మన ప్రజాస్వామ్యం బ్రతికే ఉంది!-వేదాంతం శ్రీపతిశర్మ


చాలా కాలంగా నన్ను ఒక విషయం బాధించేది.మన రాజ్యాంగం, మన వ్యవస్థ, మనం సంపాదించుకున్న స్వాతంత్ర్యం గ్లామరుతో పుట్టుకొచ్చిన నాయకులు,ఒక కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు (విదేశీయులైనా ఫరవాలేదు),భూస్వాములు,దోపిడీ దొంగలు,రాజా మహారాజులు…ఇలాంటివారి సొత్తులేనా లేక సర్పంచ్ వ్యవస్థ నుంచి కొన్ని ఏండ్లు వరుసగా సేవ చేస్తూ భూమిని నమ్ముకుని జనంలో కలసిపోయి యాభైకి పైగా సంవత్సరాలు రాజకీయ ప్రక్రియను పట్టుకుని పిండే వ్యక్తులదా అని పలు మార్లు పలు చోట్ల నేను వ్రాసియున్నాను.

ఇది రాజకీయ దళాలను, వ్యక్తులను విమర్శించేందుకు నేను అడగలేదు.అసలు రాజ్యాంగం ఒరవడి ఏమిటి? అందులో పెద్దలు ఆశించినది ఏమిటి? ఈ అధిష్ఠానం వ్యవహారం చూసినప్పుడు ఇంత పెద్ద దేశంలో,ఇంతమంది మేధావులున్న సమాజంలో ఇలాగేనా పనులు జరగవలసినది? అని అనిపిస్తుంది. పార్టీలు,  అధిష్ఠానాలు అలా ఉంచితే అసలు రాజకీయ ప్రక్రియలో లేని (అ)ప్రధాని కనిపిస్తున్నాడు. ఆయన చదువుకున్నవాడు అని వదిలేయవలసిన అవసరం లేదు. సరిగ్గా చదువుకుని ఉంటే ఆ పదవిని ఒప్పుకునే వాడు కాడు! మన వ్యవస్థలో ఆ పదవిని పొందవలసిన పధ్ధతి అది కాదు అని చెప్పి ఉండే వాడు.రాష్ట్రపతి పదవి సంగతి వేరు…

ఏదో బహు గొప్పగా వ్యవహరిస్తోందునుకుంటున్నమేడం గారికి అసలు సిసలు ప్రజాస్వామ్య షాక్ ఇది. ప్రజలు ఎన్నుకున్న వారు ఆ ప్రాంతానికీ, ఆ ప్రజలకీ ఎంతగా కట్టుబడి ఉండాలో తెలుగు వాడు అత్యంత స్పాంటేనియస్ గా ప్రదర్శించాడు. చాలా ఏండ్లుగా వ్యవస్థకు దూరంగా ఉంటూనే షార్ట్ కట్లలో వచ్చేసి ఇంత దేశాన్ని పాలించేస్తున్న వారికి ఇది ఇప్పుడప్పుడే మింగుడు పడని విషయం.కాకపోతే ఆవిడెవరు, ఆవిడ ఇచ్చు పుట్టిన రోజు కానుకలేమిటి? ఈ దేశం పల్స్ ఈ  భూమికి అల్లుకుని ఉన్న నవనాడులలో ఉంది. ఢిల్లీలో కూర్చుని నవ్వుకుంటూ కాలక్షేపం చేసే వారి దగ్గర కాదు. తెలంగాణ విషయంలో టి.ఆర్.ఎస్ పార్టీని ఎన్నికలకోసం 2004 లో కలుపుకున్నప్పుడు, కామన్ మినిమం ప్రొగ్రాం లో పెట్టి రాష్ట్రపతి చేత చెప్పించినప్పుడూ బాగానే ఉంది. ఆ అంశాన్ని ప్రక్కకు నెట్టి గమ్మున కూర్చోవటం తెలంగాణా వారికి కాదు, ఒక తెలుగువాడిగా అందరికీ అవమానమే! ఆంధ్ర రాష్ట్రం గురించి, ఇక్కడి సమస్యల గురించి మాట్లాడేందుకు ఈ వీరప్ప ఎవడు? ఒక దిక్కుమాలిన సమానాంతర రాజకీయ దుర్వ్యవస్థకు దీటైన జవాబు చెప్పిన తెలంగాణవాదులు, సమైక్య ఆంధ్ర గురించి లేచిన వారు అందరూ అభినందనీయులే!

బోఫోర్స్ కుంభకోణం విషయంలో ప్రతిపక్షం యునైట్ అవ్వటం అంత విశేషం కాకపోవచ్చు. కానీ రాజ్యాంగంలో దాగి ఉన్న మౌలికమైన విషయం-గ్రాస్ రూట్ పాలిటిక్స్ అనేది ఒక ఉప్పెనలా లేవటం, కాంగ్రెస్ పార్టీలోనే ఈ నీచమైన అధిష్ఠాన వ్యవహారాన్ని తిప్పికొట్టటం అనేది చారిత్రాత్మకం. ఢిల్లీలోని డొల్లతనం ముందుకు వచ్చి హాస్యాస్పదంగా నిలచింది. తెలంగాణ ప్రాంతీయులు ఆంధ్రులను మరో రకంగా చూడవలసిన అవసరం లేదు! ఆంధ్రులకు, తెలంగాణ వాసులకు మధ్య ఘర్షణలు ఏ రోజూ మంచిది కాదు. ఈ అధిష్ఠానం వ్యవహారాన్ని తిప్పి కొట్టటంలో నిజమైన సమైక్యాంధ్ర దాగి ఉంది.తెలంగాణ అనేది మన సోదరుల సమస్యే! ఎవరో గడ్డం దాటి మాట రానివారు, మన గడ్డ గురించి తెలియని వారు,తెలిసీ తెలియని అవకాశవాదులు కాదు. మనమే ఆలోచించుకుని ముందుకు వెళ్లాలి. మన రాష్ట్రంలోని ప్రాంతాల వాసులను పరస్పరం దూషించటం ఏ రోజూ చేయకూడదు.అది ఎవరికీ తగదు. పొట్టి శ్రీరాములు విగ్రహాన్నిచెరచినవారు తెలంగాణకాదు తెలుగువారు కూడా కాదు. ఉన్మాదానికి అవకాశాన్ని కనిపెట్టిన వ్యక్తులు మాత్రమే! తెలుగు వారు భావోద్రేకాలకు లొంగిపోయే మూర్ఖులు కారు. పదవులకు రాజీనామాలు చేయటం స్వల్పమైన విషయం కాదు.అదే జరిగిన తరువాత బల్ల గట్టిగానే గుద్దటం అయిపోయింది. ఆధునిక సమాజంలో దైనందిన జీవితాన్ని అతిగా బాధిస్తే ప్రజల మెప్పు ఎవరూ పొందలేరు అన్న సంగతి అన్ని వర్గాల వారూ గుర్తు పెట్టుకోవాలి. రాష్ట్రాల విభజనల లాంటి సమస్యలను ఎదుర్కోవాలంటే స్టేట్స్ మెన్షిప్ అవసరం.లుంగీ కట్టుకుని కళ్లజోడు సద్దుకుని నేనూ చాలా చదువుకున్న వాడిని అని స్టైలుగా చెబితే సరిపోదు. మన ప్రజాస్వామిక చైతన్యంలోనే మన స్టేట్స్ మెన్షిప్ ఉంది. దానినే కాపాడుకుందాం.

‘Freedom…’, said Marx, ‘…is the appreciation of necessity and necessity is blind but only in so far as it is not understood.’

Let’s discover and rediscover the vital link between freedom and necessity not just every day or night, but every second second and every minute minute…

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

8 thoughts on “మన ప్రజాస్వామ్యం బ్రతికే ఉంది!-వేదాంతం శ్రీపతిశర్మ

  1. చాలా బాగా చెప్పారు.

    >>”ఒక దిక్కుమాలిన సమానాంతర రాజకీయ దుర్వ్యవస్థకు దీటైన జవాబు చెప్పిన తెలంగాణవాదులు, సమైక్య ఆంధ్ర గురించి లేచిన వారు అందరూ అభినందనీయులే!”

    అవును. అందరూ కూడా అభినందనీయులే. 100% ఏకీభవిస్తున్నాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: