12-18 జూలై 09 వరకు రాశిఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ


శ్లో:శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
  సమస్తకళ్యాణగుణాభిరామ:
  సీతాముఖాంభోరుహచంచరీక:
  నిరంతరం మంగళమాతనోతు

ఈ వారం గ్రహస్థితి ఇలా ఉన్నది: రవి బుధులు మిథున కర్కాటక రాశులు (17 జూలై న కటక సంక్రమణం జరుగనున్నది),కేతువు కర్కాటకం, శని సింహం,రాహువు మకరం, గురువు కుంభం,కుజ శుక్రులు వృషభం, చంద్రుడు కుంభ, మీన, మేష, వృషభ రాశులలో సంచరిస్తారు.

కొన్ని గూఢమైన వ్యవహారాలు వెలుగులోకి రానున్నాయి. వినాశ కాలంలో విపరీత బుధ్ధి కొందరికి కలుగనుంది.దైవ చింతన ఉన్న వారికి మంచి లాభాలు కనపడుతునాయి. చిన్న దారులు పనికి రావని చాలా మంది తెలుసుకుంటారు. ఒక ప్రకృతి వైపరీత్యం జరుగవచ్చును…

మేష రాశి: ఇది ఒక మానసిక చికాకును కలిగించే వారం. మౌనం పాటించండి. ఊహల కంటే వాస్తవాలలో జీవించండి. మీ ప్రవర్తన కూడా ఊహా జనితంగా మారగలదు. శ్రీసూక్తం చదవండి.

వృషభ రాశి: ఎవరికీ అప్పులు ఇయ్యకండి.చేయకండి.ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.ఇంటి పనులలో కాలం వ్యతీతమవుతుంది.కొందరి మెప్పు పొందుతారు.హనుమాన్ చాలీసా చదవండి.

మిథున రాశి: కళ్ల విషయంలో జాగ్రత్త వహించాలి.ఆదాయం బాగుంటుంది. ఒక పరిష్కారం సమస్య రూపంలో కనిపిస్తుంది. చివరకు మంచి జరుగుతుంది.చాటు మాటలు అలవాటు ఉంటే ఈ వారమైనా మానుకోండి. దుర్గా సప్తశ్లోకీ చదువుకోండి.

కర్కాటక రాశి: వారాంతంలో కొద్దిపాటి జ్వరం రావచ్చు. ఈ సంవత్సరంలో నూతన కార్యక్రమానికి ఈ వారం నాంది పలుకుతారు. ఆదాయం బాగుంటుంది. మిమ్మల్ని అపార్థం చేసుకునే వారు కలుస్తారు.శివునికి అభిషేకం చేయించండి.

సింహ రాశి: దూకుడు వ్యవహారం వలన నష్టపోగలరు. కొందరు మీ ప్రవర్తనను గమనిస్తున్నారు. ఆలోచించండి.ఒక ప్రేమ వ్యవహారం ఉండ వచ్చు!ఉద్యోగస్తులకు మార్పుల సూచన ఉన్నది. మహాసౌరం చదవండి.

కన్య రాశి: మీ వలన ఇతరులకు లాభం ఉన్నది.బంధువుల పట్ల ఒక చిరాకైన ఆలోచన కలుగగలదు.మీకు అది కలగటంలో తప్పు లేదు కానీ దానిని వదిలేయటం మంచిది.తగిన విశ్రాంతి తీసుకోండి.విష్ణు సహస్రనామం చదవండి.

తుల రాశి: ఈ రాశి వారికి అనుకోని శుభ సంఘటనలు జరుగనున్నాయి.రాజకీయ లబ్ధి పొందగలరు.పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. గౌరవం పెరుగుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. మాటలు ఆలోచించి మాట్లాడాలి. దేవీ ఖడ్గమాలా స్తోత్రం చదవండి.

వృశ్చిక రాశి: పిల్లలు ఊరు దాటే సమయం వస్తున్నది.సిధ్ధం కావలి.గతంలో చేసిన అతిథి సత్కారాల వలన ఇప్పుడు మంచి జరుగనున్నది. భార్యా భర్తలు కలసి నిర్ణయాలు తీసుకోవాలి. సుబ్రహ్మణ్య కవచం చదవండి.

ధను రాశి: తీవ్రమైన విమర్శలను ఎదుర్కొనటం, చేయటం ఈ వారం మంచిది కాదు. చేతికి డబ్బు అందగలదు. కొత్త పనులు చేపడతారు. మీ సహచరులు ఇబ్బందులు కలుగ చేయగలరు. దత్త స్తవం చదవండి.

మకర రాశి: మీరు ఓర్పుతో నిర్వస్తిస్తున్న బాధ్యతలు మీకు మంచి గౌరవాన్ని తెచ్చిపెడతాయి.దైవ దర్శనం లాభిస్తుంది. వస్తువులు జాగ్రత్త.సంతానం పురోగమిస్తుంది.మరి కొన్ని బాధ్యతలు పెరగనున్నాయి. లలితా సహస్రనామం చదవండి.

కుంభ రాశి: మీ చిరకాల కోరిక ఈ వారం నెరవేరనున్నది.పెట్టుబడులకు దూరంగా ఉండండి. డబ్బు చేతికి అందగలదు. ఇంటిలో కొన్ని చిన్న చికాకులు ఉండగలవు. పట్టించుకోనవసరం లేదు! విష్ణు సహస్రనామం చదవండి.

మీన రాశి: నూతన ఉద్యోగ ప్రయత్నం చేయువారికి మంచి వారం. బంధువులు ఇబ్బంది పెట్టగలరు. వ్యవసాయరంగం వారికి బాగుంది.ఉబ్బసం వ్యాధి ఉన్న వారు జాగ్రత్త వహించాలి. లక్ష్మీ అష్టోత్తరం చదవండి.

ఈ వారం మంచి మాట:

శ్లో: సత్యమేశ్వరో లోకే సత్యే ధర్మం ప్రతిష్ఠిత:
   సత్యమూలాని సర్వాణి సత్యాన్న పరమం పదం

(వాల్మీకి రామాయణం)

సత్యమే ఈశ్వరుడు.సత్యమునందే ధర్మము ప్రతిష్ఠితము.అన్నియు సత్యమూలకములే. సత్యమును మించిన పరమపదము లేదు.

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “12-18 జూలై 09 వరకు రాశిఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: