార్కెట్ లో ఒడిదుడుకులు,అర్థం లేని వివాదాలు,సముద్ర తీరంలో అలజడి సంభవం.
మేష రాశి: పోగొట్టుకున్నారనుకున్న ఆరోగ్యం తిరిగి పొందుతారు.ఈ వారం అనుకున్న పనులు నెరవేరుతాయి.ఇతరులను అపార్థం చేసుకున్నామని బాధ పడతారు.ఇటీవల అలవాటయిన తొందర పాటు వ్యవహారం నుండి బయట పడతారు.ఆలోచనలను అదుపులో ఉంచవలసిన వారం.విష్ణు సహస్రనామం చదవండి.
వృషభ రాశి: నిరుద్యోగులకు మంచి వారం.సంఘం లో గౌరవం లభిస్తుంది. కొత్త భాగస్వామ్యం ఏర్పడే సూచనలున్నాయి. గృహ నిర్మాణంలో ఉన్న కాంట్రాక్టర్లు లాభాలు పొందగలరు.ఈ శుక్రవారం ఒక వ్యవహారం ముగుస్తుంది.
మిథున రాశి: ఒక ఆలోచన కలసి వస్తుంది.కొత్త వస్తువులు సేకరిస్తారు.దైవానుగ్రహం లభిస్తుంది.ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది.విష ప్రయోగం ఉండగలదు.జాగ్రత్త వహించాలి. ఈ గురువారం మంచి వార్త వింటారు.దుర్గా సప్తశ్లోకీ చదవండి.
కర్కాటక రాశి: నూతన పరిచయాలు ఏర్పడగలవు.మీ శ్రమకు తగిన గుర్తింపు లభించగలదు.ఒక ప్రేమ వ్యవహారం కనిపిస్తున్నది. చెప్పుడు మాటలు నమ్మటం అంత మంచిది కాదు.మహాసౌరం చదవండి.
సింహ రాశి:జీవితంలో అన్నీ యస్ నో లతో కాదని గ్రహించాలి. ఒక న్యూట్రల్ గేర్ వాడుకోవటం వలన చాలా సమస్యలకు సమాధానం లభిస్తుంది.మీ వెనుక రహస్య మంతనాలు జరుగగలవు.ఈ మంగళ వారం ఒక న్యాయసంబంధమైన విషయం ముందుకు రాగలదు. సుబ్రహ్మణ్య కవచం చదవండి.
కన్య రాశి: ఇంటిలో కొంత అలజడి వాతావరణం ఉండవచ్చు.వారాంతానికి ప్రశాంతం అవగలదు.మీ ఆలోచనలు మెప్పు పొందగలవు.కళాకారులకు మంచి అవకశాలున్నాయి.సరైన చోట శ్రమించటం అవసరం అని గుర్తిస్తారు.శ్రీసూక్తం చదవండి.
తుల రాశి: ఉదర బాధలు బాధించగలవు.మిత్రులతో వివాదాలుండవచ్చు. బుధవారం మంచి ఆదాయం ఉన్నది.ఈ రాశి వారు ఇటీవల దేని కోసమో నిరీక్షిస్తూ పనులను ఆపినట్టున్నారు.ఎవరూ రారు, ఏదీ చేయరు.ముందుకు వెళ్లండి.హనుమాన్ చాలీసా చదవండి.
వృశ్చిక రాశి: విదేశీ యానం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఒక మంచి వార్త వింటారు.తీరా వెళ్లాలనుకున్నప్పుడు ఇక్కడ ఎప్పటి నుంచో రాని అవకాశం రాగలదు. గ్రహ దశ చూసుకుని నిర్ణయం తీసుకోగలరు. బంధువుల పట్ల జాగ్రత్తలు వహించాలి.పిల్లలు మంచి వార్తలు వినిపిస్తారు.లక్ష్మీ అష్టోత్తరం చదవండి.
ధను రాశి: బాధ్యతలు పెరగనున్నాయి.గతంలో చేసిన కొన్ని పొరపాట్లకు ఈ వారం శ్రమ అధికం కాగలదు. వీలయినంత మౌనం పాటించటం మంచిది.ఆదాయం బాగుంటుంది.మిగతా విషయాలలో మంచి వారం.కొత్త చదువుల పట్ల ఆసక్తి పెరగగలదు.
మకర రాశి: మీ కార్యానుకూలతకు ఇది చాలా మంచి వారం.మిత్రులకు సహాయం చేస్తారు.వ్యవసాయ రంగంలోని వారికి కొంత ఊరట లభించగలదు.రక్తపు పోటు ఉన్న వారు శ్రధ్ధ వహించాలి.ఒక ఋణం లభించగలదు.
కుంభ రాశి: నూతన ఉత్సాహం కనబరుస్తారు.కళ్ల విషయంలో శ్రధ్ధ వహించాలి.అనుకోని సంఘటన ఒకటి ఎదురు కాగలదు. తొందరపడి వ్యవహరించినట్లయితే ఇబ్బందులు ఎదురు కాగలవు.కొంత పరిశీలన అవసరం.శివాలయం సందర్శించండి.
మీన రాశి: వ్యాపారస్తులకు మంచి వారం.నూతన వస్త్రాలు కొంటారు.ఉద్యోగులకు పదోన్నతి ఉన్న వారం. స్త్రీలకు అన్నింటా కలసి రాగలదు. ఏదైనా డ్రా లాంటిది ఉన్నట్లయితే అదృష్టం కలసి వస్తున్నది.సంచీ సిధ్ధంగా పెట్టుకోండి! కులదైవాన్ని కొలవండి.
ఈ వారం మంచి మాట:
శ్లో: మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదినం
వత్సం గౌరివ గౌరీశో ధావంతమనుధావతి
పరమశివుడు ‘మహాదేవ ‘ అని ఉచ్చరించు వాని వైపుకు వత్సల అయిన గోవు తన లేగదూడ వెంట పరుగిడునట్లు పరుగిడును.
శ్లో: మహాదేవ మహాదేవ మహాదేవేతి యో వదేత్
ఏకేన ముక్తిమాప్నోతి ద్వాభ్యాం శంభూ ఋణీ భవేత్
ఎవడైతే మూడు మార్లు ‘మహాదేవ ‘ అని ఉచ్చరించునో వానికి ఒక్క నామం ఉచ్చరించుట వలన భగవంతుడు ముక్తిని ప్రసాదించును.మిగిలన రెండు మార్లు ఉచ్చరించుట వలన వానికి శివుడు ఋణపడును అని భావము.
(వేదాంత సిధ్ధాంతానుసారము శబ్దము వలననే తత్వ సాక్షాత్కారమగును!)
మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు!
సర్వే జనా: సుఖినో భవంతు!
ఓం శాంతి:శాంతి: శాంతి:
~~~***~~~
Predictions according to Sun Signs in English can be viewed at www.sripati.com

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “07-13.02.2010 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: