‘టు మెన్స్ క్లాస్ రూం’-చిత్రం మీద వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు


16వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడ్డ చిత్రం ఇది. ఈ చిత్రం ఆసియా పనొరమా లో ఉత్తమ చిత్రంగా ఎన్నికైనది.

చైనా లోని ఒక పల్లెటూరులో జరుగు కథ ఇది.పల్లెటూరులోని స్కూలులో ఒక కుర్రాడి తల్లి పోయిందన వార్తను ఊరి పెద్ద స్కూలుకి వచ్చి అతన్ని తీసుకుని వెళ్లటంతో కథ ప్రారంభమవుతుంది. కుర్రాడు లోపలికి అడుగు పెట్టిన తరువాత స్క్రీన్ బ్లాంక్ అయి మరో దృశ్యంలోకి కథనం వెళ్లిపోతుంది. సినిమా యావత్తూ దర్శకుడు వాడిన పధ్ధతి ఇదే. తెలుగు సినిమా దర్శకులు ఏదో భావుకత చూపిస్తున్నట్లు శవదహనం అదే పనిగా చూపిస్తూంటారు.కొద్దిగా ఇటువంటి పధ్ధతులు చూసి తెలుసుకుంటే బావుంటుంది.ఒక విషయాన్ని చూపించనపుడు పాత్రల మనోభావాలను మరింత దృఢంగా చెప్పవచ్చు. ఏమయి ఉంటుందా అనే ఆలోచనతో ప్రేక్షకుడు బాధకు మరింత దగ్గరవుతాడు!

చిత్రం లోకి వెళదాం. ఆ కుర్రాడికి రోజుకొకళ్ల ఇంటిలో భోజనం ఏర్పాటు చేస్తారు. స్కూలు ఫీసు మాఫీ అవుతుంది.ఇంతలో ఇతని తండ్రి ఎయిడ్స్ తో మరణించాడని ఊరి పెద్దకు తెలుస్తుంది. 

ఇక్కడ నుండి ఆ వ్యాధిగ్రస్తుల పట్ల అవగాహన లేకపోవటం వలన, ఉన్నా ఇష్టం లేకపోవటం వలన ఆ ఊరు జనం చూపించే వ్యవహారం , 

అబ్బాయి పడుతున్న తిప్పలు, ఊరి పెద్ద జరుపుతున్న సంఘర్షణ సినిమా యావత్తూ ఆసక్తికరంగా సాగిపోతాయి.దర్శకుడు కొన్ని హాస్యపు సన్నివేశాలను కూడా ఎంతో నేర్పుతో కలిపాడు.

స్కూలు నుంచి ఇతన్ని వెలి వేయటంతో గ్రామ పెద్ద కార్యాలయంలోనే ఒక స్టోర్ రూంలో కుర్రాడికి ఒక క్లాస్ రూం ఏర్పాటు చేస్తారు.ఈ కుర్రాడి విషయంలో ఇన్స్పెక్షన్ ఉంటుంది అనె సరికి ఈ విధంగా చేయటం జరుగుతుంది. ఎప్పుడూ ఊరి పెద్దను అక్కడున్న వార్తా పత్రిక పట్టుకుని సతాయిస్తూ ఉన్న ఒక వృధ్ధుడిని ఈ కుర్రాడికోసం ఉపాధ్యాయునిగా నియమిస్తాడు ఊరి పెద్ద.ఇది నరేషన్ పధ్ధతిలో ఒక ఆలోచించవలసిన అంశం. చివరకు ఈ పాత్ర ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకంటుంది.అబ్బాయి చేత అన్నీ చదివిపించి పోటీలో విజయుడిని చేసి ప్రావిన్షియల్  స్కూలుకు ఎంపికయినట్లు చేస్తారు. ఆ సంగతి వాళ్ల అమ్మ సమాధి దగ్గర చెప్పి అతను బయలు దేరి వెళ్లిపోతాడు…

~~~***~~~
 

నేపథ్య సంగీతం అవసరమైన చోట వినిపించి ఘటనను దర్శకుడు అండర్లయిన్ చేస్తాడు. చాలా సార్లు కెమెరా ఎడమ ప్రక్క నుండి కుడి వైపుకు ప్రయాణించి జరుగుతున్న సన్నివేశాన్ని మన ద్ష్టికి తెస్తుంది. ఈ పధ్ధతి హిందీ చిత్రం ‘ధమూల్ ‘లో కనిపిస్తుంది. అందులో ఒక మూగ అమ్మాయి-దీపా సాహీ మౌనంగా రచ్చబండ తీర్పు జరుగుతున్నప్పుడు సాక్ష్యం ‘చెబుతుంది ‘! ఎలా అంటే ఈ పధ్ధతి లోనే! కెమెరా మాట్లాడుతుంది.

దర్శకుడు కొన్ని చోట్ల జీవిత సత్యాలను, వైపరీత్యాలను అద్భుతంగా ముందుకు తెస్తాడు.ఉదాహరణకు కుర్రాడు ఒంటరితనంలో కర్రా బిళ్ల ఆడుకుంటున్నప్పుడు గట్టిగా అరుస్తూ (చైనాలో అరుస్తూ వచ్చి బిళ్లను ఒక చోట కరెక్టుగా వేస్తేనే ఆ బిళ్లను కర్రతో కొట్టగలిగే అవకాశం లభించే పధ్ధతి కనిపిస్తుంది)వచ్చి ఒక్కడే బిళ్లను అక్కడ పడేసినపుడు పక్షులు ఆకాశంలో ఎగిరిపోవటం మనసును కదిలించింది.నిజమే! అందరూ విడిచిపెట్టినప్పుడు సమస్యే మన బంధువు. సమాజం వెలి వేసినప్పుడు అంతా స్వాతంత్ర్యమే!

సందర్భం వేరైనా తెలుగు చిత్రం ‘ఆనందభైరవి ‘ విషయానికి దగ్గరగా వస్తుంది. ఒక ఆడపిల్లకు,దొమ్మరి అమ్మాయికి నాట్యం నేర్పుతున్నందుకు ఆ ఆచార్యుడిని అగ్రహారం వెలి వేస్తుంది.వారిద్దరూ ఊరి అవతల చేరి ఒకే గురువు, ఒకే శిష్యురాలు…ఇలా అభ్యాసం చేసి చివరకు రాణించినట్లు చూపిస్తారు.

ఈ చిత్రంలో ఒక చిన్న పొరపాటు కనిపించింది. ఎయిడ్స్ తో ఉన్న ఆ కుర్రాడికి ఇంటిలో భోజనం పెటలేము కానీ అతని ఇంటికి పంపిస్తాం, మేము మీ మాట వినం అని చెప్పటానికి గ్రామ ప్రజలు కోపంతో గ్రామ పెద్దను నిలదీస్తారు. ఆ దృశ్యం అయిపోయిన తరువాత ఫ్రేం లోంచి అందరూ వెళ్లిపోతునప్పుడు ఒక యువతి ఎంద్కో నవ్వుతూ వెళ్లిపోతుంది. (ఒక్కో సారి హమ్మయా, సీను అయిపోయింది, అన్నట్లు చాలా మంది నటీ నటులు రిలాక్స్ అవుతారు.ఇక్కడ కటింగు జాగ్రత్తగా ఉండాలి)

~~~***~~~

ఈ చిత్రం ఇతరత్ర కూడా బహుమతులను గెలుచుకుంది. ఈ చిత్రం దర్శకుడు డాం లింగ్.
చిత్రంలో ముగ్గురూ-ఊరి పెద్ద, ఒంటరి కుర్రాడు, ఒంటరి అధ్యాపకుడు పాత్రలలో ఎంతో ఉత్తమమైన ప్రదర్శనలు చేశారు.

చెప్ప దలచుకున్నది సంఘటనల ద్వారా, ఎక్కువ గోల లేకుండా, లైటర్ వెయిన్ లో చెప్పుకుంటూ బ్రిస్కుగా సాగిపోయిన ఏ చిత్రమైనా ఎటువంటి పోటీలోనైనా నిలబడుతుందనే సత్యాన్ని ‘టు మెన్స్ క్లాస్ రూం ‘ నిరూపించింది.మొదటి దృశ్యంలోనే ఒక సంఘటనతో ప్రారంభించటం గుర్తించవలసిన విషయం.సీను కటింగు సింపుల్ గా సాగిపోయి ప్రతి దృశ్యాన్ని తిరిగి చూడాలనే ఆలోచన కలిగిస్తుంది.

~~~***~~~

The English version is available at www.filmreviewsonline.org

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: