30 ఆగస్ట్ నుండి 5 సెప్టెంబర్ వరకు రాశిఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక:
నిరంతరం మంగళమాతనోతు

ఈ వారం గ్రహస్థితి: రవి శనులు సింహం, బుధుడు కన్య, గురు రాహువులు మకరం, కుజుడు మిథునం, శుక్ర కేతువులు కర్కాటకం, చంద్రుడు ధను, మకర, కుంభ రాశులు సంచరిస్తారు.

కర్కాటకం నుంచి మకర రాశి వరకు ఉన్న రాశులలో జన్మించిన వారికి సంఘటనల పరంపర కొనసాగే వారం. కుంభ రాశి నుంచి మిథున రాశి వరకు ఉన్న ఆరు రాశులవారు జీవితాన్ని ఒక ప్రదర్శనగా చూస్తూ గడిపే వారం. ఈ వారం కొన్ని మంచి యోగాలను సూచిస్తున్నది. అతి తెలివి, తొందరపాటు, వారికే అన్నీ తెలుసు అనుకుని మాట్లాడే వారికి ఈ వారం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనవలసి ఉంటుంది.

మేష రాశి: మనసు రకరకాల ఆలోచనలనుంచి బయట పడుతుంది. శాశ్వతమైనవి, నశ్వరమైనవి విడదీసి భావించవలసిన వారం. విశ్రాంతి అవసరం. స్త్రీలకు అన్నింటా మంచి వారం. విష్ణు సహస్రనామం చదవండి.

వృషభ రాశి: గుండె జబ్బులున్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు మానుకోవటం మంచిది. నూతన విద్యాభ్యాసం చేయాలనుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడగలవు. కొంత శ్రమ తరువాత ఆదాయం బాగుంటుంది.హనుమాన్ చాలీసా చదవండి.

మిథున రాశి: చికాకుల నుండి బయట పడతారు. కొంత విరక్తి అనుభవిస్తారు. వ్యాపారం బాగుంటుంది. ఒక సంధిగ్ధావస్థలో సలహా పొందుతారు. దుర్గా సప్తశ్లోకీ చదవండి.

కర్కాటక రాశి: మీ ఉత్తమమైన వ్యక్తిత్వం గుర్తింపు పొందుతుంది. ధైర్యంగా కొన్ని పనులు చేయటం వలన జీవితం సజావుగా ముందుకు సాగుతుందని తెలుసుకుంటారు. కొందరికి నోరు విప్పి చెప్పవలసింది చెప్పండి. అన్నింటా ఇది మంచి వారం. సుబ్రహ్మణ్య కవచం చదవండి.

సింహ రాశి: అనుకోని సంఘటనలు ఎదురు కాగలవు. అవి మీ మంచికేనని గ్రహించండి. మీ నేర్పు అందరినీ ఆకట్టుకుంటుంది. ఆదాయం బాగుంది. దూరాలోచనలు చేయవలసిన కాలం. ఆదిత్య హృదయం చదవండి.

కన్య రాశి: మీలోని కార్యదక్షత మరింత పెరుగుదల పొందే వారం. మీ పరిశ్రమను ఓర్వలేని వారున్నారు. జీవితాన్ని పలు మార్లు కళాత్మకంగా జీవించాలనుకోవటం మీ నైజం. కాకపోతే నిజ జీవితంలో ఆ ఒరవడినుంచి లాభం పొందే వారుండగలరు. ఎవరితో ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరించండి. భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. మహాసౌరం చదవండి.

తుల రాశి: ఇది మంచి వారమే కానీ ఒక సందేహం వెంటాడగలదు. కొద్ది కాలం నిర్ణయాన్ని ఆపండి. మబ్బులు విడిపోగలవు. వారాంతంలో శుభ వార్త వింటారు. శ్రీసూక్తం చదవండి.

వృశ్చిక రాశి: ఆదాయం, పెట్టుబడుల విషయంలో మంచి వారం. మార్కెట్ లో గతంలో నష్టపోయిన వారు ఈ వారం కొద్దిగా పుంజుకుంటారు. ఇంటిలో పోటీలు, పోట్లాటలు వచ్చి వెళ్లిపోతాయి. లలితా సహస్రనామం చదవండి.

ధను రాశి: మంచి ఫలితాలున్న వారం. కర్మ నిష్ఠకు, మానవ సంబంధాలకు గల వ్యత్యాసాన్ని గమనించగలిగిన వారికి మంచి వారం. అన్నిటినీ కలబోసి ముందుకు వెళ్లే వారికి సమస్యలు ఎదురు కాగలవు. శ్రీ దత్తస్తవం చదవండి.

మకర రాశి: అనవసరమైన బాధ్యతల నుండి విముక్తి లభించే కాలం దగ్గరలోనే ఉంది. ఈ వారం కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఒక విందులో పాల్గొంటారు.పాత మిత్రులను కలుసుకుంటారు.స్త్రీల పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. శ్రీసూక్తం చదవండి.

కుంభ రాశి: కావాలనుకున్న వ్యక్తుల నుండి సమస్యలు, వద్దనుకున్న వారి దగ్గరనుండి అనుకోని లాభాలు ఈ వారం వింతగా గోచరిస్తున్నాయి.ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.వారాంతంలో ప్రయాణం ఉండవచ్చు.శివునికి అభిషేకం చేయించండి.

మీన రాశి: బంధువులతో జాగ్రత్తగా ఉండవలసిన వారం.ఆదాయం బాగుంటుంది. ఒక దీర్ఘకాలీన వ్యవహారంలో సంధి ఏర్పడగలదు.పలువురి ప్రశంసలు అందుకుంటారు. నూతన వస్త్రాలు కొంటారు. సుబ్రహ్మణ్య కవచం చదవండి.

ఈ వారం మంచి మాట:

‘ యం ప్రాప్య న నివర్తంతే తత్ ధామ పరమం మమ ‘

(శ్రీమద్భగవద్గీత)

దేనిని పొంది తిరిగి రావలసిన పని లేదో అదే పరమధామము, అదే పరమాత్మ.

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~

The English version is available at www.sripati.com

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “30 ఆగస్ట్ నుండి 5 సెప్టెంబర్ వరకు రాశిఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: