ఆదిపర్వం,ద్రౌపది-వేదాంతం శ్రీపతిశర్మ


‘సాక్షి ‘ టి.వీ లో యార్లగడ్డ లక్ష్మీప్రసాదు గారు వారి పుస్తకం మీద వచ్చిన వ్యాఖ్యల నేపథ్యంలో ఒక ప్రెస్ మీట్ లో చేసిన ప్రసంగాన్ని నేను చూశాను.ఆయన చాలా విచిత్రమైన మాట చెప్పారు. ఆదిపర్వంలో ద్రౌపది గత జన్మ చరిత్ర చెబుతూ ఆవిడ కామవాంఛ తీరనందువలన ఈ జన్మలో అయిదు భర్తలకు భార్యగా వచ్చినట్లు వ్యాసులవారు తెలిపినట్లు మాట్లాడారు. ఆదిపర్వంలో ఈ ఘట్టం భారతంలోని ఆదిపర్వంలోని చైత్రరథపర్వంలో ఉంటుంది. వ్యాసులవారు వచ్చి ఇలా చెబుతారు:

ఆసీత్ తపోవనే కాచిదృషే: కన్యా మహాత్మన:

విలగ్నమధ్యా సుశ్రోణీ సుభ్రూ: సర్వగుణాన్వితా

(పూర్వం తపోవనంలో ఒక మహర్షికి జన్మించిన ఒక కన్య ఉండేది.ఆమె ఎంతో సుందరంగా ఉండేది.సమస్త సద్గుణసంపన్నురాలు)

కర్మభి: స్వకృతై: సా తు దుర్భగా సమపద్యత

నాధ్యగఛ్చత్ పతిం సా తు కన్యా రూపవతీ సతీ

(తన స్వకర్మ చేత దౌర్భాగ్యముతో రూపవతీ, సదాచారిణి అయినప్పటికీ ఎవరినీ పతిగా పొందలేదు)

తతస్తప్తుమథారేభే పత్యర్థమసుఖా తత:

తోషయామాస తపసా సా కిలోగ్రేణ శంకరం

(అప్పుడామె దు:ఖించి తపస్సు ప్రారంభించి తపస్సు ద్వారా శివుని ప్రసన్నుని చేసుకొంది)

తస్యా: స భగవాన్స్తుష్టస్తామువాచ యశస్వినీం

వరం వరయ భద్రం తే వరదోస్మీతి శంకర:

(సంతుష్టుడైన శంకరుడు వచ్చి వరము కోరమని చెప్పెను)

అథేశ్వరమువాచేదమాత్మన: సా వచో హితం పతిం

సర్వగుణోపేతమిఛ్చామీతి పున: పున:

(అప్పుడామె తన కోసం హితమైన వచనములు పలికెను-  ప్రభూ! నేను సర్వగుణసంపన్నుడైన పతిని కోరుకుంటున్నాను…ఈ మాటను ఆమె మరల మరల పలికింది)

తామథ ప్రత్యువాచేదమీశానో వదతాం వర:

పంచ తే పతయో భద్రే భవిష్యంతీతి భారతా:

(శివుడు అప్పుడు ‘భద్రే! నీకు అయిదు భరతవంశీయులైన పతులు లభించగలరూ అని పలికెను)

ఏవముక్తా తత: కన్యా దేవం వరదమబ్రవీత్

ఏకమిఛ్చామ్యహం దేవ త్వత్ప్రసాదాత్ పతిం ప్రభో

(ఆమె శివునితో ఇట్లు పలికెను-దేవా! ప్రభో! నేను నీ కృప చేత కేవలం ఒక పతినే కోరుకుంటున్నాను)

పునరేవాబ్రవీత్ దేవ ఇదం వచనముత్తమం

పంచకృత్వస్త్వయా హ్యుక్త: పతిం దేహీత్యహం పున:

(అప్పుడు శివుడు ఇలా చెప్పెను-భద్రే! నీవు నాతో అయిదు పర్యాయములు పతిని ప్రసాదించమని అడిగావు)

దేహమన్యం గతాయాస్తే యథోక్తం తద్ భవిష్యతి

ద్రుపదస్య కులే జఙ్ఞే సా కన్యా దేవరూపిణీ

(అందుచేత మరో శరీరమును ధరించినప్పుడు నీకు నేను చెప్పినట్లు వరము ప్రాప్తించును… అదే దేవరూపిణి అయిన కన్య ద్రుపదుని కులములో ఉత్పన్నమయ్యెను)

ఇలా చెప్పి వ్యాసులవారు పాండవులను పాంచాలనగరానికి వెళ్లి సతీ సాధ్వి అయిన కృష్ణా (ద్రౌపది)ని వివాహమాడమని నిర్దేశించి అక్కడినుండి వెళ్లిపోయారు. ఈ వృత్తాంతంలో కేవలం ద్రౌపదికి అయిదుగురు పతులు ఎలా నియమింపబడ్డారో అను విషయాన్ని చెప్పటం జరిగింది కానీ ఎక్కడా ‘కామవాంఛ తీరని ద్రౌపదీ గురించి ప్రస్తావన లేదు! ఆవిడకే అంత కోరిక ఉండి ఉంటే శివుడు అయిదుగురు పతులు అని చెప్పినప్పుడు ‘అయ్యో ఒక్కరే కదా నేను కోరుకుంటున్నది ‘ అని అనే బదులు సంతోషించి ఉండేది! ఆవిడను   సతీ   సాధ్వి అని ఈ సందర్భంలోనే వర్ణించటం మరో విశేషం! ద్రౌపది పాత్రకు కామవాంఛ అనే రంగు భారతంలో ఎక్కడా, ఏ సందర్భంలోనూ లేదు. ఈ ‘ఆచార్య ‘ అని పిలిపించుకునే ఉత్తమ మైన మహామనీషికి బహుశ: జన్మతో ఉన్న కామవాంఛ చేత ఆ మహాకావ్యంలో ఏకంగా దుర్యోధనుని లాగా ద్రౌపదినే పట్టుకున్నాడు!కావ్యలక్షణం,రసం,ఇలాంటివి ముందు పెట్టి పరిశీలించమన్నప్పుడు అక్కడ ఏమున్నా లేకపోయినా   ఇలాంటి     వారికి    కనిపించేది ఒకటే! మరో దేశంలోనైతే సంస్కృతికి మూలస్తంభాలైన పాత్రల, పుస్తకాల మీద ఇలా మదంతో మాట్లాడినా,వ్రాసినా పబ్లిక్ గా నిలబెట్టి మరో మనిషి ఇటువంటి పని చేయకుండా చర్య తీసుకుంటారు. ఈ దేశంలో (పర)ప్రభుత్వం వారు ఆదరించి అవార్డులు ఇస్తారు. ఈ రచయిత సాహిత్యాన్ని అధ్యయనం చేసినట్లు లేదు, పోనీ కొంత సంస్కారమైనా అబ్బుకున్నట్లు లేదు. వీరిని అవార్డు కోసం ఎంపిక చేసిన కమిటీ వారు మరి కొన్ని ఆకులు ఎక్కువ చదివినట్లున్నారు!

Mark Twain writes in one of his books regarding a character in the book-You have struck the loftiest peak of tsupidity which human effort ever conquerred!

Yes. The awardee and those who have awarded have done precisely this.

The Sahitya Academy Award shall henceforth be a serious insult to a writer.

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

31 thoughts on “ఆదిపర్వం,ద్రౌపది-వేదాంతం శ్రీపతిశర్మ

 1. గరికిపాటి గారు దీని గురుంచి చాలా బాగా భక్తి టివి లో చెప్పారు.
  ఈ మాద్య ఎవరు ఇస్టమ్ వచ్చినట్టు రాస్తున్నారు.
  బాగా చెప్పారు.

  1. ‘నేరం ‘ అను మాట అధర్మానికి సంబంధించినది.దానికి శిక్ష ఉన్నది.
   ఆంజనేయుడు రావణుని గురించి చెప్పినప్పుడు ‘యద్యధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వర:’ అనాడు.
   అధర్మము చేత బలహీనుడు కానీ రావణుడు సమాన్యుడు కాడు.ఎవరిని కామిస్తున్నారో అనేది ముఖ్యం.
   ఏడాది పాటు అశోకవనంలో ఉన్నప్పుడు ఒక్క క్షణమైనా శ్రీరాముని తప్ప ఇంకొకరి గురించి ఆలోచించకుండా ఉంటే ఈ భూమి పగలకుండా ఉండాలి అన్న సీత మాట ధర్మాధర్మములను చెబుతున్నది.
   ప్రేమ గుడ్డిది కాదు. కామం గుడ్డిది.శూర్పణఖ కామించింది.నన్ను కట్టుకో లేకపోతే చంపి భక్షిస్తానంటుంది.కామంలో రాక్షసత్వం ఉన్నది.భార్యాభర్తల మధ్య ఉండు వాత్సల్యం ధర్మార్థకామమోక్షాలను పెంపొందింపజేయునది.
   రావణుడు కామంలో ముణిగి తేలువాడు కనుక సోదరి అయిన శూర్పణఖ భర్తను కూడా చంపినవాడు.సీతను వివాహమాడకపోతే పాకశాలలో వండించ్కుని తింటానంటాడు.ఇది కామం యొక్క లక్షణం.ఒకరిని అనుభవించాలనే తప్ప వారి పట్ల మరో భావన లేదు.
   ప్రేమానురాగాలకూ, గృహస్థాశ్రమ విధులకు,ధర్మనిబధ్ధతకు సంబంధం ఉన్నది.
   ఛాందోగ్యోపనిషత్తు ధర్మపత్ని గర్భవతి అయినప్పుడు తల్లితో సమానమని చెబుతున్నది.ఆత్మావై పుత్రనామాసి అనినట్లు తన బీజమే భార్యలోకి ప్రవేశించి తానే పుత్రునిలా జన్మిస్తాడు కాబట్టి ఆ విషయం చెప్పి ఆ సమయంలో ఆమె జాయ అని అనబడుతుందని కూడా పేర్కొనబడినది.వివాహం అనేది అందువలన యఙ్ఞంతో సమానమని చెప్పబడినది.ఇది కన్యాదానంతో ముడిపడియున్నది.
   దీనికి భిన్నంగా కామోద్రేకాలతో మసలుకొనే వారికి వ్యవస్థ మరోలా కనిపిస్తుంది!
   ఐతరేయ బ్రాహ్మణం ‘అర్థోవా ఏష ఆత్మన: యత్ పత్నీ ‘ అని చెబుతున్నది. ఆత్మలోని సగభాగం పత్ని.యూస్ అండ్ త్రో కాదు!
   వ్యాసులవారు ద్రౌపదిని సతీ సాధ్వి అని ఆమె వివాహం ముందరే వర్ణించి యున్నారు.అ పదాలు సామాన్యమైన స్త్రీలకు వడబడదు.పతివ్రతలకే వాడతారు.వారి శక్తి సామాన్యమైనది కాదు.
   ఉపరితలంలో చర్మసౌందర్యోపాసన చేయు వారికి ఈ ధర్మసూక్ష్మం కానరాదు.రావణుడు అది తెలుసుకోలేక హతమయినాడు.

   మీరు అడిగిన ప్రశ్న స్త్రీకి కామం తగదా అని కూడా సూచిస్తున్నది.
   భర్తను మోహించటంలో తప్పు లేదు.అది నిబధ్ధతలో ఉన్న ధర్మం.భర్త వాత్సల్యాన్ని కోరుకోవటం ధర్మం.శ్రీసూక్తం అందుచేత చిక్లీత వస మే గృహే అంటున్నది.అలా ఇమిడి యుండు వ్యవస్థలోంచి పైశాచికంగా బయటకు వచ్చి స్త్రీల శారీరికపరమైన కోరికలను సార్వజనికంగా చర్చకు తేవటం సృజనాత్మకత అనిపించుకోదు.అది అసభ్యం కూడా.ఈ రోజు చలనచిత్రాలలో స్త్రీలను ఇటువంటి ప్రవృత్తులతో చూపిస్తూ మగవాళ్ల వెంట పడి నీచంగా ప్రవర్తించటం కనబరుస్తున్నారు.కాముకులు వెర్రి వాళ్లు. వాళ్లు చేస్తున్న పని యొక్క ఇహం పరం వాళ్లకు తెలియదు.ప్రతి వ్యక్తిలో ఒక రాక్షసుడు సమయానుకూలంగా తన పాత్ర పోషిస్తూ ఉంటాడు.

   పార్వతి శివుని చేరుకుంటున్న తరుణంలో మన్మథుడు (కాముడు)పూల బాణం వదిలాడు.తనకి ఈ సందర్భంలో ఒక పాత్ర ఉన్నదనుకున్నాడు.లేదని చెప్పటానికే శివుడు అతనిని కాల్చి బూడిద చేశాడు.శైలజ తపస్సు ఆచరించి పరమశివుని సగభాగమయినది.(అర్థోవా ఏష ఆత్మన: యత్ పత్నీ!)
   మరి శ్రీరుద్రం కామశ్చమే అంటుంది!ఇదే ధర్మసూక్ష్మం.ధర్మార్థకామమోక్షములలో ధర్మం మొదటిది అని చంటిపిల్లవాడు కూడా గుర్తించగలడు…

   ఈ వ్యవస్థ ఇలా ఎందుకు ఉన్నది అని చర్చిస్తే ఒక్క విషయం విదితమవుతుంది.మానవుని కర్తవ్యం ఆత్మసాక్షాత్కారం.ఆ దిశలో వెళ్లునప్పుడు అమృత తత్వం అని,మోహం వైపు వెళ్లునప్పుడు మృత్యువుకు దగ్గర అని వ్యాసులవారు చెప్పియున్నారు!

   మహర్షులు అందుచేత నిత్యం ఆత్మసాక్షాత్కారం వైపు ఉండి (తపస్సు ఆచరిస్తూ)అమృతమూర్తులుగా మనకు కనిపిస్తారు.

   ఈ ఆత్మసాక్షాత్కారం అనే ప్రక్రియే అంతటా ధర్మసూక్ష్మంగా ఇమిడి ఉంటుంది.భార్య భర్తలో పొందునది,భర్త ద్వారా పొందునది ఇదియే!ఇది ఆ ప్రక్రియకు వెలుగు చూపు విషయం.అందుచేత స్త్రీకి భర్తను సేవించుకున్న చాలు,మరో వ్రతంతో పనిలేదని సీత రామాయణంలో చెప్పియున్నది.

   పురుషుని వైపుకు వెళదాం.స్నాతకంలో బ్రహ్మచర్యం పాటించనందుకు ప్రాయశ్చిత్తం జరుపుతారు.ఇందుచేతనే.అన్నీ కలసిపోయినదే కలికాలం!
   మోహినికి,(నారాయణుడు)పరమశివునికి కలిగిన బ్రహ్మచారి అయ్యప్ప!మోహం అనునది పరమశివుని తత్వంలో లీనం చేయటం బ్రహ్మచర్యంతోనే సాధ్యం.ఆ పైనే ఆత్మసాక్షాత్కారం!అదే ఉత్తరాయణం ప్రారంభమవు మకరసంక్రాంతి రోజున ఆత్మజ్యోతికి ప్రతీకగా ఈ దీక్షితుడైన బ్రహ్మచారి ‘మకరజ్యోతిని ‘ దర్శిస్తాడు.
   భూమి అనుభవించు స్పందనలో (స్పనదనయే తపస్సు)ఉత్తరభాగం ఏర్పడినది.ఈ ఉత్తరం అనునది దక్షిణం నుండి పొంగినట్లు పొంగల్ పొంగించి పండుగ చేసుకోవటం జరుగుతుంది.అందుచేత ఉత్తరాయణంలో సాక్షాత్కారం వైపు మనం పయనించాలి.
   ఆరోహణ్ ఉత్తరాన్ దివం దేవ: అని మహాసౌరం చెబుతున్నది.సూర్యుడు ఆత్మ కారకుడు, పిత్రుకారకుడు.పరమాత్మను మనం అందుచేత తండ్రి అని పిలుస్తాము.
   మాతృదేవో భవ, పిత్రు దేవో భవ…ఇవి ఉపాసనమార్గాలు.అయం మే అస్తు భగవానో,అయం మే భగవత్తర:…సృష్టిలోని అనంతమైన నియమాన్ని నశ్వరమైన మన నిత్యజీవితంలో ప్రతిబింబించటమే ఆర్యుల సంప్రదాయం!

   అది లేనప్పుడు అంతటా కామమే కనిపిస్తుంది.అది కాలిపోతుంది.ఐతరేయ బ్రాహ్మణం చెబుతుంది-అగ్నిరివకక్షం దహతి బ్రహ్మపృష్ఠమనాదృతం- వైదికసంప్రదాయాన్ని అనాదరంగా చూసినా,మాట్లాడినా దావానలంలా దహించివేయగలదు!

   సంక్రాంతి శుభాకాంక్షలు!

 2. ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
  అందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
  *** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
  SRRao
  శిరాకదంబం
  http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html

 3. ద్రౌపది నవల వివాదం

  * యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ (విశాఖపట్నం, మాజీ రాజ్యసభ సభ్యులు) రచించిన ద్రౌపది అనే పుస్తకానికి ఈ సంవత్సరం కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించింది.ఈ పురస్కార నిర్ణాయక న్యాయమూర్తులుగా శ్రీ కాళీపట్నం రామారావు, శ్రీమతి వి.ఎస్‌.రమాదేవి, ఆచార్య బేతవోలు రామబ్రహ్మంలు వ్యవహరించారు.
  * విమర్శలు:

  1. ఇది ఒక బూతు పుస్తకం. వెయ్యేళ్ల తెలుగు సాహిత్య చరిత్రలో తెలుగు సరస్వతికి ఇటువంటి అవమానం, పరాభవం, కీడు, అపరాధం, అపచారం ఎన్నడూ జరగలేదు.న్యాయనిర్ణేతలే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి సాహిత్య అకాడమీ ఈ విషయాలు గ్రహించి పునరాలోచించి ‘ద్రౌపది’ గ్రంథ పురస్కారానికి అనర్హమైనదిగా ప్రకటించాలి.
  2. .ద్రౌపదిని శ్రీకృష్ణుని ఇష్టసఖిగా రచయిత అభివర్ణించాడు. ఇష్టస అంటే ప్రియురాలు, వలపుకత్తే, ప్రేయసి అనే అర్థాలు ఉన్నాయి. కాని చెల్లెలు అనే అర్థం ఉందా?
  3. . ఐదుగురు కొడుకులను పోగొట్టుకొని (సుషుప్తి పరవశులైన బాలకులను అశ్వత్థామ గొం తులు కోసి చంపాడు) గోలుగోలున ఏడుస్తున్న ద్రౌపది, పూర్వం తనకు జరిగిన అన్యాయాలను తలచుకుంటూ వెంటాడే స్మృతులలో దుర్యోధనుడు కామంతో తన ఎత్తైన వక్షస్థలాన్ని చూస్తున్న సంగతి గుర్తుచేసుకోగలదా?
  4. . ద్రౌపది ఒకరోజు తరువాత ఒకరోజు పాండవులు ఒక్కొక్కరితో కామకేళీ విలాసాలతో సుఖించినట్లు, పరవశత్వం చెందినట్లు వక్రీకరణలు గొప్ప పరాభవము, మానభంగము కావా?
  5. .శ్రీకృష్ణ పరమాత్మను అతి నీచంగా ప్రస్తావించటం కృష్ణభక్తులైన ఆనందవర్ధనుడు, ఆచార్య శంకరభగవత్పాదులు, సూరదాసు, మీరాబాయి, చైతన్య మహాప్రభువు, శ్రీరామకృష్ణపరమహంస, లీలాశకుడు, జయ దేవుడు, విద్యావతి, చండీదాసు, నారాయణతీర్థుల వంటి మహానుభావులను అవమానించడం కాదా?

  http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=44863&Categoryid=1&subcatid=3

  * లక్ష్మీ ప్రసాద్ గారి వివరణ:

  పరమశివుని వరం మేరకే ద్రౌపది జన్మించింది.కుమార్తె గా, సోదరిగా, భార్యగా,తల్లిగా, శ్రీ కృష్ణుని సఖిగా, మహారాజ్ఞిగా, రాజనీతిజ్ఞురాలిగా, విదుషీమణిగా, ఉత్తమ ఇల్లాలుగా, గృహిణిగా, వివిధ దశల్లో పరిఢవిల్లిన ఆమె వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి వివరించడమే ఈ నవల ముఖ్య ఉద్దేశం.ఆంధ్ర మహాభారతం ఆదిపర్వంలో 257వ సంఖ్యతో ఉన్న పద్యంలో ఉన్న వర్ణన కంటే ఇదేమంత పెద్దది కాదు.సఖాసఖి సంప్రదాయం గురించి ఒరియా రచయిత్రి ప్రతిభారాయ్‌ తన ‘యాజ్ఞసేని’ పుస్తకంలో రాశారు.ఇది అలౌకికమైన, పవిత్రమైన ప్రేమపూర్వక సంబంధం మాత్రమే.ఎన్టీఆర్‌ నటించిన ‘దాన వీర శూర కర్ణ’ సినిమాలో ద్రౌపది పాత్రను ఎలా వర్ణించారో పరిశీలించాలి.గత రెండు జన్మలలో తీరని కామబోగేచ్చను, సంసార సుఖాన్ని తీర్చుకోవడానికే ద్రౌపది జన్మించిందని ఆదిపర్వంలో ఉంది.తెలుగు ప్రబంధాలు, ఇతర భాషల గ్రంథాలలోను అధిక మోతాదులో శృంగారం ఉంది.తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు వెలుగులోకి రాకుండా మరుగునపడి పోతున్నాయి.వాటన్నింటినీ వెలుగులోకి తెస్తాను.(ఈనాడు,ఆంధ్రజ్యోతి14.1.2010),http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=408129&Categoryid=1&subcatid=33

  1. మీరు ఏమి చెప్పదలచారో తెలియలేదు.
   లక్ష్మీప్రసాదు గారు ఆదిపర్వంలో ఉన్నది అనినంత మాత్రాన ఆ చెత్త అక్కడికి చేరదు.
   నేను ఆ ఉదంతం వివరంగా చెప్పినా అర్థం కాకపోతే నేనేమీ చేయలేను!

 4. చదువరి గారూ,
  రచయిత రాసింది “తప్పా ఒప్పా” అనేది చదివిన పాఠకులు కూడా నిర్ణయించే విషయం కాదు. వారుకూడా కేవలం ‘నచ్చిందా నచ్చలేదా’ అని మాత్రమే నిర్ణయించుకుంటారు. ఈ నవలలోని తప్పొప్పులు ఖచ్చితంగా ఈ మోరల్ పోలీసులు నిర్ణయించాల్సినవి మాత్రం కాదు.

  వారి ముఖ్యఅభియోగం ద్రౌపదిని కాముకిగా చిత్రించాడు అనేది. ఏం… కాముకి అయితేమాత్రం ద్రౌపది పాత్ర తన ఉనికిని కోల్పోతుందా లేక ప్రాధాన్యత మట్టిగొట్టుకు పోతుందా!

  1. ఇక్కడ మోరల్ పోలీసు వ్యవహారం ఏదీ లేదు.
   కాముకి కాని పాత్రను అలా చిత్రీకరించినప్పుడు తప్పకుండా ఆ ప్రధాన్యత కోలుపోతుంది.కల్లు కాంపవుండులో అగ్నిష్టోమం చేసినట్లు ఉంది.
   ముఖ్యంగా లేని విషయాన్ని తీసుకుని వచ్చి ఆపాదించినప్పుడు అది అపచారం.ఆ అధికారం ఎవరికీ లేదు.దీనిని సమర్థించే వారికి సంస్కారం అంతకంటే లేదు!
   సతీ సాధ్వి అని మహాభారతగ్రంథకర్త వర్ణించినప్పుడు ‘కాముకి ‘ గా వర్ణిస్తే ఆ పాత్ర ప్రాధాన్యత పోతుందా? అని అడిగే వాళ్లకు తలకాయ ఉందని అనుకోవాలా లేదని అనుకోవాలా?

   1. @శ్రీకారం: అసలు సమస్య అక్కడే ఉంది. కల్లుకాంపౌండులో చేసినంతమాత్రానా కలుషితమైపోయే అగ్నిష్టోమం ఉంటే ఎంత పోతే ఎంత? ఆపాదించినంతమాత్రానా అపచారమైపోయే పవిత్రత విలువెంత?

    ద్రౌపది పాత్రకు కాముకత్వం ఆపాదించిన మాత్రానా నమ్మేవాళ్ళు గగ్గోలుపెడితే వాళ్ళ నమ్మకం మీద అంత అపనమ్మకమన్నమాటేగా!

    కాల్పనిక పాత్రల్ని ప్రశ్నించే అధికారం కూడా లేదనే మీ హిట్లరిజానికి నా జోహార్లు. ఇదే మీ సాంప్రదాయమైతే తలకాయ లేనిది ఎవరికో అర్థమౌతూనే ఉంది. మహాభారతాన్ని పూజగదుల్లోంచీ బయటికి తీసుకొచ్చి మానవ సంస్కృతి చరిత్రగా చదవడం నేర్చుకోంది. అప్పుడుగానీ దానివల్ల లాభం జరగదు. ఎన్నో ప్రక్షిప్తాల తర్వాతగానీ ఈ మహాభారతం మన మహాభారతం అవ్వలేదు. కాబట్టి దాన్నొక definitive text గా చూడ్డం మానండి. Its a literary text, subjected to many interpretations. అందులోని ఒక వ్యాఖ్యానం మీకు నచ్చకపోయినంతమాత్రానే అపవిత్రం అపవిత్రం అని గోషించడం మీ ఛాంధసభావనకు నిదర్శనం తప్ప మరోటి కాదు. You don’t believe in your own believes thats all.

   2. అపవిత్రం పవిత్రం గురించి ఏమి మాట్లాడతారు మాష్టారూ!కాముకత్వపు పూనకం పూని కార్యాకార్య విచక్షణ లేకుండా ముందుకు వెళ్లిపోయి తప్పురా అని చెప్పినప్పుడు సమర్థించుకునే ముసుగులో గుద్దులాట ఇది!ఇందులో ఛాందసమూ లేదు వంకాయ లేదు.చేసిన వెధవ పనికి నోరు మూసుకుని ఉండటం కూడా చేతకావటం లేదు. అగ్నిష్టోమం కల్లు కాంపవుండులో అపవిత్రం అని ఎవరు చెప్పారు? వొళ్లు మదించి అక్కడికి దానిని తీసుకు వచ్చారని చెప్పటం కూడా అర్థం కాని దుస్థితిలో ఉన్నారు!
    నిరక్షరకుక్షీ!కాల్పనిక పాత్ర అని ఎవరు నీకు చెప్పింది? ద్వారకను గుజరాత్ లో వెలికి తీశారు.
    సృజనాత్మకంగా సాహిత్యసేవ చేసుకోవాలనుకుంటే చాలా మార్గాలున్నాయి. ఇక్కడ ఉద్దేశ్యాలు భిన్నమైనవి.నీ లాంటి వాళ్ల ఆవేదనే విషయాన్ని విపులంగా చెపుతోంది.

    ఇంకా బొడ్డూడని కేసు నీది.కాసేపు ఇలాంటిఏడుపు ఏడవటం సహజం.తరువాత నీ దగ్గరకు వస్తాను.పాత్రల గురించే తెలియని వ్యక్తులతో ఏమి చర్చిస్తాం? యార్లగడ్డ గారు మంచి పని చేశారు!సాహితీపరుల ముసుగులో తిరుగుతున్న అడవిదున్నలకు నాయకత్వం వహించి బయట పెట్టారు. ప్రస్తుత సమాజం వారికి ఋణపడి ఉంటుంది!

 5. మీలాంటి వాళ్ళు వీలైతే యోనులకు తాళాలు కూడా వేసే రకం. పవిత్రత, మంచితనం పేరుతో మహిళల్ని వాళ్ళ అస్థిత్వాల్నీ పురుషాహంకారానికి బలిచేసే రకం. దానికి సాంప్రదాయం అనే ముసుగొకటి…ఛత్! నేను బొడ్డూడనివాడినే కానీ మీ కుత్సితాల్ని ఎరగడివాడిని మాత్రం కాదు.

 6. *మీలాంటి వాళ్ళు వీలైతే యోనులకు తాళాలు కూడా వేసే రకం.*

  అది నువ్వు, మీ లాంటి కొందరు అభిమానించే ఐరోపా, అమేరికా తెల్ల మేధావుల సంస్కృతి. ఈ దేశ చరిత్ర లో ఇప్పటి వరకు అలా తాళాలు వేసినట్టు నువ్వు ఎక్కడైనా చదివా వా? యార్లగడ్డకు జిల గుల ఉంటె స్వంతం గా ఒక రెవల్యుషనరి కత రాసి సాహిత్య అకడెమి అవార్డ్ తెచ్చు కుంటె ఎవ్వరికి అభ్యంతరం ఉండదు. అందువలన శర్మ గారిని పిచ్చి ప్రశ్నలేసి వారిని పిచ్చె కించ వద్దని నా మనవి. పని పాటా లేని తెలుగు ను ఉద్దరిస్తున్నా మనే బ్రమలో ఉండె సుజాతా గారి లాంటి వారి తో మీరు చర్చ పేట్టు కుంటే బాగుంట్టుంది.

 7. *మీలాంటి వాళ్ళు వీలైతే యోనులకు తాళాలు కూడా వేసే రకం.*

  అది నువ్వు, మీ లాంటి కొందరు అభిమానించే ఐరోపా, అమేరికా తెల్ల మేధావుల సంస్కృతి. ఈ దేశ చరిత్ర లో ఇప్పటి వరకు అలా తాళాలు వేసినట్టు నువ్వు ఎక్కడైనా చదివా వా? యార్లగడ్డకు జిల గుల ఉంటె స్వంతం గా ఒక రెవల్యుషనరి కత రాసి సాహిత్య అకడెమి అవార్డ్ తెచ్చు కుంటె ఎవ్వరికి అభ్యంతరం ఉండదు. అందువలన శర్మ గారిని పిచ్చి ప్రశ్నలేసి వారిని పిచ్చె కించ వద్దని నా మనవి. పని పాటా లేని తెలుగు ను ఉద్దరిస్తున్నా మనే బ్రమలో ఉండె సుజాతా గారి లాంటి వారి తో మీరు చర్చ/రచ్చ పేట్టు కుంటే బాగుంట్టుంది.

 8. Actual content is correctly presented to expose the so-called “Awardu Graheethalu”. It is high time the Board responsible goes through the content of the book and review the award. Then only the Board and the Award will have respect.

  Society needs the knowledgeable people to present facts and condemn incorrect things at appropriate time.

  Thanks for timely presentation of facts.

 9. యార్లగడ్డ ఒక రచయిత; కవికూడానేమో తెలియదు. కవి నిరంకుశుడు, రచయితా అంతే. ఆయన ఒక వినూత్న భాష్యం చెప్పాడు; అది కల్పనాగరిమ. దానికి మండి పడడం ఎందుకూ? పలుమార్లు ఒకే కోరికను ఆరాటంగా అడగడం కామవాంఛ అధికంగా వుండడమని చిత్రీకరించేంత స్వేచ్ఛకూడ రచయితకు లేకుంటే యిక కల్పనా ప్రతిభలు ఎలా పుట్టుకొస్తాయి? ఇంకో విషయం భర్త కావాలనుకోవడం కూడ ఒక విధమైన కామవాంఛేకదా. వి శ్రీ శర్మగారికి అంత కోపమెందుకో – ఆ కాడికి పౌరాణిక, ఐతిహాసిక పాత్రలందరూ పత్తిత్తులైనట్లు! ఎందరు ఇంద్రులు లేరు, మరెందరు అహల్యలు లేరు? ఇతర దేశాల్లో ఇంకా పచ్చిగా కూడ రాస్తారు; వాటిని ఆ భాషల్లో చదివి ఆహా ఓహో అనే వాళ్లే యిక్కడకొస్తే యిలా మొరాయిస్తుంటారు అనేకులు. డబుల్‌ స్టాండర్డ్స్‌కు మనం పెట్టింది పేరుగదా.

 10. ఇది నేను ఎలా మిస్స్ అయ్యాను? అది సర్లేండి చట్టరిత్యా నేరం ఐన ఇన్సెస్ట్ ని చేర్చాడు ఆ సదరు మనిషి, ఇంకా ఏమి చెప్తాము.. కనపడిన ప్రతి మనిషిని, అన్నా, తమ్ముడు అని లేకుండా ఎవర్నీ వదలకుండా ద్రౌపదికి అంటగట్టాడు…

  మళ్ళీ దీన్ని బేస్‌గా చేసుకోని ఎవరో ఒకరి మహాభారతం ఒక విషవృక్షం అని రాస్తారు, ఏమైనా అంటే సంస్కృత మూలం మేము చదవలేదు అంటారు..

 11. మన హిందూదేశంలో వైవిధ్యపూరితమైన ఆచారాలు, సంస్కృతులు ఎన్నోవున్నాయి. వాటిని ఆచరించే వందలాది లేక వేలాది తెగలు, జాతులు, కులాలు, గోత్రాలు వున్నాయి. మహాభారతంలో బహుశా ఆ నాటికివున్న వందలాది ఆచారాలు, సంస్కృతులనూ ఎంతోకొంత ఎక్కడో ఒకక్కడ తడిమారు. అందుకే భారతంలో లేనిది ప్రపంచంలోనే వుండదనీ, లేక ప్రపంచంలోవున్నవన్నీ భారతంలోనే వున్నాయనీ అంటారు. అదొక గొప్ప ఐతిహాసిక కావ్యం. మరి బహుభర్తృత్వాన్ని కూడ ద్రౌపదిద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు – తప్పేమిటి? అయినా కామవాంఛ లేకుండా కాపురం ఎట్లా చేస్తారండీ బాబూ – మీ ఛాందసత్వం కాకుంటే! కృష్ణుడు కర్ణుడ్ని కలిసి జన్మరహస్యం చెప్పి, క్యాంపు ఫిరాయించమనీ, ద్రౌపదితో సహా పాండవ వంశాన్ని ఏలుకోమనీ చెప్పలేదా? దానికి కర్ణుడు యుద్ధంలో మిత్రుడు రారాజుకు ద్రోహం చేయలేననీ, పాండవుల్లో ఒక్క అర్జునిడ్నితప్ప మరెవర్నీ పరిమార్చననీ, తాను చచ్చినా, అర్జునుడు చచ్చినా పంచ పాండవులే వుంటారనీ చెప్పలేదా? ‘ దాన వీర శూర కర్ణ’ సినిమాలో కర్ణునితో భోగించాలనే హృదయాంతర్గత వాంఛ ద్రౌపదికి వున్నట్లు చిత్రించలేదా? మరి యార్లగడ్డ వ్యాఖ్య్లలో అంతకంటే పాపముందా? రకరకాల సెక్స్‌ సంబంధాలు, వివిధ మోతాదుల్లో వాంఛలుగల ఆడవాళ్లూ (అలాగే మగ వాళ్లూ) వుంటారు. నేటికీ ఉత్తరాదిలో జాట్లలో (కొన్ని తెగల జాట్స్‌ లో) బహుభర్తృత్వం వుంది. వాళ్లలో తప్పుకాదు; పైగా అవసరం కూడ.

 12. మనఖర్మేంటంటే మన సినిమాల్లో చూపించిన పైత్యాలే నిజమని నమ్ముతాం, ఆది నుంచీ. NTR లాంటి వాళ్ళు వాళ్ళ స్థాయిని ఎక్కువగా చూపించుకోడానికి రావణాసురుణ్ణీ ధుర్యోధనుణ్ణీ కూడా హీరోలుగా చిత్రీకరించారు పైత్యం ప్రకోపించి. బహుశా అప్పుడు ఎదిరించే ధైర్యం సినీ జగత్త్ లో అప్పుడు ఎవరికీ లేదేమో. ఆ సినిమాలలోవే చూసి రాసేస్తే అదే నిజమని నమ్ముకోడానికి వాళ్ళు వ్యాసునికన్నా గొప్పవారా? కవిసమయం చూపడానికి కాల్పనికతకు ఒక పరిధి ఉంచుకోవాలి. కవి నిరంకుశుడే కావచ్చు మరి ఆ కాల్పనికతలో తన తల్లినో చెల్లినో నిరంకుశంగా ఇలా చెత్తగా ఊహించగలడా చిత్రించగలడా? పాత సినిమాల్ని పక్కనెట్టి మూలాలు చూసి చదివి రాస్తే మంచిది. మన ఇంకో ఖర్మేంటంటే బేతవోలు వంటివారు ఇటువంటి చెత్తకాగితాలు సంచీకి అత్త్యుత్తమ అవార్డుని ఎలా రికమెండ్ చేశారా అని. అలా చెత్త కాగితాలకి కూడా అవార్డిస్తారని తెలిసుంటే నేనూ ఒక లారీడు చెత్త కాగితాల్ని పంపే వాణ్ణి అవార్డుకోసం.

  1. ఇది ఒక ఆవేదనగానే మిగిలిపోయింది.చదువుకున్న పెద్దలు కూడా ఈ కల్మషానికి వారి వంతు సేవ చేస్తూనే ఉన్నారు!
   సంస్కారహీనుల చేతికి నన్ను అప్పజెప్పకురా అని సరస్వతి అందుకే మొత్తుకున్నట్లు కనిపిస్తుంది!
   ఇదో పెద్ద సృజనాత్మకత,అద్భుతమైన సాహిత్యం అని అనిపించుకనే కాలం మరి!వారి అఙ్ఞానానికి కాసేపు నవ్వుకుని వదిలేయటం ఒక విధంగా మంచిది.
   ఇది ఏదో అద్భుతమైన సాహితీసేవ అని కొనియాడేవారున్నారు. ఇది మనసులో చేతకాని ఇతర (అ)నాగరిక పరమైన సాహిత్యాన్ని వంట పట్టించుకుని సంస్కృతం తెలుసుకోలేని సంస్కృతిలో ఒక కుడితిలో దొరలుతున్న దున్నపోతుల వ్యవహారం ఇది.ఇది తాత్కాలికమే!
   చిత్తశుధ్ధితో సత్యాన్ని శోధించే వారు (ఏ వర్గం వారైనా కావచ్చు) ఈ రకమైన బజారు వ్యవహారాన్ని మెచ్చుకోరు.ఏదో కోల్పోతున్నారనే బాధ వారిని వెంటాడుతూనే ఉంటుంది…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: