‘ దో బీఘా జమీన్ ‘ చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు


నియో రియలిసం అనే ఒక ప్రక్రియ చలన చిత్రాలల విషయంలో వింటూ ఉంటాం. దీని గురించి అంతర్జాతీయంగా చర్చించినప్పుడు ఎక్కువగా ఇటలీ గురించి కూడా వింటూ ఉంటాం. మన దేశం గురించి మాట్లాడినప్పుడు బిమల్ రాయి 1953 లో తీసిన ‘ దో బీఘా జమీన్ ‘ గురించి చెప్పకుండా ఉండలేము. ఈ చిత్రానికి ఎన్నో కీర్తి కిరీటాలున్నాయి. వాటి గురించి తరువాత చెప్పుకోవచ్చు. తెర తీద్దాం…
~~~***~~~
భూమిని తాకట్టు పెట్టిన చిన్న రైతు శంభు (బల్రాజ్ సాహ్ని ). జమీందారు దగ్గరకు వచ్చి ఒక పారిశ్రామిక వేత్త ఆ భూమిని ఎంచుకుని ఫాక్టరీ కడతానని చెబుతాడు. ఆ భూమిని ఇపించేందుకు శంభూని కోర్టుకి ఈడ్చి మూడు నెలలలో డబ్బు కట్టకపోతే భూమి వేలం అవుతుందని తేలుస్తాడు జమీందారు. డబ్బు సంపాదించేందుకు కోల్కటాలో శంభు, తన పిల్లవాడితో పడు కష్టాలు చిత్రం యావత్తూ కమ్ముకుంటాయి.
చివరకు శంభు ఆ భూమిని వదులుకోవాల్సి వస్తుంది. ఇదేమి సినిమా? నిజమే!
జాగ్రత్తగా ఆలోచిస్తే దర్శకుడు చూపించదలచుకుంది చాలా గొప్ప విషయం. భూమిని వదలను అని ఒక రైతు చెప్పి దేనికైనా సిధ్ధ పడటం. రెండు-అతని కుటుంబం ఇందులో అతని వెంటే నిలబడటం. మూడు, ఉన్న వాళ్ల ప్రపంచం ఎంత పీడించినా లేని వారి జగత్తు అతన్ని కలుపుకుని అడుగడుగునా సహాయం చేయటం. ఈ లేనివారి ప్రపంచం చూపించినప్పుడు అందులోని క్రౌర్యం కూడా బాధాకరంగా ముందుకొస్తుంది. కానీ అందులోనే మానవతా విలువలు కనిపిస్తూ ఉంటాయి. చివరకు ఒక కుటుంబం భూమిని వదులుకున్నా కుటుంబం గానే ప్రక్కగా వెళ్లిపోతుంది.
శంభు తండ్రి ‘ భూమి పోతే ఏమయింది? ఈ ప్రపంచం అంతా మన భూమే, ఆకాశమంతా మన ఇంటి పైకప్పే ‘ అని చాటుతాడు. కుటుంబం లోని బంధాలు అంత గొప్పవి. అది తెలిసిన వారికే ‘ వసుధైవ కుటుంబకం ‘ అనేది అర్థమవుతుంది.
~~~***~~~
చిత్రం వెనుక చిత్రీకరణలోని ఒక మర్మం దాగి ఉంది. ప్రారంభంలో ఒక కరవు పరిస్థితి, వెంటనే ఒక వాన జల్లు, జనంలో ఉత్సాహం, ఆ తరువాత శంభు సమస్య…ఇది సరళి. భూమి నాకేమిచ్చింది అని రైతు అడగడు. భూమి తల్లి. మనలను కని మోసే తల్లి. మనం భూమికి ఏమిచ్చామనేది అందరం వేసుకోవలసిన ప్రశ్న. అన్ని పోరాటాలూ భూమి కోసమే, రాజ్యం కోసమే! ఇందులో పోరాడిన ప్రతివాడూ గెలుస్తాడు. పోరాటమే గెలుపు!
కొన్ని దృశ్యాలు కదిలిస్తాయి. బల్రాజ్ సాహ్నీ తోపుడు బండీని గుర్రం బండీతో సమానంగా వేగం చేయమని ఆసామి పోరటంతో పరుగులు తీసి పడిపోతాడు. విషయానికి అద్దం పట్టే ఘటనతో కథనాన్ని ముందుకు తోసుకుపోయినప్పుడు చరిత్ర లేచి నిలబడుతుంది, దటీస్ ప్రెసెంటేషన్!
డబ్బులు లేనప్పుడు తండ్రి కడుపులో బాలేదు అని తినాం మానెస్తాడు. చిన్న పిల్లవాడు కూడా బయటకు తినటానికి వెళ్లినట్లే వెళ్లి నాకూ కడుపులో బాలేదని ఊరుకుంటాడు…
శంభు భార్య (నిరుపా రాయి ) భర్తకు ఉత్తరం వ్రాయిస్తున్న దృశ్యం ఎంతో సున్నితంగా చిత్రీకరించాడు దర్శకుడు.
ఈటలీ చిత్రం ‘ ద బైసకల్ థీఫ్ ‘ లోని తండ్రీ కొడుకుల ఉదంతం బట్టి ప్రభావితమయినట్లు బిమల్ రాయి చెప్పి యున్నాడు.
ప్రస్తుతం మన దేశం తన జి. డి. పీలో వ్యవసాయ రంగం ప్రాముఖ్యత తగ్గించుకుంటూ పోయి ఇతర రంగాలలోకి దూకేసింది.ఒక సారి ఈ చిత్రం చూసి ఆలొచించవలసిన అవసరం ఉందనిపించింది. ఆర్థిక విధానాల సంగతి ప్రక్కన పెడితే కనీసం భూమి పట్ల మనం చేస్తున్న అమానుషం, కాలుష్యం, దిగజారిన కుటుంబ వ్యవస్థలు, మరుగున పడ్డ విలువలు…ఇవన్నీ కరవులో భాగాలు అని బాధ పడవలసి వస్తుంది…
~~~***~~~

‘ దో బీఘా జమీన్ ‘ ఫిల్మ్ ఫేర్ పురస్కారాలను ప్రవేశపెట్టినప్పుడు మొట్ట మొదటి ఉత్తమ చిత్రంగా ఎన్నికైన చిత్రం. అలాగే కాన్ అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ఉత్తమ చిత్రంగా ఎన్నికైన తొలి భారతీయ చలన చిత్రం.మరో చరిత్ర ఈ చిత్రానికి ఉంది. ఈ చిత్రాన్ని తను తీయలేకపోయినందుకు రాజ్ కపూర్ బాధ పడ్డాడుట!

ఈ చిత్రానికి సంగీతం అందించిన వారు సలిల్ చౌధరీ. పాల్ మహేంద్ర సంవాదాలు వ్రాశారు. హృశీకేష్ ముఖర్జీ దృశ్యాలను వ్రాసి కూర్పు చేశారు. కమల్ బోస్ అద్భుతమైన ఛాయాగ్రహణం చేశారు.
అందరూ మహానుభావులే! వీరు కలసినప్పుడు ఈ చిత్రం లోని ఒక పాట తిరిగి చెప్పుకోవాల్సి ఉంటుంది-‘ ధర్తీ కహే పుకార్ కే, అప్ని కహానీ ఛోడ్ జా, అప్ని నిశానీ ఛోడ్ జా…’
ప్రతి కష్టానికీ ఒక కథ, ఒక గుర్తింపు అలా మిగిలిపోతుంది.
మన భూమి, మన ప్రజల లోతులలోకి ఒక్క సారి వెళ్లండి అని మన కళా జగత్తు మన దర్శకుల వైపు తిరిగి ఈ రోజు కేక పెడుతోంది…ధర్తీ కహే పుకార్ కే!
~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

3 thoughts on “‘ దో బీఘా జమీన్ ‘ చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు

 1. “బల్రాజ్ సాహ్నీ తోపుడు బండీని గుర్రం బండీతో సమానంగా వేగం చేయమని ఆసామి పోరటంతో పరుగులు తీసి పడిపోతాడు. విషయానికి అద్దం పట్టే ఘటనతో కథనాన్ని ముందుకు తోసుకుపోయినప్పుడు చరిత్ర లేచి నిలబడుతుంది, దటీస్ ప్రెసెంటేషన్!”

  One of my friend told me about this scene long back but I have never watched this movie, though I wanted to.

  ~sUryuDu

 2. The movie review is very good. Sentence which caught my attention and impressed me most is
  “Poratame gelupu”. The need of the hour is fighting spirit that never gives up. This spirit is aptly reflected in the movie and the review is at right time.

  Appreciate your time and effort on other social responsibility issues like guidance on Swine Flu

  Venkat

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s