4-10 అక్టోబర్ 2009 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక:
నిరంతరం మంగామాతనోతు!

ఈ వారం గ్రహస్థితి:

రవి శనులు కన్య, గురు రాహువులు మకరం, కుజుడు మిథున కర్కాటక రాశులు, కేతువు కర్కాటకం, శుక్రుడు సింహం, బుధుడు సింహ కన్య రాశులు, చంద్రుడు మీన, మేష, వృషభ, మిథున రశులు సంచరిస్తారు.

దేశ కాల పరిస్థితులు క్షీణించు కాలం ఇది. అనుకోని ఇబ్బందులతో పాటు పొంచి ఉన్న శత్రువులు విజ్రుంభించగలరు. అసమ్మతి, అసంతృప్తి పలు చోట్ల సార్వజనికంగా కనిపించగలదు. అయినప్పటికీ ఆదాయం బాగానే ఉండగలదు. కొన్ని ఒప్పందాలు కుదరగలవు. రవి తుల రాశి దాటే వరకు ప్రకృతి వైపరీత్యం తప్పదని చెప్ప వలసి యున్నది. ప్రజలు నిరంతరం విష్ణు సహస్రనామం, శ్రీసూక్తం పారాయణ చేయటం మంచిది. భూమి సూక్తం వినాలి.
ప్రకృతి వైపరీత్యాలు ప్రజలను బాధ పెట్టు సందర్భాలు ఇక్కడ శాస్త్ర రీత్యా ఉదహరిస్తున్నాను:
1. గోవధ, గోహింస
2. ఋతు స్రావ సమయంలో కూడా స్త్రీలు మూల మంత్రములను జపించినా, దేవాలయాలలోకి ప్రవేశించినా
3. సదాచార సంపన్నులు కాని వారికి యోగ విద్యను ఉపదేశించుట జరిగినా
4. గురువు దగ్గర అభ్యాసము , గురువు అనుఙ్ఞ లేకుందా వైదిక విద్యను , శాస్త్రాలను ప్రవచించినా
5. పెద్దలను, గురువులను దూషించినా
6. ధర్మాన్ని విస్మరించి ప్రవర్తించినా
7. వైదిక ఙ్ఞానమును దురుపయోగం చేసినా లేక నిర్ణీతమైన పధ్ధతిలో ఆచరించకపోయినా
8. రాజు (ప్రభుత్వం) అవినీతిని ప్రోత్సహించినా
9. అమాయకులు, బలహీనులు ద్:ఖించించినా
10. ప్రజలు సూర్యోపాసన చేయకున్నా
…ఇవి ప్రస్తుత కాలానికి సరిపోవు విషయాలు మాత్రమే!
ఇంటింటా ధర్మ మార్గం వైపు ప్రజలు నడచు పధ్ధతిని సూటిగా, గట్టిగా నిర్దేశించ వలసిన అవసరం పెద్దలకు ఉన్నది. జనరంజకంగా ఉండు తత్వాలు, మనోరంజకంగా ఉండు విషయాలు ప్రాచుర్యం కోసం వివిధ మాధ్యమాల ద్వారా చెప్పి వంకర భాష్యాలను చాటి పేరు తెచ్చుకునే ఒక చెడు వ్యవస్థ ఈ రోజు ఏర్పడినది. ఇది సనాతన సంప్రదాయానికి జరుగుతున్న తీరని అనాదరం. ప్రజలు గమనించగలరు!

‘ అగ్నిరివ కక్షం దహతి బ్రహ్మ పృష్ఠమనాదృతం ‘
-ఇది వేద వాక్కు. వైదిక విద్యతో అనాదరంగా వ్యవహరించినపుడు అది అడవిలో దావానలంలా దహించి వేయగలదు…

~~~***~~~

మేష రాశి: వారాంతంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆదాయం బాగుంటుంది. ఒక మంచి వార్త వింటారు. దైవ చింతన అవసరం. వస్తువులను సేకరిస్తారు. బట్టలు కొనుగోలు చేస్తారు. సుబ్రహ్మణ్య కవచం చదవండి.

వృషభ రాశి: పోటీలు, పోట్లాటలకు దూరంగా ఉండవలసిన వారం. గతంలో మీరు వేసిన కొన్ని లెక్కలను సరిదిద్దుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆహార నియమాలు పాటించండి. అల్సర్లు ఏర్పడ వచ్చు! మహాసౌరం చదవండి.

మిథున రాశి: చర్మం విషయంలో జాగ్రత్త వహించాలి. సత్కార్యాలు చేపట్టవలసిన వారం. ఇంటి మీద పెట్టిన ఖర్చులు మంచి ఫలితాలిస్తాయి. మీ ఓర్పు మీ నేర్పుగా కనిపిస్తుంది. ఒక ప్రయాణానికి ఆహ్వానం అందగలదు. ప్రయాణం పూర్తిగా మానుకొనుట మంచిది. నాగ పడిగకు అభిషేకం చేయండి.

కర్కాటక రాశి: కుటుంబ సభ్యుల విలువ తెలుసుకుంటారు. ఆహారం సరిగ్గా తీసుకొన పోవుట వలన సమస్యలు ఉండవచ్చు. ఉద్యోగస్తులకు మంచి వార్తలున్నాయి. శత్రువులను జయిస్తారు. మరచిపోయిన పని ఒకటి గుర్తుకు వస్తుంది. రుద్రం పారయణ చేయండి.

సింహ రాశి: మీ తప్పును తెలుసుకుంటారు. అయినా ఒప్పుకోరు. అది మీ నైజం! వారం మధ్యలో ఒక వివాదం తలెత్త గలదు. ధోరణి ఆలోచనల వలన ఇబ్బందులకు గురి కాగలరు. కుడి కంటిలో సమస్య కనిపిస్తున్నది. ఒక బాధ్యతను విస్మరించారని తెలుసుకుంటారు. విష్ణు సహస్రనామం చదవండి.

కన్య రాశి: ఋణం పొందుతారు. పై అధికారుల సహాయం పొందుతారు. స్త్రీ వలన లాభం ఉన్నది. ఒక ప్రయాణం తప్పదు. ప్రయాణం వలన లాభం కూడా పొందుతారు. శ్రమ తప్పదు. మీ ఉత్సాహాన్ని ఇతరులు అపార్థం చేసుకోగలరు. కళాకారులకు మంచి వారం. శ్రీసూక్తం చదవండి.

తుల రాశి: మీ చుట్టూ ఉన్న మిత్ర బృందంలో కొంత అలజడి ఉండవచ్చు. ఒక నూతన పరిచయం చాలా దూరం వరకు సాగవచ్చు. ప్రేమ వ్యవహారం ఉన్న వారికి కథ ముందుకు సాగుతుంది. బంధు వర్గంలో భిన్నాభిప్రాయాలు కలుగగలవు. వారాంతంలో ఒక వార్త కలవర పెట్టగలదు. లలితా సహస్రనామం చదవండి.

వృశ్చిక రాశి: సమస్యల పరిష్కారానికి చర్చలు చేయాలనుకున్న వారు ఈ వారం ఆ పనిలో ఉండటం మంచిది. భూ వివాదాలు పరిష్కారం కాగలవు.విదేశాల నుంచి మంచి అవకాశాలు రాగలవు. కొందరు వ్యక్తుల గురించి స్పష్టంగా తెలుసుకుంటారు. అష్టలక్ష్మీ స్తుతి చేయండి.

ధను రాశి: పిల్లలు మీ దారికి రాగలరు. వ్యాపారం అభివృధ్ధిలోకి వస్తుంది. పెట్టుబడులు లాభించగలవు. కాకపోతే కొత్త పెట్టుబడులకు సమయం పడుతుంది. ఉపాధ్యాయులకు మంచి అవకాశాలున్నాయి. కార్యాలయంలో కొంత విముఖత ఏర్పడగలదు. హనుమాన్ చాలీసా చదవండి.

మకర రాశి: రక్త హీనత వలన ఇబ్బందులు ఉండగలవు. జీవితభాగస్వామి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. స్థిరాస్తి కలసి రాగలదు. వ్యసనములకు దూరంగా ఉండవలసిన వారం. మీ సహచరుల ప్రోత్సాహంతో కొత్త పని ప్రారంభించగలరు. దుర్గా సప్తశ్లోకీ చదవండి.

కుంభ రాశి: ఈ రాశి వారికి ఇది బహు కాలంగా ఆగిపోయి ఉన్న పనులు పూర్తి కాగల వారం. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించగలదు. పెద్దల ఆశీర్వాదం పొందుతారు. కొన్ని విషయాలలో పట్టు విడుపు అవసరం. నూతన సమాచారానుసారం మీ ధోరణి మార్చుకోవలసి ఉండవచ్చు. లక్ష్మీ అష్టోత్తరం చదవండి.

మీన రాశి: భార్యా భర్తల మధ్య కొందరు దూరటం జరగ వచ్చు. జాగ్రత్త వహించవలసి యున్నది. ఉబ్బసం ఉన్న వారు ఆరోగ్యం పట్ల శ్రధ్ధ వహించాలి. ఒక సభలో మాట్లాడ వలసి ఉంటుంది. విద్యార్థులకు , పరిశోధనలు చేయు వారికీ ఇది మంచి వారం.లింగాష్టకం చదవండి.

ఈ వారం మంచి మాట:

శ్లో: ధర్మాదర్థ: ప్రభవతి ధర్మాత్ ప్రభవతే సుఖం
ధర్మేణ లభతే సర్వం ధర్మ (సార ) మూలమిదం జగత్

(శ్రీమద్ వాల్మీకి రామాయణం

అరణ్య కాండ )

ధర్మపాలనమున అర్థకామప్రాప్తి కలుగును. ధర్మము సర్వ సుఖ మూలము.ధర్మమునకు అప్రాప్యమేదియు లేదు. ఈ జగత్తంతయును ధర్మసారభూతము.

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి: శాంతి:
~~~***~~~

The English version is available at www.sripati.com

Vedantam Sripatisarma

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “4-10 అక్టోబర్ 2009 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: