‘ డెఫినిట్లీ, మే బి’ చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు


ఒక పాత్రకు చూపిస్తున్న వృత్తి, ప్రవృత్తి ఒక్కో సారి చిత్రం లోని కథకు చాలా ఉపయోగ పడగలవు. రాజకీయ రణరంగంలో ప్రచార మాధ్యమంలో ఒక నాయకుని గెలుపు కోసం పని చేస్తున్న వ్యక్తి ఈ చిత్రంలో కథా నాయకుడు. ఇప్పటికే ఈ పాత్ర ఎంత పరుగులు తీస్తుంది అనేది స్పష్టమవుతుంది. ఎన్నికల నేపథ్యం. ఇతను విడాకుల వ్యవహారంలో ఉన్నాడు. కూతురును వారానికి రెండు సార్లు కలుసుకోగలుగుతాడు. ఆ పిల్లకు కొత్తగా స్కూలు లో శృంగార ప్రక్రియల మీద క్లాసులు ప్రారంభమైనాయి. తండ్రిని అతని చరిత్ర గురించి

అడుగుతుంది. ఈ సినిమా మొత్తం అతను చెప్పటం, మధ్యలో పిల్ల ఆపటం ఇలా సాగిపోతుంది. చివరకు తిరిగి ఏప్రిల్-అతని భార్య వద్దకు ఆ పిల్ల తీసుకుని వెళుతుంది.
ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు బాగుంటాయి. తండ్రి చెబుతున్న స్త్రీ పాత్రల నుంచి తన నిజమైన తల్లి ఎవరు అని ఆలోచిస్తున్న పిల్ల తండ్రి తనను తల మీద నుంచి చెంపల మీదుగా జుట్టును నిమిరే ఆమెను తల్లిగా గుర్తించటం ఆకట్టుకుంటుంది.
బిల్ క్లింటన్ అనుచరులతో జాగింగు చేస్తుండగా ఇతను ‘ నేను మీ గెలుపు కోసం కృషి చేశాను ‘ అని చెబుతుండగా వాళ్లు మామూలుగా వాళ్ల దారిన వాళ్లు వెళ్లిపోవటం…ఇలాంటివి దర్శకుడు జాగ్రత్తగా చిత్రీకరించాడు.
ఈ చిత్రాన్ని విమర్శకులు ఒమాంటిక్ కామెడీ అని వర్ణించారు. కాకపోతే గంభీరమైన అంశాలు ముందుకు వచ్చాయి. ముఖ్యంగా రాజకీయాలు, సార్వజనిక జీవితాలు-ఇవన్నీ చివరకు కేవలం శారీరిక పరమైన కామవాంఛలే అని తేల్చినట్లు కనిపిస్తాయి. జారిపోతున్న విలువలు, దిగజారిన భాషా ప్రవృతులు ముందుకు వచ్చాయి. ఒక ప్రాచుర్యం పొందిన రచయిత కూడా ఈ ప్రక్రియలో భాగమేనని కనిపిస్తుంది. అమ్మాయి శృంగారం గురించి తెలుసుకునే తరుణంలో తండ్రి చరిత్రలోని ముగ్గురు అమ్మాయిల గురించి తెలుసుకుని ఇంకా మిగిలి ఉన్న ఆమె వద్దకు తీసుకుని వెళ్లటం ఒక వైపరీత్యం గల కథనం. చక్కని కుటుంబ జీవితాన్ని మించిన సుఖం, చదువు, విఙ్ఞానం ఎక్కడా లేవన్నది ఈ పిల్ల చెప్పకనే చెబుతున్నది. నాకు జరిగిన అతి విలువైన సంఘటన నువ్వేనని అతను తన కూతురుకు చెబుతాడు…
నోబెల్ లారియట్ విలియం గోల్డింగ్ గారి నవల ‘ ద పేపర్ మెన్ ‘ ఒక సారి గుర్తుకు వచ్చింది.
ఈ చిత్రం చాలా వేగంగా జరుగుతుంది. నేపథ్య సంగీతం ఆహ్లాదకరంగా ఉంటుంది. సంవాదాలు తమాషాగా ఉంటాయి.
2008 లో వచ్చిన ఈ చిత్రం దర్శకులు ఆడం బ్రూక్స్. ఇందులో రియాన్ రినోల్డ్స్, ఇస్లా ఫిషర్, రాచెల్ వీష్, ఎలిసబెత్ బేంక్స్, అబిగైల్ బ్రెస్లిన్ నటించారు.
మన వ్యవహారాల మీద మనం ఒక సారి నవ్వుకుంటూనే మన అస్తిత్వాన్నీ, జీవితం లోని విలువలని గుర్తు చేసుకునే సందర్భం ‘ డెఫినిట్లీ, మే బి’ చిత్రం సృష్టిస్తుంది.
~~~***~~~

Vedantam Sripatisarma

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “‘ డెఫినిట్లీ, మే బి’ చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: