12-18 అక్టోబర్ 2009 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక:
నిరంతరం మంగళమాతనోతు

ఈ వారం గ్రహస్థితి: రవి కన్య, తుల రాశులు, బుధుడు, శని, శుక్రుడు కన్య, గురు రాహువులు మకరం, కుజ కేతువులు కర్కాటకం, చంద్రుడు కర్కాటక, సింహ, కన్య రాశులు సంచరిస్తారు.

మనసులో ఉన్న అలజడులు మాసిపోయి సరైన దృక్పథాలు ఏర్పడు వారం ఇది. చాలా మందికి గతం నుంచి తోసుకుని ముందుకు వెళ్లి మంచి పనులు చేయాలనే తపన ఈ వారం కలుగవచ్చును. విషజ్వరాలు బాధించగలవు. జాగ్రత్త వహించవలసిన అవసరం ఉన్నది.

మేషం: ఇంటిలో ప్రశాంతత చిక్కుతుంది. బంధువులతో గడుపుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగవచ్చు. మంచి పుస్తకాలు చదవండి. సుబ్రహ్మణ్య కవచం చదవండి.

వృషభ రాశి: ఇతరుల తప్పులు ఎత్తి చూపకపోవటం ఎంత మంచిదో ఈ వారం గ్రహిస్తారు. డబ్బు సకాలానికి అందుతుంది. సోదరుల సహకారం లభిస్తుంది, లాభిస్తుంది కూడా! లక్ష్మీ అష్టోత్తరం చదవండి.

మిథున రాశి: ఆలోచనలు కలసి వస్తాయి. కొంత సహనం అవసరం. తాత్విక చింతన ఒక వైపు, అదృష్టం కలసి రావాలని మరో వైపు చిత్రంగా కనిపిస్తాయి. ధ్యాన మార్గం మంచిది.

కర్కాటక రాశి: కొత్త చదువులు ప్రారంభించే వారికి మంచి వారం. నూతన పరిచయాలు ఏర్పడ గలవు. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. నూనె వస్తువులతో జాగ్రత్త వహించాలి. విష్ణు సహస్రనామం చదవండి.

సింహ రాశి: ఒక రాజయోగం ఉన్నది. ఉన్నత అధికారుల మెప్పు, పదోన్నతి, బదిలీ అన్నీ అనుకోకుండా జరుగుతాయి. ఒక సమస్య సమాధానం వైపు సాగుతుంది. దంతాలు బాధిస్తాయి. ఆదిత్య హృదయం చదవండి.

కన్య రాశి: మీరు జీవితంలో కొత్త మలుపు తిరగనున్నారు. మరొకరి సహాయం కోరే ముందు మీరే ఎందుకు చేయలేరనేది సమీక్షించుకోండి. మీలోని అంతర్లీన మైన శక్తి బయటకు వస్తుంది. మీ సహనం మెప్పు పొందుతుంది. శ్రీసూక్తం చదవండి.

తుల రాశి: ఖర్చులు పెరగనున్నాయి. విదేశాల నుంచి ఒక నిరాశాజనకమైన వార్త వినగలరు. మీ పెట్టుబడులు పదిలంగానే ఉంటాయి. మిత్రులు సహాయం కోరుతారు. హనుమాన్ చాలీసా చదవండి.

వృశ్చిక రాశి: రాజకీయాలలో ఉన్న వారికి చక్కని అవకాశాలు ఉన్నాయి. కొందరు పార్టీలు మారవచ్చు. కొందరికి మంచి పదవులు లభించగలవు. స్త్రీలు ముందుకు దూకుతారు. రసాయన శాస్త్రం లో నిపుణులకు మంచి గుర్తింపు లభించగలదు. దుర్గా సప్తశ్లోకీ చదవండి.

ధను రాశి: భయాందోళనలు దూరం అవుతాయి. సంతానం లేని వారికి మంచి కాలం. ప్రయత్నాలు ఫలించగలవు. దాన గుణం మిమ్మల్ని కాపాడుతుంది. బంధువుల మెప్పు పొందుతారు. శ్రీ దత్త స్తవం చదవండి.

మకర రాశి: దూరం ఆలోచించి దగ్గర వస్తువును పోగొట్టుకోగలరు. దగ్గరున్నవి చక్క పెట్టుకొనండి. ఆదాయం పెరిగే సూచనలున్నాయి. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. లింగాష్టకం చదవండి.

కుంభ రాశి: బాధ్యతల వలన కొంత చిరాకులు ఉండవచ్చు. ఈ వారం మీ ఆస్తుల విషయం పరిష్కారం కావచ్చు. కళాకారులకు ఇష్టం లేని అవకాశాలు రాగలవు. వ్యాపారస్తులకు ఈ వారం కొన్ని ప్రభుత్వ సంబంధమైన సమస్యలు తలెత్త గలవు. గోవులకు గ్రాసం వెయ్యండి.

మీన రాశి: వివాహం వైపు ఆలోచిస్తున్న వారు మంచి లాభాలు పొందగలరు. జీవితాన్ని ఒక్కో రోజుగా జీవించే వారు భవిష్యత్తుకు చక్కని ప్రణాలికలు వేయగలరు. కొంత విలాసానికి వెచ్చిస్తారు. కొందరికి ఉద్యోగంలో మార్పు ఉండవచ్చు. మహాసౌరం చదవండి.

ఈ వారం మంచి మాట:
‘ అహమస్మి…జ్యోతిరహమస్మి, బ్రహ్మా అహమస్మి! ‘
(అఘమర్షణ సూక్తం)
అందరికీ వెలుగుల పండుగ దీపావళి శుభాకాంక్షలు!

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~

The English version is available at www.sripati.com

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “12-18 అక్టోబర్ 2009 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: