‘ ఈనాడు’ చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు


ఎ వెడ్నెస్డే అనే హిందీ చిత్రం రిమేక్ ఇది. చక్రి తోలేటి దర్శకత్వం వహించారు. కమల్, వెంకటేష్ నటించారు. సంగీతం శృతి హాసన్ సమకూర్చారు (తెలుగు చిత్రం లో అయితే పాటలేవీ లేవు. నేపథ్య సంగీతం అని సరిపెట్టుకోవాలి).
~~~***~~~
ఎందరో అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న తీవ్రవాదులను పట్టుకున్నా వారిని ఏమీ చేయకుండా సంవత్సరాల తరబడి న్యాయ విచారణ
పేరుతో అలా ఊరుకొని చివరకు వదిలేయటం కూడా జరుగుతున్న వ్యవస్థ మీద ఒక సామాన్యుడు-కామన్ మేన్ (కమల్) బాంబులు పెట్టాడని ఎస్. పి (వెంకటేష్ ) ను నమ్మించి తీవ్రవాదులను విడుదల చేయించి ఒక జీపులోకెక్కించి అక్కడ మొబయిల్ ఫోనులో ఉంచిన బాంబుతో హత మారుస్తాడు. ఒకడిని ఇన్స్పెక్టర్ షూట్ చేస్తాడు. ఇది కథ. కథలోని ఇతివృత్తం అందరినీ ఆలోచింపచేసేదే…కాకపోతే ఎక్కడా పోరాటం అనేది కనిపించదు. ఎస్.పి చేస్తున్న ప్రయత్నం యావత్తూ చాలా కంట్రైవ్డ్ గా కనిపిస్తుంది. పోరాటం అనేది కమల్ పాత్రకు చెందవలసినది. దానిని ఇటు తిప్పటం వలన చిత్రంలో ప్రాణం తేలిపోయింది. దర్శకుని తొలి చిత్రం ఎక్కడా ఆగకుండా సాగిపోయింది. సీనులు అలా గిర గిర తిరిగిపోయాయి…సాంకేతికంగా సరిపోవచ్చు. కథనం ఎంచుకున్న లైనుకి సరిపోతుంది. లైనే మార్చి ఉంటే మరోలా ఉండేది. పోలీసు వ్యవస్థను దగ్గరగా చూపించినా కొన్ని లోపాలు తలెత్తాయి. లకడీ కా పుల్ ఇన్స్పెక్టర్ ఒక ఎస్. పి దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడి వెళ్లిపోతున్నప్పుడు మామూలు దుస్తులున్నప్పటికీ ఒక నీచమైన సెల్యూట్ కొడతాడు. ఎస్.పి దుస్తులలో ఉన్న నక్షత్రాలను పట్టించుకోలేదు. రాజ్ భవన్ దగ్గర ఒక కొత్త కట్టడం మీద అందరికంటే పైన ఉన్న కమల్ ను వెతకటానికి ఆరిఫ్ వెళతాడు. సామాన్యంగా ఇటువంటప్పుడు స్నిఫ్ఫర్ డాగ్ తో వెళ్లటం పధ్ధతి. ఒక్కడూ అలా కొన్ని మెట్లు ఎక్కి ఇక్కడ ఎవరూ లేరని ఫోనులో చెబుతాడు…
~~~***~~~

రియలిసం కోసం పడే తపనకీ, కథలోని కొత్త కోసం నడుపుతున్న వేటకీ మధ్య సరైన సృజనాత్మకతను ఎక్కడో పారేసుకుంటున్నారు మన చిత్ర సీమలోని వారు. మామూలు మనిషి భావాలను ఎంచుకోవటం మంచిదే. చిత్ర రూపం దాల్చాలన్నప్పుడు వృత్తం, పూర్తి ప్రక్రియ, దృశ్యాల సమాహారం ఇటువంటివి శ్రధ్ధతో పరీక్షించవలసిన అవసరం ఉన్నది. సాంకేతికంగా ఎన్నో మన ముందు ఉన్న కాలం ఇది. భావ వైశాల్యం లోపించిన కాలం కూడా ఇదే!
రియలిసం లోకి వెళ్లిన చాలా చిత్రాలలో డీప్ ఫోకస్ ఎడిటింగ్ కీ ( ఒక సీక్వెన్స్ లో తక్కువ ఎడిటింగ్ ) క్లోస్ అప్ ఎడిటింగుకీ మధ్య సరైన బేలెన్స్ కుదరకపోవటం తెలిసిపోతుంది.
డీప్ ఫోకస్ ఎడిటింగులోనే చాలా చిత్రాలలో కొన్ని ప్రక్రియలు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకి ఒక సంవాదం జరిగిన తరువాత నటుడు కొద్ది సేపు వ్యక్తిగతంగా ఆలోచించే సన్నివేశాలు ప్రేక్షకుడిని కూడా ఆలోచింపచేస్తాయి. అంత సమయం కేటాయించకపోవటం వలన ఆ అవకాశం లేకపోయింది.
ద డే ఆఫ్ ద జాకాల్ చిత్రంలో ప్రెసిడెంటుని హత్య చేసేందుకు అతను నియమింప బడతాడు. అతను చేసుకుంటున్న ఏర్పాట్లు ఎంతో ఆకట్టుకుంటాయి. అతను ఒక ప్రొఫెషనల్ కిల్లర్ అయినప్పటికీ చివరకు ప్రయత్నం యావత్తూ విఫలమైనప్పుడు సానుభూతి కలుగుతుంది. కారణం ఏమిటంటే అతని తెలివితేటలతో ప్రేక్షకుడు ఏకీభవిస్తాడు. ఇలా చేయవచ్చు అని అతనూ ఆలోచిస్తాడు. ‘ఈనాడు ‘ చిత్రం లో గొప్ప అవకాశం ఏమిటంటే కామన్ మేన్! ఇతను ఆ వ్యూహం రచించటానికి పడిన కష్టాలు, దానికి అతనికి జరిగిన దుర్ఘటన ఇస్తున్న పుష్, చిన్న ఫ్లేష్ బేక్…ఇలాంటివి చెబుతూ పోలీసు వ్యవస్థ మామూలుగా చేసుకుంటున్న ప్రయత్నాన్ని మధ్యలో ఇంట్రొడ్యూస్ చేస్తే కమల్ మరో చరిత్ర సృష్టించే వాడు!
ఒక లేప్ టాప్ పెట్టుకుని ఏవో వైరులు తగిలించి మాట్లాడుతుంటే చూసే వారికి పాత్రతో ‘ఏకీభవించటం ‘ కష్టం.
~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

3 thoughts on “‘ ఈనాడు’ చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు

  1. A Wednesday చిత్రం అమితాబ్ తిరస్కరించిన తర్వాత నసీరుద్దీన్ షా చేశారు. సామాన్య ప్రేక్షకుడు అమితాబ్ నుంచి ఆశించే మసాలాలు తొలగించి లోబడ్జెట్ లో తీశారు. నసీరుద్దీన్ షా కు ఇమేజ్ ప్రాబ్లం లేదు కనుక, ఫైట్లు, భారీ డైలాగులు లేకపోయినా, అనుపమఖేర్, జిమ్మీ షెర్ గిల్ మినహాయించి చెప్పుకోదగ్గ ఆర్టిస్టులు లేకపోయినా స్క్రీన్ ప్లే లోని పటుత్వం ఆ సినిమాని నిలబెట్టింది. ముఖ్యంగా రోజూ తనతో పాటు లోకల్ ట్రైన్ లో ప్రయాణించే పరిచయమున్న ముఖాలు శవాలుగా మారటం జీర్ణించుకోలేని ఓ సామాన్య మానవుడు అందుకు కారకులైన వారిపై ప్రతీకారం తీర్చుకోవడమనే లాజిక్ బాగా పండింది. దాని ముందు ఓ కామన్ మేన్ ఒక్కడే ఇంత ప్లాన్ పకడ్బందీగా వేసి ఎలా విజయం సాధించగలడు అనే సంశయం తేలిపోయింది. Terrorist attacks జరిగినపుడు సామాన్యుడిలోని ఆవేశం, ఆక్రందన, దీనికి ప్రతీకారంగా తానేమీ చేయలేనా అన్న ఆలోచనకు హీరో చక్కని ప్రతిరూపంగా
    ప్రేక్షకుడు ఫీలయ్యాడు. ఈనాడు సినిమాలో మిస్సయ్యింది అదే. గోకుల్ చాట్, లుంబినీ పార్క్ ల్లో చనిపోయినవారితో హీరోకు ఏ చిన్న పరిచయం ఉన్నట్లు చూపించినా, కనీసం ఆ షాట్స్ చూపించినా ఎంతో కొంత emotional support దొరికుండేది. కమల్ హాసన్, వెంకటేష్ కాంబినేషన్ కూడాhigh expectations కు కారణం అయ్యింది. ఆఫీసులో ఉండి ఆర్డర్సిచ్చే క్యారక్టర్ కు వెంకటేష్ ను తీసుకోవాల్సిన పనిలేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: