జాతకంలో పితృకారకుడు,సంతానం పరిస్థితి-వేదాంతం శ్రీపతిశర్మ


 

వంశాభివృధ్ధి అనునది ముత్తాతల నుండి సక్రమంగా రావలసినది. క్రిందటి వ్యాసంలో సర్పశాపం గురించి వివరించటం అయినది. విఙ్ఞానపరంగా జీన్స్ అని చెప్పే విషయం జ్యోతిషంలో సూక్ష్మంగా కొన్ని చోట్ల, స్థూలంగా కొన్ని చోట్ల వివరించటం జరిగినది.విధి వ్రాత అనేది జ్యోతిషపరంగా మరియు వైఙ్ఞానికపరంగా ఒక క్షితిజంలో కలిసేది ఈ జీన్స్ అనే అంశం దగ్గర అని వేరే చెప్పక్కరలేదు…ఒకరి ఆస్తి (లేదా నాస్తి) ఈ జీన్సే కదా! కొద్దిగా సృష్టి నియమాలలోకి వెళదాం. రవి సృష్టిని ప్రారంభించువాడు, అందరికీ జీవధారం, పితృకారకుడు, తనుకారకుడు,ఆత్మకారకుడు. పైన ఇచ్చిన బొమ్మలో రవి ప్రక్కన శని ఉన్నాడు.రవి శనులు పరస్పరం శతృవులని అందరికీ తెలిసినదే!ఇదేమిటి? శని రవికి పుత్రుడే కదా? మరి శతృత్వం దేనికి అనే ప్రశ్న సబబైనదే! జ్యోతిష శాస్త్రంలో గ్రహాల మధ్య సంబంధ బాంధవ్యాలు వాటికి నిర్దేశించిన వ్యవసాయం (వృత్తి,ప్రవృత్తి) వలన ఏర్పడునవి. రవి తూర్పునుండి జీవితాన్నీ, ప్రాణశక్తినీ ప్రారంభించే వృత్తిని చేపడుతున్నాడు.ప్రారంభించే వాడి దగర నుండే అంతం చేయు ప్రక్రియ కూడా పుడుతుది. ఆయనే శని. జీవరాశిని కాలక్రమంలో,కలానుగుణంగా పరిసమాప్తి చేసి భూమి మీద చోటును ఏర్పాటు చేయటం శని వృత్తి.ఆయన పని రిసైక్లింగ్!అటు పడమర దిక్కున కూర్చుంటాడు. ఈ ఇద్దరూ-రవి,శని అంటే ఉదయం,అస్తమయం రెండూ ఒక చోట కలవటం ఎలా ఉంటుందో మీరు ఊహించగలరు. అందుచేత వారు శత్రువులు. శని కర్మసిధ్ధాంతాన్ని జాతకంలో ముందుకు తెచ్చినట్లు మరే ఏ గ్రహమూ తీసుకుని రాదు.గత జన్మ గురించి ఒకరి జాతకంలో శని ఉన్న స్థానం బట్టి, శని ఉన్న నవాంశ బట్టి చెప్పవచ్చును.జాతకంలో మేషం నుండి దశమ స్థానం మకరం-దీని అధిపతి శని. దశమస్థానం కర్మస్థానం.ఈ శనికి తండ్రి అయిన రవి ప్రజలను కర్మలు చేయమని ప్రేరేపిస్తున్నాడు (ఈ విషయంలో శృతులలోనూ, స్మృతులలోనూ ఒకే మాట్ చెప్పబడినది)రవి అధిపతి అయిన సింహ రాశి నుండి సప్తమం అయిన కుంభానికి కూడా శని అధిపతి!అందుచేత గురువు చేత సత్కర్మను ఆచరించి భాగ్యఫలమును పొంది (నవమాధిపతి గురు గ్రహం అని మీకు తెలుసు)ద్వాదశంలో మోక్షాన్ని సాధించమని ఒక జీవితచక్రం మనకు చెబుతున్నది… ప్రస్తుతం సంతాన విషయంలో జీన్స్,తాత ముత్తాతల నుండి వస్తున్న సమస్య విషయాన్ని పరిశీలిద్దాం. రవి పంచమమున నీచయందు శని నవాంశలో ఉండి,అటూ ఇటూ క్ర్రగ్రహ సంబంధం ఉన్నప్పుడు అది ఈ సమస్యను సూచిస్తుంది. అలాగే రవి పంచమాధిపతి అయి త్రికోణమున పాపితో కలసినా, చూడబడినా,రవి గురువులకు పరివర్తన కలిగి లగ్నం, పంచమము పాపయుక్తమైనా (గురువు పుత్రకారకుడు,రవి పితృ కారకుడు),లగ్నాధిపతి బలహీనుడయి పంచమాధిపతి రవితో కూడి రెండూ పాపయుక్తమయినా,పంచమ నవమాధిపతులు (పుత్ర,పిత్రు స్థానాలు) పరివర్తన చెంది లగ్న పంచమాలు పాపయుక్తమైనా,దశమాధిపతి కుజుడయి,పంచమాధిపతితో కూడి,లగ్న,పంచమ,దశమములు పాపయుక్తములు అయినా,దశమాధిపతి పాపస్థానగతుడయి, గురువు పాపరాశిగతుడయినా,రవి కుజ శనులు లగ్న పంచమములందుండి అష్టమ వ్యయములందు గురు రాహువులున్నా, అష్టమమున రవి,శని పంచమమున ఉండి పంచమాధిపతి రాహువుతో కూడినా,వ్యయాధిపతి లగ్నమున, అష్టమాధిపతి పంచమమున,దశమాధిపతి అష్టమమున ఉన్నా,ఆరు అధిపతి అయిదులో ఉండి దశమాధిపతి ఆరులో ఉన్నా,గురువుతో కూడి యున్నా, తర తరాలుగా వచ్చు ఒక సమస్య వలన సంతానం కలగటం లేదని గ్రహించవచ్చు. వేయి మందికి బ్రాహ్మణ భోజనము,కన్యాదానం చేసి దూడతో పాటుగా గోవును దానం చేయటం వలన ఈ సమస్యకు పరిష్కారం ఉండగలదు.

 

ఓం శాంతి: శాంతి: శాంతి:

 

~~~***~~~


రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “జాతకంలో పితృకారకుడు,సంతానం పరిస్థితి-వేదాంతం శ్రీపతిశర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: