9-15 ఆగస్ట్ 09 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక:
నిరంతరం మంగళమాతనోతు

ఈ వారం గ్రహస్థితి: రవి కేతువులు కర్కాటకం, శని బుధులు సింహం, గురు రాహువులు మకరం, కుజుడు వృషభం, శుక్రుడు మిథునం, చంద్రుడు కుంభ, మీన, మేష, వృషభ రాశులు సంచరిస్తారు.

స్త్రీలు విశేషమైన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉన్న వారం ఇది. ముఖ్యంగా ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. బాధ్యతల నుంచి తప్పుకోవాలని పలువురు యోచించగలరు. కొన్ని సంఘటనలు అర్థం కావు. ఆర్థిక లావాదేవీలు తొలుత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ నిదానంగా బాగుపడగలవు.ఏ పనిలోనూ ఈ వారం తొందరపాటు పనికి రాదు.

ఈ బ్లాగులో 2009వ సంవత్సరానికి ఫలితాలనిస్తూ అంటు వ్యాధి ఒకటి ప్రపంచమంతా వ్యాపిస్తుందని చెప్పటం జరిగింది. కాకపోతే ఈ మధ్య ఈ స్వైన్ ఫ్లూ అనునది తీవ్రమైన పరిణామాలను చూపిస్తున్నది. ముఖ్యంగా సింహ రాశిలో శని బుధుల కలయిక, గ్రహస్థితుల వలన ఏర్పడిన కొన్ని అవయోగాల వలన ఇలా ఉన్నది. 17 ఆగస్ట్ రోజున జరుగు రవి యొక్క సింహ సంక్రమణం, 20 ఆగస్ట్కు బుధుడు ఉచ్చ రాశిలోకి ప్రవేశించు సమయానికి ఇది సదు మణగ గలదు.కుంభ రాశి వారు, మిథున రాశి వారూ, సింహ రాశి వారూ జాగ్రత్తలు వహించాలి. ప్రతి రోజూ దుర్గా సూక్తం అందరూ పఠించగలరు.

మేష రాశి: అన్ని విషయాలోనూ ఇది మంచి వారం. అయినా వీలయినంత మౌనం పాటించండి.బంధువుల కలయిక ఉండవచ్చు. ఉద్యోగం  వేటలో ఉన్న వారికి మంచి అవకాశాలున్నాయి. శ్రీసూక్తం చదవండి.

వృషభ రాశి: తల్లి దండ్రుల ఆరోగ్యం పట్ల శ్రధ్ధ వహించాల్సి ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. క్రయ విక్రయాల వారు శుక్రవారం మంచి అవకాశాలు పొందనున్నారు. కోర్టు వ్యవహారం తికమక పెట్టగలదు. సమయం దాటిపోయిన తరువాత ఒక సమాచారాన్ని తెలుసుకుంటారు.    దుర్గా సప్తశ్లోకీ చదవండి.

gem మిథున రాశి: మనసులో వింత ఆలోచనలు బాధ పెడతాయి. వాదానికి దిగాలనుండవచ్చు. జీవితం మార్కులు సంపాదించటం కాదు అని గ్రహించండి. వ్యాపారం అభివృధ్ధిలోకి వస్తుంది. ఒక ప్రయాణం సంభవం. ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి మంచి వారం. మహాసౌరం చదవండి.

కర్కాటక రాశి: సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఒక సన్మానం కూడా ఉండగలదు. ఇంటి వ్యవహారాలలో ఇబ్బందులుండవచ్చు. ఒంటి నొప్పులు బాధించగలవు. ఇతరుల పట్ల మీ బాధ్యతలను విస్మరించకూడదని గ్రహించండి. వ్యయం అధికంగా ఉండవచ్చు. విష్ణు సహస్రనామం చదవండి.

సింహ రాశి: ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆదాయం బాగుంది. బాధ్యతలు పెరగనున్నాయి. పనుల వొత్తిడి విసిగించగలదు. ఒక భాగస్వామ్యం విషయం ముందుకు రాగలదు. చర్చ అవసరం. పిల్లల నడవడిని గమనించాలి. అధికారుల మెప్పు పొందగలరు. మహాసౌరం చదవండి.

కన్య రాశి: దైవ చింతన వలన ఎన్నో విషయాలలో మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ మంచి ఫలితాలను పొందుతారు. కొందరికి మీ వ్యవహారం అర్థం కావటం లేదు. చింతించకండి. అది వారి సమస్య. కొత్త పనులు చేపడతారు. స్త్రీల పట్ల అప్రమత్తంగా ఉండవలసిన వారం. శివాలయ దర్శనం చేసుకోండి.

తుల రాశి: ఈ వారం మంచి ఫలితాలున్నాయి. కాకపోతే భార్యా భర్తలు వారాంతంలో మూతులు ముడుచుకోవటం జరుగవచ్చు. అక్కడితో సరిపెట్టి మరల నూతన వారం ప్రారంభించటం మంచిది. కొత్త పెట్టుబడులు చేయదలచిన వారికి మంచి ఆలోచనలు కలుగవచ్చు. లక్ష్మీ అష్టోత్తరం చదవండి.

వృశ్చిక రాశి: స్థాన చలనం ఉండవచ్చు. కార్యాలయంలో మీరనుకున్న బదిలీ బదులు మరో బదిలీ ఉండవచ్చు. డబ్బు చేతికి అందుతుంది. ఒక స్త్రీ వలన లాభం పొందుతారు. ఇంటర్వ్యూలకు వెళ్ల వలసిన వారికి మంచి వారం. మిత్రులు సహకరిస్తారు. విందులో పాల్గొంటారు. సుబ్రహ్మణ్య కవచం చదవండి.

ధను రాశి: బంధువులతో విరోధం ఉండగలదు. జాగ్రత్త వహించాలి. ఒక పరిధి దాటిన తరువాత అందరూ విరోధులుగా కనిపించటం మామూలే! చింతించకండి. విద్యార్థులకు మంచి వారం. విదేశాల నుంచి మంచి వార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి వారం. లలితా సహస్రనామం చదవండి.

మకర రాశి: ఒక మిత్రుని ఆరోగ్యం మిమ్మల్ని కలవరపెడుతుంది. తొందరపాటు మాటలను అరికట్టాల్సిన వారం. గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కళా రంగంలోని వారికి అవకాశాలు బాగున్నాయి. వ్యాపారం విస్తీర్ణం చేయాలనుకున్న వారికి మంచి సమయం. ఒకరికి సహాయం చేస్తారు. హనుమాన్ చాలీసా చదవండి.

కుంభ రాశి: ఇంటిలోని పెద్ద వారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కాలేయానికి సంబంధించి ఇదివరకు అనారోగ్యానికి గురి అయిన వారు తగు జాగ్రత్తలు వహించాలి. ఇంటిలో కొన్ని మార్పులు చేస్తారు. వస్తారనుకున్న బంధువులు రాకపోవచ్చు! అధికారులతో కొన్ని విషయాలను చర్చిస్తారు.దుర్గా సూక్తం చదవండి.

మీన రాశి: అనవసరంగా కొంత ఆందోళన పడతారు. దైవ చింతన వైపు ఆలోచనలు సాగుతాయి. మంచిదే! మధ్యలో వదిలేయటం మంచిది కాదు. కొంత ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ఒకరి పట్ల ఒక సమస్య తలెత్తగలదు. కొద్ది రోజులు అలా వదిలేయండి. అదే పరిష్కారమవుతుంది. దుర్గా సప్తశ్లోకీ చదవండి.

ఈ వారం మంచి మాట

శ్లో: ధర్మే స్థితో ధర్మసుతో మహాత్మా
ధర్మశ్చ సూక్ష్మో నిపుణోపలక్ష్య:
వాచాపి భర్తు: పరమాణుమాత్ర
మిఛ్చామి దోషం న గుణాన్ విసృజ్య

(మహాభారతం ద్యూతపర్వం)

ధర్మపుత్రులైన మహాత్మ యుధిష్ఠిరుడు ధర్మంలోనే స్థితమై యుందురు. ధర్మం యొక్క స్వరూపము చాలా సూక్ష్మము. సూక్ష్మ బుధ్ధులు, ధర్మపాలనంలో నిపుణులైన మహాపురుషులకే అది అర్థం కాగలదు. నేను నా పతి యొక్క గుణములను వదిలి పెట్టి ఆయనలో పరమాణు తుల్యమైన చిన్న చిన్న దోషాల గురించి నా వాణిలో చెప్ప దలచుకోలేదు…(ద్రౌపది ధర్మజుని గురించి నిండు సభలో పలికిన విషయం)

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~

The English version is available at http://www.sripati.com

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “9-15 ఆగస్ట్ 09 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: