19-25 జులై 09 రాశి ఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక:
నిరంతరం మంగళమాతనోతు

ఈ వారం గ్రహస్థితి: రవి బుధ కేతువులు కర్కాటకం, శని సింహం, రాహువు మకరం, గురువు కుంభం, కుజ శుక్రులు వృషభం, చంద్రుడు వృషభ, మిథున, కర్కాటక, సింహ రాశులు సంచరిస్తారు.

22.07.2009 బుధవారం ఆశాఢ బహుళ అమావాస్య రోజున కేతుగ్రస్త సూర్యగ్రహణం ఉన్నది. ఇది ఉదయం 5.39 ఘడియలకు ప్రారంభమయి 7.20 కి విడుదల అవుతుంది. మధ్య కాలం 6.19 అని గమనించాలి. పునర్వసు, పుష్యమి నక్షత్రాల వారు ప్రత్యేకమైన శాంతులు, కర్కాటక రాశి వారు సామాన్య శాంతులు జరిపించుకోవటం మంచిదని సూచించుట అయినది. మేష, కర్కాటక, ధను, సింహ రాశుల వారు గ్రహణం అనంతరం శివాలయంలో అభిషేకం జరిపించుకొనుట మంచిది. స్త్రీలు, పైన చెప్పిన రాశుల వారు ఈ గ్రహణం చూడటం మంచిది కాదు.
ఈ సూర్య గ్రహణం విషయంలో చాలా అపోహలు వినవస్తున్నాయి. ఒక మాసంలో మూడు గ్రహణాలని, ఇలా ద్వాపర యుగాంతం సమయంలో సంభవించెనని, ఇప్పుడు కూడా యుగాంతం దగ్గరలోనే ఉన్నదని కొందరు ప్రచారం కూడా చేస్తున్నారు. మాసం అనగా రెండు పక్షాలు-ఒక పౌర్ణమి, ఒక అమావాస్య అంతమటుకే! గ్రహణం ఈ రెండు తిథులకే కాబట్టి మన మాసంలో మూడు గ్రహణాలు సంభవించటం హాస్యాస్పదం, అవివేకం. ద్వాపర యుగాంతం ముందు ఇటువంటి విషయాల గురించి ప్రస్తావన లేదు. ఆ పరిస్థితులు, ఆ గ్రహ స్థితులు వేరు. ఏ రకమైన ఆందోళన ఇందులో లేదు. మిత్రులు గమనించవలసినదిగా మనవి.
ఉపాసనాపరులు ఈ సమయంలో గాయ్త్రి జపించటం మామూలు. ఈ గ్రహణం దక్షిణాయనం ప్రారంభంలోనే (17 నుంచి దక్షిణాయనం ప్రారంభమైనది) జరగటం ఒక విధంగా మంచి సందేశం.  ఈ గ్రహణం తరువాత వాతావరణానికి పట్టిన అసలు గ్రహణం తొలగిపోగలదు. మేఘాలు వర్షించగలవు.

కాకపోతే గ్రహాలను బట్టి కొన్ని కాల లక్షణాలను చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈ గ్రహణాన్ని అనుసరించి కొన్ని విషయాలను పేర్కొనవచ్చును. వాయువ్య దేశాలకు, గల్ఫ్ దేశాలకు, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలకు కొన్ని సమస్యలు ఏర్పడవచ్చును. ఈ ప్రాంతాలలో భూమి కంపించవచ్చును. విచ్చలవిడిగా  శృంగారం కోరుకునే వారికి వ్యాధులు, వారి వలన మరి కొన్ని వింత వ్యాధులు ఉండగలవు.
ప్రజలు మహాసౌరం, భూమిసూక్తం చదువుకుంటే ఎటువంటి ఆపద ఉండబోదని మనవి.

మేష రాశి: ఇంటి సమస్యలు పెరిగి పూర్తిగా సమసిపోగలవు. నిదానం,    ఓర్పు అవసరం. ఒక్క రోజులో ప్రపంచం మారదు. మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది. తొందరపాటు ఈ వారం తగదు. విష్ణు సహస్రనామం చదవండి.

వృషభ రాశి: కొత్త పనులు చేపడతారు. ఉత్సాహం పెరుగుతుంది. అవివాహితులకు మంచి వారం. పెద్దల ఆశీర్వాదం పొందుతారు. వారాంతంలో విశ్రాంతి అవసరం. శ్రీసూక్తం చదవండి.

మిథున రాశి: నరాల సమస్యలున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల నుంచి మంచి వార్తలు వింటారు. ఆదాయం బాగుంటుంది. దంతాల విషయంలో వైద్యుని సంప్రదించవచ్చు. ఆదిత్య హృదయం చదవండి.

కర్కాటక రాశి: గ్రహణం సంగతి ప్రక్కన పెడితే ఈ వారం మంచి ఫలితాలుంటాయి. ఉపాసనా మార్గంలో ఉన్న వారు కొత్త విషయాలను తెలుసుకోగలరు. ఒక ఆహ్వానం అందుకుంటారు. పగలు రేయి అని కాకుండా శ్రమించే వారికి చక్కని ఫలితాలున్నాయి. లఘున్యాసం చేయండి.

సింహ రాశి: వారం కొన్ని సమస్యలతో ప్రారంభమైనప్పటికీ వారాంతంలో మంచి వార్తలు వింటారు. పిల్లల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. దూర ప్రయాణాలకు ఏర్పాట్లు చేయగలరు. ఉద్యోగంలో మార్పు ఉండగలదు. సుబ్రహ్మణ్య కవచం చదవండి.

కన్య రాశి: శత్రువులు మిత్రులు కాగలరు. నలుగురిలో మీ ప్రతిభ ప్రాచుర్యం పొందుతుంది. కొన్ని కొత్త విషయాలను తెలుసుకుంటారు. దూరపు బంధువులు దగ్గరవుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం బాగుంటుంది. దుర్గా సప్తశ్లోకీ చదవండి.

తుల రాశి: బాధ్యతలు పెరగనున్నాయి. స్త్రీలతో విభేదాలు ఉండగలవు. సైనస్ ఉన్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడులు లాభిస్తాయి. మీరు ఇతరులకు ఇచ్చిన సందేశాలను మీరే పాటించలేని పరిస్థితి రాగలదు. సహచరులు సహకరిస్తారు. లలితా సహస్రనామం చదవండి.

వృశ్చిక రాశి: పెద్దల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వివాహం కాని వారికి బంధు వర్గంలోనే వివాహ సంబంధాలు దొరకగలవు. విద్యార్థులకు మంచి వారం. రియల్ ఎస్టేట్ రంగం వారికి మంచి లాభాలుండగలవు. బుధవారం ఏ నిర్ణయం తీసుకోకండి. శనివారం మీ ఇష్టదైవాన్ని సందర్శించుకోండి.

ధను రాశి: ఈ మధ్య మీరు ఖర్చుల వైపు ఎక్కువగా మనసు మళ్లిస్తున్నారు. కొంత ఆపుకోవాలి. అయినప్పటికీ ఒక ఖర్చు చేస్తారు. ఒంటి కణత నెప్పి ఉన్న వారు అధికంగా శ్రమించకూడదు. విదేశాలలో ఉన్న వారికి పరిస్థితులు కొద్దిగా మారగలవు. చింతించకండి. మహాసౌరం పఠించండి.

మకర రాశి: ఓర్పుతో బాధ్యతలు నిర్వర్తించినా కొందరు ఆ మాటా ఈ మాటా అనేస్తారు. వివాదాలలోకి దిగకండి. అన్నదానం చేయండి. వారాంతంలో నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. కార్యాలయంలో కూడా మార్పులు ఉండగలవు. విష్ణు సహస్రనామం చదవండి.

కుంభ రాశి: వ్యసనాలకు దూరంగా ఉండవలసిన వారం. (పై వారం అక్కరలేదని కాదు!) జీవిత భాగస్వామి దగ్గర డబ్బు దాచటం ఉత్తమం. వారాంతంలో ఒక దీర్ఘ కాలీనమైన పని పూర్తి కాగలదు. దైవానుగ్రహం పొందుతారు. ఆదాయం బాగుంటుంది. స్వాధ్యాయం చేయండి.

మీన రాశి: గతంలో చేసిన పొరపాటును దిద్దుకుంటారు. ఆవేశం మంచిది కాదని తెలుసుకుంటారు. మీకు కొన్ని చక్కని అవకాశాలు రాబోతున్నాయి. కళాకారులకు, రచయితలకు మంచి వారం. పోగొట్టుకున్న వస్తువు తిరిగి పొందగలరు. హనుమాన్ చాలీసా చదవండి.

ఈ వారం మంచి మాట:

శ్లో: చత్వారి కర్మాణ్యభయంకరాణి
భయం ప్రయఛ్చన్నత్యయథాకృతాని
మానాగ్నిహోత్రముత మానమౌనం
మానేనాధీతముత మానయఙ్ఞ:
(మహాభారతం సంభవపర్వం)

అగ్నిహోత్రం, మౌనం, అధ్యయనం, యఙ్ఞం-ఈ ఆరు కర్మలు మానవులను భయం నుండి విముక్తులను చేస్తాయి. కానీ ఇవి సరిగ్గా చేయకపోయినా, అభిమానపూర్వకంగా అనుష్ఠించినా విరుధ్ధమైన ఫలితాలనివ్వగలవు!

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి: శాంతి:
~~~***~~~

The English version can be seen at http://www.sripati.com

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

3 thoughts on “19-25 జులై 09 రాశి ఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ

  1. “ఇంటి సమస్యలు పెరిగి పూర్తిగా సమసిపోగలవు. నిదానం, ఓర్పు అవసరం.”…..:( ayyoe! ii vaakyam okinta bhayam golipinaa, chivara chuusi jayambu nischayambani bayaludearutunnaananDi!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: