దిక్కుమాలిన అలవాటు-వేదాంతం శ్రీపతి శర్మ


ఈ మధ్య ఎక్కడినుండి వచ్చిందో ఒక దిక్కుమాలిన అలవాటు చాలా మందికి వచ్చేసింది. ఏమి మాట్లాడినా చివర ‘ అర్థం కావట్లా నీకు?’ లేదా ‘ నీకు అర్థం కావటల్లేదు ‘ అనటం మొదలు పెట్టేశారు. ఇది మంచి అలవాటు కాదు. ముందు ఆలోచించవలసినది ఏమిటంటే అసలు చివర ఇలాంటిది అనటం అవసరమా? సరే. అవసరమైతే ఏమనాలి? తెలంగాణా ప్రాంతం లో ఒక మంచి అలవాటు ఉంది. విన్నారా? అంటారు. ఇతరత్ర ఏవండీ…అంటారు. కొంతమంది నిజానికి అంటారు.

ఏది ఎలా ఉన్నా అర్థం కావాం లేదు అనే మాట అవతల ప్రక్కనున్న వ్యక్తిని చులకన చేయటమే! ఇది తెలిసి వ్యవహరిస్తున్నారో లేక తెలియక చేస్తున్నారో ఏ నోట విన్న ఈ మధ్య ఇలాగే ఉంది.

సామాన్యంగా ఉపాధ్యాయులు ‘ తెలిసిందీ? ‘, ‘ అర్థమయ్యిందీ? ‘ ఇలా అడగటంలో అర్థం ఉన్నది. మామూలుగా మిత్రులు సంభాషించునప్పుడు ఇది అవసరం లేదు. ఈ మధ్య పిల్లలు పెద్ద వాళ్లతో మాట్లాడునప్పుడు, కోడళ్లు అత్త మామలతో మాట్లాడునప్పుడు కూడా ఈ వ్యవహారం గమనించాను. మిత్రులు చాలా మంది పరోక్షంగా ఇదేమిటి చిత్రం అని అడిగిన వారున్నారు. దీనికి కారణం సరైన రీతిలో సామాజిక వ్యవహారం గురించి ఎక్కడా ఎవరూ పట్టించుకోపోవటం ఒకటి, మంచి విషయం ఏదైనా చెప్పినప్పుడు ఆ వ్యక్తి పట్ల గౌరవం లేకపోవటం రెండు, ప్రపంచం అంతా మన ఙ్ఞానం విస్తరించినట్లు ఊహించుకుని ఏదో స్వాతంత్ర్యం వచ్చినట్లు అన్నీ చెల్లుతాయి నోరు మూసుకో అనటం కూడా ఒక లైసెన్సుగా వ్యవహరించటం.

సదాచారానికి సబ్స్టిట్యూట్  లేదు, ఉండబోదు.

దయ చేసి సోదర సోదరీమణులు గమనించి మసలుకోగలరు!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “దిక్కుమాలిన అలవాటు-వేదాంతం శ్రీపతి శర్మ

  1. ఈ విధమైన దిక్కుమాలిన అలవాట్లకు / వ్యావహారిక భాష దిగజారుడుతనానికి ఒక రకంగా TV మీడియా దోహదపడిందని నా వ్యక్తిగత అభిప్రాయం..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: