23-29 ఆగస్ట్ 09 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
సమస్తకళ్యాగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక:
నిరంతరం మంగళమాతనోతు

ఈ వారం గ్రహస్థితి: రవి శనులు సింహం, బుధుడు కన్య, గురు రాహువులు మకరం, కుజుడు మిథునం, శుక్ర కేతువులు కర్కాటకం, చంద్రుడు కన్య, తుల, వృశ్చిక రాశులు సంచరిస్తారు.

ఈ గ్రహస్థితి సమాజంలో అనుకోని ఘర్షణలను సూచిస్తోంది. పెద్దలను అగౌరవ పరచటం వలన కొన్ని సమస్యలు ఉండవచ్చు. స్త్రీలు ఆరోగ్యం జాగ్రత్తగా చూస్కోవలసిన వారం.

మేష రాశి: బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులనుండి బయట పడతారు. బంధువుల ఆరోగ్య పరిస్థితి కలవరపెడుతుంది. విష్ణు సహస్రనామం చదవండి.

వృషభ రాశి: వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. సకాలంలో డబ్బు, ఆలోచనలు కలసి వస్తాయి. స్నేహితుల నుంచి మంచి సలహాలను పొందగలరు. శ్రీసూక్తం చదవండి.

మిథున రాశి: రక్తపు పోటు ఉన్న వారు జాగ్రత్త వహించాలి. ఒక ప్రయాణం ఉండవచ్చు. ఏదైనా లకీ డ్రాలో ఉన్న వారు లాభం పొందగలరు. హనుమాన్ చాలీసా చదవండి.

కర్కాటక రాశి: స్త్రీల విషయంలో జాగ్రత్తగా మసలుకోవాలి. పెట్టుబడులు ఆలోచించి చేయవలసిన వారం. ఉద్యోగస్తులకు మంచి వారం. కుడి కన్ను విషయంలో సమస్య ఉండవచ్చు. దుర్గా సప్తశ్లోకీ చదవండి.

సింహ రాశి: జరగబోయేవి తెలుస్తున్నట్లు అనిపించగలదు. ఈ వారం మంచి ఆదాయం ఉంది. దూరపు బంధువు విషయంలో ఒక సమస్య తలెత్తగలదు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆదిత్య హృదయం చదవండి.

కన్య రాశి: ఉద్యోగంలో మార్పు సంభవం. ఈ వారం చాలా నేర్పుతో వ్యవహరించాలి. శ్రమ తప్పదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ పై అధికారులు వాదోపవాదాలకు దిగగలరు. శివాలయం దర్శించుకోండి.

తుల రాశి: ద్వంద్వ నీతుల వలన సమస్యలుండవచ్చు. అనుకోని సంఘటన ఒకటి జరుగగలదు. రాజకీయాలలోని వారు సంయమనం పాటించాలి. విష్ణు సహస్రనామం చదవండి.

వృశ్చిక రాశి: ఈ వారం మీ ముందుకు కొన్ని సమస్యలు రానున్నాయి. ఎంతో ఓర్పు, నేర్పుతో వ్యవహరిస్తారు. బాధ్యతలు వద్దన్నా పెరగనున్నాయి. వాహనం నడుపు వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సుబ్రహ్మణ్య కవచం చదవండి.

ధను రాశి: కార్యాలయంలో హోదా పెరగగలదు. మీ అధికారికి బదిలీ ఉండవచ్చు. విద్యార్థులకు మంచి అవకాశాలున్నాయి. జీవిత భాగస్వామితో చిరాకులు, పరాకులు సంభవం. మౌనం వహించండి. శ్రీ దత్త స్తవం చదవండి.

మకర రాశి: ఒక అహంకార ధోరణిలో మాట్లాడటం ఈ వారం అంత మంచిది కాదు. కొందరు మిమ్మల్ని విస్మరించే అవకాశం ఉండవచ్చు. డబ్బు అందగలదు. లలితా సహస్రనామం చదవండి.

కుంభ రాశి: విదేశ వ్యవహారాలు బాగున్నాయి. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఋణ ప్రయత్నాలు లాభిస్తాయి. కళా జగత్తులోని వారికి మంచి అవకాశాలున్నాయి. లక్ష్మీ అష్టోత్తరం చదవండి.

మీన రాశి: పిల్లల ఆరోగ్యం జాగ్రత్తగా చూస్కోవాలి. మీ మాటకారితనం వలన ఒకరి సమస్య పరిష్కారమవుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలున్న వారం. ఇష్ట దైవాన్ని కొలవండి.

ఈ వారం మంచి మాట:
శ్లో: నితాంతకాంత దంతకాంతిమంతకాంతకాత్మజం
అచింత్యరూపమంతహీన మంతరాయకృంతనం
హృదస్తరే నిరంతరం వసంతమేవ యోగినాం
తమేకదంతమేవ తం విచింతయామి సంతతం

(ఆదిశంకరాచార్య కృత గణేశ పంచరత్నం లోని శ్లోకం)
మిక్కిలి కమనీయమైన దంతకాంతి గలవాడు, కాలకాలుడు (యమునకు గూడ, యముడు) అయిన శివుని పుత్రుడు, అచింత్యరూపుడు (రూపరహితుడు), అంతమనునది లేని వాడు,ని: శ్రేయసమునకు భంగము కలిగించు విఘ్నములకు నాశమొందించువాడు (మోక్షప్రదాత), యోగుల హృదయాంతరమున నిరంతరము నివసించువాడు అగు ఆ ఏకదంతునే, సతతము, చక్కగా చింతనము (మననము, ధ్యానము) చేయుదును.

‘తస్యోదరాత్సముత్పన్నం నానా విశ్వం న సంశయ: ‘
నానా నామరూపాత్మకమైన సమస్త ప్రపంచము పరమేశ్వరుని (గణపతి) ఉదరము నుండియే ఉత్పన్నమైనది…

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~

The English version is available at
www.sripati.com

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

4 thoughts on “23-29 ఆగస్ట్ 09 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: