‘ గుడ్ సెన్స్ అండ్ నాన్ సెన్స్-విత్ అపాలజీస్ టు నన్’, డాక్టర్ బి. దయానంద రావ్ గారి పుస్తకం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు


డాక్టర్ దయానంద రావు గారు ఒస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా చేసి రిటయిర్ అయ్యారు. ఆయన వృత్తి న్యూరో సర్జరీ. ‘ నో అగ్లీ స్కార్స్ ‘ అనే ఆత్మకథ, కర్ణాటక సంగీత వాగ్గేయకారుల చరిత్ర సంకలనంగా మరో పుస్తకం రచించారు. ఈ గుడ్ సెన్స్…పుస్తకం ప్రచురించిన సంవత్సరం-1997 లోనే ఆయన కన్ను మూశారు.

కొన్ని సంవాదాలను ఎంచుకుని ఆయన ఒక లైటర్ వెయిన్ లో మాటలలోనే గారడీ చేస్తూ చాలా అంసాలను ఆలోచింప జేసే విధంగా ముందుకు తెచ్చారు. ఉదాహరణకి కొన్ని శీర్షికల పేర్లు చెబుతాను:
టు స్వేర్ అండ్ సిన్ ఆర్ సిన్ అండ్ స్వేర్, వార్ ఫుటింగ్, మై ఫుట్!, వెన్ వైస్ వస్ వర్ట్యూ…ఇలా 23 శీర్షికలుంటాయి.

ప్రతి శీర్షికలో ఓ నలుగురు కూర్చుని మాట్లాడుకుంటారు. మాటలు సాగుతుండగా మామూలుగా అందరూ మాట్లాడుకునే మాటలే ఉన్నయి అనిపించినా రక రకాల నేపథ్యాలు గల వాళ్లు అక్కడ ఉండటం వలన ఈ మాటకు అర్థం వేరండీ అని చెప్పటంతో ఒక హాస్యాస్పదమైన పరిస్థితి ఏర్పడుతుంది. రచయిత నేర్పు ఇక్కడే కనిపిస్తుంది. మరో వ్యక్తి ఆ హాస్యాస్పదమైన విషయాన్ని మన రాజకీయ పరిస్థితులలో ఇది నిజమేనని నిరూపించటం జరుగుతుంది.
ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఈ రోజు ఉన్న ముప్పు-వర్ద బాధ గురించి (అప్పటి వరద బాధ) ఒక సన్నివేశం ఉన్నది. ఆ వివరాలు మీ ముందు ఉంచుతున్నాను-
ఇది ‘ వార్ ఫుటింగ్, మై ఫుట్ ‘ అనే శీర్షికలో ఉన్న విషయం. అక్కడ కూర్చున్న వ్యక్తులలకు సంబంధించిన ఒకరు వైజాగ్ లో చిక్కుకుని ఉన్నాడు.
ఒక వ్యక్తి అంటాడు-ప్రకృతి మనకు ఎన్ని అవకాశాలిచ్చినా ఒక్క పాఠం కూడా మనం నేర్చుకోము! ఏ ప్రభుత్వమైనా ఇంతే!
నిన్ననే మంత్రి గారన్నారు, మనం చేయ గలిగినది లేదు. వైపరీత్యాలు పెద్ద దేశాలను కూడా కొడుతున్నాయి. నేను ఇంత కంటే దారుణ మైనవి చూశాను. కాకపోతే ఇది దేశీయ విపత్తు కాదు!
ఇంకొక వ్యక్తి అన్నాడు-ఆయన వెంటనే ఒక సర్వే కోసం ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కాడు. మన వాళ్లు, మన ముఖ్య మంత్రి ఇప్పటికే అలా వెళ్లారుగా?
ఎవరినీ నమ్మ కూడదు. కళ్లతో చూడాలి…
(ఈ రోజయితే హెలికాప్టర్ ఎక్కడానికి ఎవరూ ముందుకు రావటం లేదు )
చివరకు ఒక కమిటీ వేస్తారు. దొరబాబులు పండగ చేసుకుంటారు!
మరో వ్యక్తి అన్నాడు-ఇవన్నీ దండగ. ముందు సహాయ చర్యలు వార్ ఫుటింగులో జరగాలి. కాకపోతే వార్ లేనప్పుడు వార్ ఫుటింగ్ ఎలా వస్తుంది?
అక్కడ కూర్చున్న రెందవ ప్రపంచ యుధ్ధ సేనాని ఒకాయన మొదలెట్టాడు…
వార్ ఫుటింగ్ మై ఫుట్! మీరెవరూ యుధ్ధాన్ని చూడలేదు. వార్ ఫుటింగ్ అంటే మూడు విషయాలుండాలి. ఒకటి, సంగఠిత చర్యతో పాటు ఒక అర్జెన్సీ, రెండు, మనుషులు, మెటీరియల్…వీటిలో అతి తక్కువ వాడుకతో అతి ఎక్కువ సాధించటం, మూడు, ప్రజలను ఎంచుకున్న వ్యూహంలో పూర్తిగా పాల్గొన చేయాలి. వార్ ఫుటింగ్ అంటే అది అర్థం!
మొదటి దాని దగ్గరకు వద్దాం-సంఘటిత శక్తి ఏది? ఆ రోజుల్లో రెండవ యుధ్ధంలో విన్స్టన్ చర్చిల్ ఒక కొఏలిషన్ నడుపుతున్నా సంఘటితంగా యుధ్ధం చేశారు. తరువాత ఆయనను తిశేశారు. (రోశయ్య గారు తాత్కాలికమే కదా).
రెండవ దానికి వస్తే నలుగురు నాలుగు వైపులు పరుగులు తీస్తున్నారు.
మూడవ దానికి వస్తే స్థానిక ప్రజలు ఎక్కడైతే ఇబ్బందులలో ఉన్నారో అక్కడికి దగ్గరలో ఉన్న ప్రజలను రంగం లోకి దింపటం జరగదు. అది జరిగితే చాలా త్వరగా పనులు పూర్తి అవుతాయి…
వ్యాసం చివర ఒక మాట ఉంటుంది-సభ్యత పెరుగుతున్న కొలదీ యుధ్ధ నీతిలోనూ, సాంకేతిక పరమైన వాటిలోనూ మనుషులనూ సామాన్లనూ ఏరి పారేసే ప్రక్రియ కోసం ఎలాగైతే మార్పులుంటాయో, ఒక ప్రకృతి వైపరీత్యం నుంచి మరో ప్రకృతి వైపరీత్యం వైపు సాగుతున్నప్పుడు అంచనా వెయ్యటం లోనూ, అవలంబిస్తున్న పధ్ధతులలోనూ మార్పులు రావాలి. (ఇక్కడ మాటలో వైపరీత్యం ఉంటుంది. వినాశానికి వార్-వార్ ఫుటింగ్! ప్రకృతి చేసె నష్టం ఒకటి, వార్ నుంచి మనం చేసే విధ్వంసం మరొకటి).
ఆ సేనాని ‘ దయ చేసి వార్ ఫుటింగ్ అనే పద జాలాన్ని వాడకండి. అది ప్రకృతి వైపరీత్యానికి, విధ్వంసాన్ని ఆపటానికీ వాడకూడదు ‘ అంటాడు.
పోనీండి. వార్ అంటే హిందీలో ఒక అస్త్రాన్నో శస్త్రాన్నో ప్రయోగించటం. లేదా ఒక ఎత్తు వేయటం. ‘వారం ‘ అంటే సన్స్కృతం లో ‘ మరల ‘ అని అర్థం. అంటే మరల ఇది ఉంటుంది, మరల ‘ఇదే ‘ ఉంటుంది. ఇదే ‘వార్ ఫుటింగ్ ‘ అని కనిపిస్తోంది.

నిజాన్ని ఒక్క మాటలో చెప్పటం కష్టం కావచ్చు. నిజం కోసం అబధ్ధం చెప్పాలేమో! (ఆర్ట్ ఈస్ అ లెయి విచ్ రివీల్స్ ద ట్రుత్ ). అదీ అవసరం లేదు అనిపిస్తుంది. వాడుకలో మనం వాడుతున్న పద జాలాల అసలు వ్యుత్పత్తి వైపుకు వెళితే ఇప్పుడున్న వాడుకలో ఉన్న వైపరీత్యం, ఒక హాస్యాస్పదమైన విషయం, ఒక నిజం చక్కగా కనిపిస్తాయి.
సంవాదాల స్వరూపంలో ఉన్నప్పుడు ఇటువంటి విషయాలు మరింత ఆకట్టుకుంతాయి. ఆర్ట్ బుష్వాల్డ్ శైలి అందుకే అంత ప్రాచుర్యం పొందింది.
చిత్రం ఏమిటంటే ఆయన పేరమవుంట్ వారి  మీద ఆయన విషయాన్ని ఎత్తేసినందుకు విజయవంతంగా కేసు చేశాడు. ఆ త్రౌవాత ఆయన ఒక మాటన్నాడు. ఇంత వరకూ ఆయనకు అన్ని విషయాలలో ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండేది. ఆయన లాయర్ మొదటి బిల్లు ఇచ్చాక అది వెళ్లిపోయింది. అది కొన్ని వేల డాలర్లు. ఇది కేవలం ఫొటో కాపీయింగు కోసం అన్నారుట! అసలు బిల్లు వచ్చే సరికి ఆయన చాలా గట్టిగా నవ్వటం మొదలు పెట్టాడు. అదేమిటి? అంటే ‘ నేను చేయగలిగింది అదొక్కటే ‘ అన్నాడు!
‘ గుడ్ సెన్స్…’ పుస్తకం క్రెస్ట్ పబ్లిషింగ్ హవుస్ (జెయికో సంస్థ ) జి-2, 16 అన్సారీ రోడ్, దరియా గంజ్, కొత్త డెళీ-110 002 వారు ప్రచురించింది. దీని ధర 75 రూపయలే! ఈ పుస్తకం హిగ్గిన్ బాథంస్ లో నేను చాలా కాలం క్రితం కొన్నాను. వరద భీభత్సం చూసి ఈ శీర్షిక, అలాగే ఈ పుస్తకం గురించి చెప్పాలనిపించింది.
~ వేదాంతం శ్రీపతి శర్మ

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “‘ గుడ్ సెన్స్ అండ్ నాన్ సెన్స్-విత్ అపాలజీస్ టు నన్’, డాక్టర్ బి. దయానంద రావ్ గారి పుస్తకం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: