02-08 ఆగస్ట్ 09 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక:
నిరంతరం మంగళమాతనోతు

ఈ వారం గ్రహస్థితి: రవి కేతువులు కర్కాటకం, శని బుధులు సింహం, గురు రాహువులు మకరం, కుజుడు వృషభం, శుక్రుడు మిథునం, చంద్రుడు ధను, మకర, కుంభ రాశులు సంచరిస్తారు.

ఈ వారం భార్యాభర్తలకు కొన్ని అనుకోని విభేదాలు కనిపిస్తున్నాయి. ధ్యాన మార్గం అవలంబించండి. రాజకీయ రంగం లోని వారికి మంచి వారం. లావాదేవీలు చేయాలనుకున్న వారు కొద్ది కాలం ఆగటం మంచిది. ఆదాయం వ్యయం సమంగా ఉంటాయి. దీర్ఘ రోగాలున్న వారికి ఊరట ఉన్నది. ప్రభుత్వ రంగంలోని వారికి శుభవార్తలు కలవు!

మేష రాశి: ఈ వారం శుభయోగాలతో ప్రారంభం కానున్నది. మంచి పనులు చేస్తారు, మంచి వార్తలు వింటారు. కొందరు మీ దారికి వస్తారు. కొందరు మీ మాట ఒప్పుకుంటారు. నూతన ఉద్యోగం దొరకవచ్చు. శ్రీసూక్తం చదవండి.

వృషభ రాశి: బాధ్యతలను సక్రమంగా నిర్వహించే వారికి మంచి వారం. ఒకరి సహాయం పొందగలరు. అజీర్ణం కొద్దిగా బాధించగలదు. మీడియా రంగంలోని వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి.సుబ్రహ్మణ్య కవచం చదవండి.

మిథున రాశి: కళ్ల విషయంలో శ్రధ్ధ వహించాలి. ఇంకొకరి తాలూకు బిల్లు          మీరు చెల్లించాల్సి రావచ్చు! ఒక ఆస్తి విషయం కలసివచ్చే వారం. వింత ఆలోచనలు కలుగవచ్చు. దుర్గా సప్తశ్లోకీ చదవండి.

కర్కాటక రాశి: బంధువులను సందర్శిస్తారు. ఒక ప్రయాణం ఉండవచ్చు. కొన్ని బాధ్యతలు గుర్తుకు వస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. ఒక క్లిష్టమైన కార్యం చేపట్టవలసిన అవసరం ఉన్నది. శివునికి అభిషేకం చేయించండి.

సింహ రాశి: కొత్త ఆలోచనలు కలసి వస్తాయి. బంధువులు సహకరిస్తారు. ఇంటిలోని పెద్ద వారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాపారంలో మంచి లాభాలుండవచ్చు. ఒక కోర్టు వ్యవహారం ముందుకు వస్తుంది.
మహాసౌరం చదవండి.

కన్య రాశి: ఇంటి సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. విశ్రాంతి లోపిస్తుంది. పై అధికారులు సహకరిస్తారు. మీ ప్రతిభ నిరూపించేందుకు చక్కని అవకాశాలు రాగలవు. వారం మధ్యలో మంచి వార్తలు వింటారు. ఆదాయం బాగుంటుంది. లక్ష్మీ అష్టోత్తరం చదవండి.

తుల రాశి: కొన్ని కార్యాలు సంతృప్తికరంగా నెరవేరినప్పటికీ బంధు వర్గంతో కొన్ని చికాకులు ఉండవచ్చు. జీవిత భాగస్వామితో చర్చలు సరైన విధంగా చేయవలసి యున్నది. అందరూ అన్ని మాటలూ సరిగ్గా అర్థం చేసుకోరు. ఒకరి వ్యవహారం ఆశ్చర్యం కలిగిస్తుంది. విష్ణు సహస్రనామం చదవండి.

వృశ్చిక రాశి: కొంత విలాసవంతమైన జీవితాన్ని గడపటం వలన కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆదాయం బాగుంటుంది. విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. విదేశీ యానానికి అవకాశం రావచ్చు. దుర్గా సప్తశ్లోకీ చదవండి.

ధను రాశి: శత్రువులు తయారవుతున్నారు గమనించాల్సి ఉంది. మార్కెట్ వ్యవహారాలు బాగుంటాయి. డబ్బు అందగలదు. దంపతుల మధ్య విభేదాలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఆటలలో ఉన్న వారికి మంచి ఫలితాలుండవచ్చు. ఆదిత్య హృదయం చదవండి.

మకర రాశి: మీరు మీ మంచి కోరే వారిని అపార్థం చేసుకుంటున్నారు. ఒక వేళ వారిని గమనించాలనుకుంటే మంచిదే. వారికి ఆ విషయం తెలిసిన పక్షంలో నష్టం మీకే! అనుమానాలు ఈ వారం దీర్ఘకాలీన సమస్యలు తీసుకుని రాగలవు. బాధ్యతలు నిర్వర్తించండి. హనుమాన్ చాలీసా చదవండి.

కుంభ రాశి: సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొత్త వారిని కలుసుకుంటారు. వారం ప్రారంభంలో చిన్న ధర్మ సంకటం ఎదురు కావచ్చు. ఒక విషయంలో మీరే ముందడుగు వేయవలసి యుంటుంది. ఆలస్యం మంచిది కాదు. దేవీ సూక్తం చదవండి.

మీన రాశి: గుండె జబ్బులున్న వారు జాగ్రత్త వహించాలి. లోక వ్యవహారంలో తొందరపాటు వలన ఇబ్బందులుండవచ్చు. తలకు మించిన సహాయం మంచిది కాదు. ఒకరిని ఎప్పటి నుంచో కలుసుకోవాలనుకుంటే ఈ వారం తప్పక కలుసుకోండి. లాభం ఉండగలదు. లలితా సహస్రనామం చదవండి.

ఈ వారం మంచి మాట:

శ్లో: పంచరూపాణి రాజానో ధారయంత్యమితౌజస:
అగ్నేరింద్రస్య సోమస్య యమస్య వరుణస్యచ
ఔష్ణ్యం తథా విక్రమం చ సౌమ్యం దండం ప్రసన్నతాం
ధారయంతి మహాత్మానో రాజాన: క్షణదాచర

(వాల్మీకి రామాయణం అరణ్యకాండ )

మహా తేజస్వులైన రాజులు అగ్ని, ఇంద్రుడు, సోముడు, యముడు, వరుణుడు-ఈ అయిదు దేవతల స్వరూపాలను ధరించి ఉంటారు. అందుచేత వారిలో ఈ అయిదు గుణాలు-ప్రతాపం, పరాక్రమం,సౌమ్యభావం, దండనం, ప్రసన్నత ఇమిడి ఉంటాయి.

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~

The English version is available at http://www.sripati.com

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “02-08 ఆగస్ట్ 09 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: