7-13 జూన్ 2009 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
     సమస్తకళ్యాణగుణాభిరామ:
     సీతాముఖాంభోరుహచంచరీక:
     నిరంతరం మంగళమాతనోతు

ఈ వారం గ్రహస్థితి ఇలా ఉంది:

రవి బుధులు వృషభం, కేతువు కర్కాటకం, శని సింహం, రాహువు మకరం, గురువు కుంభం,శుక్ర కుజులు మేషం,చంద్రుడు వృశ్చిక, ధను మకర రాశులలో సంచరిస్తారు.

ప్రయాణాలకు చాలా మటుకు దూరంగా ఉండవలసిన వారం. ఆర్థిక ఇబ్బందులు అకస్మాత్తుగా తలెత్తవచ్చును. జాగ్రత్త వహించాలి. ప్రేమాయణానికి మంచి వారం. వ్యాపారం నీరసంగా ప్రారంభమవుతుంది. మానసిక సమస్యలున్న వారు వాదోపవాదాలలోకి వెళ్లకపోవటం మంచిది.

మేష రాశి: మిత్రులు సహకరిస్తారు.వారాంతంలో కొన్ని అడ్డంకులు తొలగిపోతాయి.అందరినీ ఆకట్టుకుంటారు.బాధ్యతలు పెరిగి మిమ్మల్ని ఆలోచింపచేస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. దుర్గా సప్తశ్లోకీ చదవండి.

 వృషభ రాశి: ఒక ప్రేమాయణం మొదలు కానున్నది. మంచి పనులు చేసినందుకు మెప్పు పొందుతారు. మీ మంచితనం ముందుకు వస్తుంది. పిల్లల వ్యవహారం కొద్దిగా ఆలోచింప చేస్తుంది. పెద్దలు నడిచేటప్పుడు జాగ్రత్త వహించాలి. విష్ణు సహస్రనామం చదవండి.

మిథున రాశి: వారాంతం లో బాధ్యతలు పెరగనున్నాయి. ఓర్పుతో వ్యవహరిస్తారు. ప్రయాణాలు అత్యవసరం అయితే తప్ప మానుకోవటం మంచిది. స్త్రీలు అధికంగా మాట్లాడటం ఈ వారం అంత మంచిది కాదు.సుబ్రహ్మణ్య కవచం చదవండి.

 కర్కాటక రాశి: మంచి పనులు చేపడతారు.డబ్బు అందుతుంది. ఆటగాళ్లకు చక్కని అవకాశాలున్నాయి.ఒక కార్యక్రమంలో పాల్గొని మన్ననలు అందుకుంటారు. లోకాభిరామాయణం కూడా అవసరమేనని గ్రహిస్తారు. మహా సౌరం చదవండి.

సింహ రాశి: మీ వైఖరి నలుగురినీ ఆలోచింప చేస్తున్నది. జీవితంలో ఒక ముద్ర వేసుకోవటం మంచిది కాదు. చేరువలోనున్న వారిని వదులుకొని ఎక్కడికో పాకులాడుతున్నట్లున్నారు. ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. గొంతు నొప్పులు బాధ పెట్టగలవు.ఆదిత్య హృదయం చదవండి.

కన్య రాశి: చిన్న పనులు ఆలస్యంగానూ, పెద్దవి త్వర త్వరగానూ జరిగిపోగలవు. డబ్బు అందుతుంది. కొద్దిగా కలవరపెట్టి అందుతుంది. మీ నుంచి ఎంతో సమాచారం రాబట్టాలని కొంత మంది ప్రయత్నిస్తారు. జాగ్రత్త వహించండి. వాహనం మరమ్మత్తుకు వస్తుంది. లింగాష్టకం చదవండి.

తుల రాశి: కొత్త పనులకు శ్రీకారం చుట్టగలరు. ఆదాయం, వ్యాపారం బాగుంటాయి.ఇల్లు మారాలనుకుంటారు. సమయం ఉంది. వేచి చూడండి.మీరు త్వర పడి వ్రాసిన ఒక లేఖ పంపే ముందు కొద్దిగా ఆలోచించండి.
శ్రీసూక్తం చదవండి.

 వృశ్చిక రాశి: కర్మ సిధ్ధాంతం వైపు మనస్సు జారుకుంటుంది.శ్రమ ఎక్కువగా ఉన్నట్లు భావిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఆవేశాలు అదుపులోకి తెచ్చుకోవాల్సి వస్తుంది. హనుమాన్ చాలీసా చదవండి.

ధను రాశి: అన్నిటికీ మంచి వారం ఇది.శుభ వార్తలు వింటారు. సంతానం లేని వారికి సంతాన యోగం ఫలించగలదు. ఆరోగ్యం బాగుంటుంది.రాజకీయ రంగంలో ఉన్న వారికి లాభాలు బాగున్నాయి. శివునికి అభిషేకం చేయించండి.

 మకర రాశి: ఇల్లే స్వర్గసీమ అని అర్థం చేసుకుంటారు.కాళ్ల నొప్పులు బాధించగలవు. జీవిత భాగస్వామి మాటలు కలవరపెట్టగలవు. ఎక్కువగా స్పందించకండి.కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. లక్ష్మీ అష్టోత్తరం చేసుకొనండి.

కుంభ రాశి: జరగబోయేది తెలుస్తున్నట్లు అనిపిస్తుంది. వింత ఆలోచనలతో ఈ వారం ముగుస్తుంది.మీ పెట్టుబడులు క్షేమం గానే ఉంటాయి. భయపడకండి. కొత్త విద్యను అభ్యసించాలనిపిస్తుంది.మంచి ఆలోచనే! కుల దైవాన్ని కొలవండి.

మీన రాశి: వారం మెల్లగా ప్రారంభమయి జోరు పుంజుకుంటుంది. పెద్దలను గౌరవిస్తారు. భూ క్రయ విక్రయాల వారికి ఓ మాదిరిగా లాభిస్తుంది.భార్యా భర్తలిద్దరూ పట్టుదలలు పెంచుకోగలరు. జాగ్రత్త వహించండి. లలితా సహస్రనామం చదవండి.

ఈ వారం మంచి మాట:

శ్లో: లభ్యతే ఖలు పాపీయాన్ నరో ను ప్రియవాగిహ
     అప్రియస్య హి పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభ:

(మహాభారతం సభాపర్వంలోని ద్యూత పర్వం)

మనస్సుకు ప్రియంగా అనిపించు మాటలను చెప్పు వాళ్లు తప్పక దొరక గలరు. కానీ పనికి వచ్చేదైనప్పటికీ అప్రియ వచనములు చెప్పే వారు, వినే వారు ఇద్దరూ అరుదు!

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

3 thoughts on “7-13 జూన్ 2009 రాశిఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ

 1. Hello Sir,
  This is Bandi. Ramamurthy, i am a 23 years old guy. I want to know about my Astrology..

  My DOB Details:

  1984- October 8th- Monday, at 7.30p.m
  i born at ‘Mittapalli village’, Kallur madal, Kahmmam dt, Andhrapradesh..

  Thanking you,
  I am eagerly seeking for your reply….

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: