‘ద క్వీన్ ‘ చిత్రం పై వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు


డయానా చరిత్ర అందరికీ తెలిసిందే! ఇటీవల నన్ను చాలా ఆలోచింప చేసిన ఒక పాత్ర (చరిత్రలోకి వెళ్లిపోయిన వారందరూ పాత్రలేనేమో!) డయానాది. దీనికి కారణం ప్రిన్స్ ఛార్లెస్, ఆమె మధ్య ప్రేమ వ్యవహారం, తరువాత రాయల్ కుటుంబం లో కలిగిన తేడాలు ఇవి కావు. మానవ చరిత్ర రాజు పేద మధ్య ఉన్న కథే. ఇది కలిపే ఒక కనిపించని వంతెన మీద ఆమె నిలబడి అది కలవదు కాబట్టి ఆ కదిలే వంతెన మీద నుంచి అలా పడి పోయింది. ఒక మామూలు కుటుంబం నుంచి డయానా ఆ రాజసం లొకి వెళ్లినప్పుడు ఒక మాట. ఆమె రాజగృహాన్ని (ఈ పదం చిత్రంగా ఉన్నా ఎందుకో వాడాలనిపిస్తోంది ) జన సామాన్యంలోకి తెచ్చే ప్రయత్నం బ్రిటన్ రాజకీయాలలో ఒక మైలు రాయి. డయానా పొందిన ప్రాచుర్యం సామాన్యమైనది కాదు. ఆ దేశంలో రాణీ గారి పట్ల ఉన్న ప్రజాభిప్రాయం డయానా లోంచి కదిలి ఒక ఊపు ఊపింది. డయానా ప్రజల పక్షం, ఛార్లెస్ మధ్య నిలబడి ప్రజలకు చేయిని అందించిన ఒక రాజకుమారుడు, డయానా ద్వారా కన్న పిల్లలు కాబోయే రాజులు…సూర్యుడు అస్తమించని దేశం, రాచరికం గత వైభవాలను క్షణ క్షణం గుర్తు చేసే దేశం. ప్రజాస్వామ్యం సజీవంగా ఉన్న దేశం! ఏది ధర్మం, ఏది న్యాయం?

~~~***~~~

తెర తీద్దాం…
టోనీ బ్లెయిర్ ఎన్నికలలో డయానా పేరు వాడుకుని (చివరి ప్రచార దశలో) గెలుస్తాడు. ఆమెను ప్రజల రాజకుమారిగా వర్ణిస్తాడు. ఆమె ఆ రోజులలో కారు ప్రమాదంలో మరణిస్తుంది. ఆమెకు విడాకులు ఇవ్వటం జరిగిపోయింది కాబట్టి  అంత్యక్రియలు వాళ్ల కుటుంబం యొక్క స్వవిషయం అని ఎలిజబెత్ రాణి పబ్లిక్ గా ఏ వక్తవ్యం ఇవ్వదు. జనం లో కలిగిన ఆందోళన, మీడియాలో రేగిన వివాద, బ్లెయిర్ రాణీని ఒప్పించి టి.వీ లో మాట్లాడించటం, రాణీ ఆ అంత్యక్రియలకు హాజరవ్వటం, ఇవన్నీ నాటకీయంగా చూపించటం జరుగుతుంది.
దర్శకుడు చిత్రీకరించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఒక రాజకీయ ఇతివృత్తం గల నేపథ్యం అయినప్పటికీ ఎక్కడా ఒక్క క్షణం కూడా విసుగు కలగని చిత్రం ఇది. పాత్రలు-బ్లెయిర్, ఛార్లెస్, ఎలిజబెత్ రాణి, బ్లెయిర్ భార్య…అంతే. అందరి కోణాలు వరుస వరుసగా చక్రం లా తిప్పుతాడు దర్శకుడు.
ఒక ప్రముఖ ఘటనను ఎంచుకుని దాని చుట్టూ ఉన్న విషయాలను పాత్రల ద్వారా ఎంతో నేర్పుతో చూపించే ప్రక్రియ ఇది. మనకి సంఘటన తెలుసు. దాని తరువాత ఇలా జరిగి ఉండవచ్చు అనిపించేది ఒక వైపు. దానినే కొద్దిగా ఫోకస్ మార్చి కాన్సెప్చుచల్ గా ఒక వైపరీత్యాన్ని ప్రదర్శించటం రెండవ వైపు. ఈ రెండు వ్యవహారాలలో అద్భుతమైన విజయాన్ని సాధించాడు దర్శకుడు.
బ్లెయిర్ రాణీని ఒప్పించటం ఒక విజయంగా అతని భార్య అనుకోవచ్చు. ప్రజలూ, మనం కూడా ఆ సమయంలో అనుకోవచ్చు. ఇంతలోనే బ్లెయిర్ వ్యూహం మారుస్తాడు. చివరి దృశ్యంలో రాణీ దగ్గరకు వెళ్లి మామూలుగా ఎందరో ప్రధాన మంత్రులు చేసిన పధ్ధతిలో ‘చెప్పండి చేస్తాను ‘ అన్నట్లు రాయల్ పేలెస్ లాన్ లో ఆవిడ వెనుక నడుస్తాడు. రాజకీయాలలో జనరంజకమైనది అందరికీ ఆమోదమే-అది కుర్చీని తెచ్చి కూర్చోపెడుతుంది. ఆ తరువాత ఆ నిలబడ వలసిన నిజాన్ని కూడా అందులోనే కూర్చోపెట్టి క్రమంగా పడుకోపెట్టటం కూడా అలా క్షణంలో జరిగిపోతుంది. వైపరీత్యం చూపించిన ఏ కథైనా పలు కాలాలు నిలబడిపోవటం కూడా ఒక వైపరీత్యమే కదా?!

ఎలిజబెత్  రాణి వెళ్లాలా వద్దా అనే అంశం మీద మథన పడుతూ ఆమె వాహనం ఆగిపోయినప్పుడు ఒక జింక గురించి ఆలోచిస్తుంది. తన మనుమళ్లు కోరుకున్నారు కదా అనుకుంటుంది. ఇంతలో ఒక బులెట్ శబ్దం వినిపించి దానిని తప్పించే ప్రయత్నం చేస్తుంది. కానీ తరువాత మరల అక్కడికి వెళ్లినప్పుడు దానిని ఎవరో వేటాడేశారని తెలుసుకుంటుంది.
డయానా, జింక సింబాలిసం కొద్దిగా బాధనే మిగిలుస్తుంది.
రాణీ గారు డయానా అంత్యక్రియల సమయంలో అక్కడ ఉన్న ప్లేకార్డ్లను చూస్తూ వెళుతుంది. ‘ మా రక్తం త్రాగావు ‘ అని ఒక చోట ఉంటుంది. అన్నీ చూశాక ప్రజల వైపి ఆవిద తిరుగుతుంది. ఒక చిన్న పిల్ల ఒక పుష్ప గుఛ్చాన్ని పట్టుకుని ఉంటుంది. ‘ నా చేతి మీదుగా డయానాకు ఇవ్వవా? ‘, అని ఆవిడ అడుగుతుంది. అ పాప ‘ నో…’ అన్నప్పుడు ఆవిడ ముఖంలో రంగులు మారిపోతాయి. వెంటనే ఆ పాప ‘ ఇది నీ కోసం ‘ అని చేతికి ఇస్తుంది…ఈ దృశ్యం గొప్పది! బ్రిటన్ చరిత్రను ఒక్క మాటలో చెప్పాడు దర్శకుడు!

~~~***~~~

హెలెన్ మిరెన్ ఎలిజబెత్ రాణిగా, మైకెల్ షీన్ టోనీ బ్లెయిర్ గా, ఎలెక్స్ జెనింగ్స్ ఛార్లెస్ గా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు స్టిఫెన్ ఫియర్స్. ఇది ఎన్నో అవార్డులు పొందిన చిత్రం. రాణీగా మరో సారి (ఈమె పలు సార్లు ఆ పాత్రలో మనకు ఇతర చిత్రాలలో కనిపించారు) ఎంతో సహజంగా, హృద్యంగా నటించిన హెలెన్ మిరెన్ ఉత్తమ నటిగా అకాడమీ అవార్డు పుచ్చుకుంది.
~~~***~~~
రాజకీయాల మీద చాలా మంది చిత్రాలను రూపొందించాలని అనుకుంటారు. ఘటనకీ, సంఘటనకీ గల సంబంధం ఎక్కడా అని యోచిస్తే ప్రక్రియలు ముందుకు వస్తాయి. మూడూ సంగమించిన చోట ఒక భావోద్రేకం సుడిగుండం లా తిరుగుతుంది. ఒక నాటకీయత అక్కడే…ఆ సంఘటనతోనే పైకి ఉప్పెనలా లేస్తుంది.

…దటీస్ మువీ మేకింగ్!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

6 thoughts on “‘ద క్వీన్ ‘ చిత్రం పై వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు

 1. 2007 ఆస్కార్ అవార్డు స్క్రీన్ ప్లే నామేనేషన్ల లో క్వీన్ సినిమాకూడా ఉంది.
  మీరు రాసిన జింక సన్నివేశమే ఈ సినిమాకి సంబంధించిన క్లిప్పింగ్ గా చూపిస్తారు.
  స్క్రీన్ ప్లేలో రాసిందీ, దాన్ని విజువల్ లో ఎలా తీసింది రెండూ కలిపి చూపిస్తారు.
  ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అవార్డ్ రాక పోయినా ఆఖరి అయిదు ఆణిముత్యాల్లో చోటు సంపాదించుకుంది.

  రివ్యూ బాగా రాసారు.

  -సాయి బ్రహ్మానందం

 2. ఒక చిన్న పిల్ల ఒక పుష్ప గుఛ్చాన్ని పట్టుకుని ఉంటుంది. ‘ నా చేతి మీదుగా డయానాకు ఇవ్వవా? ‘, అని ఆవిడ అడుగుతుంది. అ పాప ‘ నో…’ అన్నప్పుడు ఆవిడ ముఖంలో రంగులు మారిపోతాయి. వెంటనే ఆ పాప ‘ ఇది నీ కోసం ‘ అని చేతికి ఇస్తుంది…ఈ దృశ్యం గొప్పది! బ్రిటన్ చరిత్రను ఒక్క మాటలో చెప్పాడు దర్శకుడు!

  sir ardamkaledu kasta ee scene ni vivaristara ante director oka matalo em chepadu rani ante abhimanamana

  1. Well. Let me apologise for coming back a bit too late on this. I am the laziest guy on this planet-the top ten names are mine. ( I don’t mean to say that your photograph suggests something similar though!).
   Britain has been romancing with the idea of using the charms of the monarchy with the ambience and popularity of modernising the nation for quite some time. Politics has been an admixture of holding the Royal family as a symbol of Britain’s greatness and trying to pull the masses into the realm of questioning this very monarchy. The gains have been for those who exploited this rhetoric. The common Britisher sails along with the modern travails of unemployment, racism etc. etc. but when the queen is out there, he finds himself in difficult circumstances to identify himself with a ‘glorious past!’

   Diana appeared to create a bridge which broke down half way! Now who will travel from where-that’s the big question. Should a queen get into the democratic system and dissolve her status or can a commoner climb the ladder and reach the status?
   Diana’s children are into the Royal family but then they belong to the Prince! So it is a case of a rich prince picking up the usual damsel from the crowd and continuing his lineage where as the girl is back to square one.

   What appears to be an interesting development in the history of Great Britain is that Diana had been focussed as the representative of the common British people who entered the Royal family and attempted reforms from that end and failed!

   So the status quo ante is restored-they loved Diana, placed wreaths, some loving ones, some odd comments about the queen etc. etc. But finally, as a nation, it’s all over! There is a token of affection for the queen as well-we understand the roots of the nation…

   ~Sripati

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: