05-11 జులై09 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహ చంచరీక:
నిరంతరం మంగళమాతనోతు

ఈ వారం గ్రహస్థితి ఇలా ఉన్నది- రవి బుధులు మిథునం, కుజ శుక్రులు వృషభం, కేతువు కర్కాటకం, శని సింహం, రాహువు మకరం, గురువు కుంభం, చంద్రుడు వృశ్చిక, ధను, మకర కుంభ రాశులలో సంచరిస్తారు.

ఈ గ్రహస్థితి మాట దుడుసు గల వారిని జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నది.ఇతరుల విషయాలలో జోక్యం చేసుకునే వారు ముందుకు దూకనున్నారు. రాజకీయ రంగం లో ఉన్న వారు ఆరోగ్యం విషయంలోనూ,ఇంటి దొంగల విషయంలోనూ జాగ్రత్తలు వహించాలి. పలువురికి స్థాన చలన సూచనలున్నాయి. ఇంటిలోని వస్తువులు కాపాడుకోవాలి.

 

 మేష రాశి: మీ ఆశయాలు ఈ వారం ప్రారంభం తో నెరవేరనున్నాయి. జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభం కానున్నది. ఆదాయం బాగుంది. పలువురు మిమ్మల్ని మెచ్చుకునే పనులు చేస్తారు. విశ్రాంతి సమయాన్ని విస్మరించి చికాకులు తెచ్చుకోకండి. విష్ణు సహస్రనామం చదవండి.

 వృషభ రాశి: దాంపత్య జీవితంలో కొన్ని చికాకుల వలన ఇతరుల పట్ల ఆసక్తి పెరుగ గలదు. అవసరం లేదు! అందరూ ఇంతే! వారాంతంలో మంచి వార్తలు వింటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉండగలదు. శ్రీసూక్తం చదవండి.

 

 మిథున రాశి: బంధువుల రాక ఉన్నది. చిన్న చిన్న విషయాలలో బేరాలు ఆడి పెద్దవి పోగొట్టుకోగలరు. ఆలోచించండి. కళ్ల విషయం లో శ్రధ్ధ అవసరం. అదనపు బాధ్యతలు చేతికి రానున్నాయి. దుర్గా సప్తశ్లోకీ చదవండి.

కర్కాటక రాశి: పూర్వ జన్మ సుకృతం వలన కొన్ని మంచి ఫలితాలను ఈ వారం పొందనున్నారు. కాకపోతే రాబోయే సూర్య గ్రహణం-22 జూలై తరువాత వరకు ప్రయాణాలను మానుకోవటం మంచిది. చర్మ వ్యాధులు బాధింపగలవు. జాగ్రత్త వహించాలి. సుబ్రహ్మణ్య కవచం చదవండి.

 సింహ రాశి: కొన్ని పనులను ధైర్యంగా చేపడతారు. గుండె జబ్బులున్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మాట మాటకీ పెనుగులాటలు మంచివి కావు! ఆదాయం బాగుంటుంది. జీవిత భాగస్వామికి స్థాన చలనం ఉండవచ్చు. శివునికి అభిషేకం చేయించండి.

కన్య రాశి: పోగొట్టుకున్నారనుకున్న వస్తువు తిరిగి పొందుతారు.కొన్ని ఒడిదుడుకుల తరువాత బండీ సామాన్యం కాగలదు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. దైవ చింతన చేయండి. ధ్యాన మార్గం అవలంబించండి.

తుల రాశి: కుటుంబంలో కొన్ని చిన్న చికాకులు వారం మధ్యలో తలెత్తవచ్చు. నిదానం అవసరం. పెట్టుబడులు లాభిస్తాయి. బదిలీ ఉండవచ్చు. విద్యార్థులకు కొత్త అవకాశాలు ఉన్నాయి. లలితా సహస్రనామం చదవండి.

వృశ్చిక రాశి: జీవిత భాగస్వామి ఆరోగ్యం కాపడుకోవలసిన అవసరం ఉన్నది. ఇంటిలోకి కొత్త వస్తువు కొంటారు.వారం మధ్యలో కొన్ని ఖర్చులు ఎదురవుతాయి. కాళ్ల నొప్పులు ఎక్కువ కాగలవు. హనుమాన్ చాలీసా చదవండి.

 

ధను రాశి: మాట పట్టింపులు వద్దు. నన్ను కాకుండా లెక్క వేసుకోండి అనే మిత్రులతో చేతులు కలిపి మోసపోగలరు.స్వశక్తి మీద ధ్యాస చూపండి. విదేశీ యాన ప్రయత్నాలు కొద్ది పాటి ముందడుగు వేయగలవు.అవివాహితులకు కొన్ని మంచి అవకాశాలు రాగలవు. ఈ వారం పోనిచ్చి పై వారం మీ ఆలోచనలను అమలు లోకి తేవచ్చు. గణపతిని ఆరధించండి.

 

మకర రాశి: ఈ రాశి వారికి పెరిగిన బాధ్యతల వలన కొన్ని చికాకులు తప్పవు. మీ ఓర్పు మిమ్మలని కాపాడుతుంది.కొంత ధనం వచ్చు అవకాశం ఉన్నది.తెలియని విషయాన్ని తెలిసినట్లు ఇప్పుడు చెప్పినా మీకది తెలియదని తెలిసిన తరువాత బాధ పడాల్సి ఉంటుంది. జాగ్రత్త వహించండి. లక్ష్మీ అష్టోత్తరం చదవండి.

 కుంభ రాశి: కొన్ని అనివార్య పరిస్థితుల నుంచి బయట పడతారు. మీ సాహసం వలన రాబోయే రోజులలో గొప్ప కార్యాలు చేపట్టగలరు.కాకపోతే మీ ప్రవర్తన చాలా మందికి అర్థం కావటం లేదేమో ఒక పర్యాయం గమనించండి. స్వాధ్యాయం మంచిది.

మీన రాశి: స్వాభిమానం వలన ఒక సహాయాన్ని ఇతరులు చేస్తామన్నా ఒప్పుకోని పరిస్థితి రావచ్చును. అవసరం లేదు. మనం సంఘ జీవులం! మనలో ఎవరూ సర్వతంత్ర స్వతంత్రులం కాము! ఆలోచించండి.భావుకులకు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవలసిన వారం. మంచి సంగీతం శ్రవణం చేయండి.

ఈ వారం మంచి మాట:

అర్థోవా ఏష ఆత్మన: యత్ పత్నీ
( ఉపనిషత్ వాక్కు )
ఆత్మ యందు సగభాగం పేరే ధర్మపత్ని!

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి: శాంతి:

 ~~~***~~~

The English version of these predictions can be seen on http://www.sripati.com

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

3 thoughts on “05-11 జులై09 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతిశర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: