పురాణ కాలక్షేపం(5)-వేదాంతం శ్రీపతి శర్మ


హరి: ఓం

చాలా మంది హరి: ఓం తత్ సత్-ఇలాంటివి అనుటలో తాత్పర్యం ఏమిటి అని అడుగుతూ ఉంటారు…

శ్లో: ఓం తత్ సత్ ఇతి నిర్దేశ: బ్రహ్మణస్త్రివిధ: స్మృత:

ఓం, తత్, సత్ అనునవి బ్రహ్మనామములు. పరమాత్మను స్మరించి ఫలమును కోరక, సత్కర్మలను ఆచరించి, పరమేశ్వరునకు అర్పించవలయును.

భార్యా భర్తల సమైక్య రూపం భారతీయ తత్వ చింతనకు మూల స్తంభం అని క్రిందటి వారం చెప్పుకున్నాము. ఇది తత్వ చింతన మాత్రమే కాదు.సృష్టిలోని నియమాన్ని ఆచరణలో పాటించుచుండటం వలన భారతీయ జీవన విధానం లో పాఠం, ప్రాక్టికల్స్ అనేవి లేవు. అంతా ప్రాక్టికల్సే!-ఙ్ఞానం యావత్తూ ఆచరణ మీదనే ఆధారపడి యున్నది.

తపసా ఇతి…తపస్తత్వా! -తపస్సు గురించి తెలుసుకోవాలంటే తపస్సు లోకి వెళ్లిపోమంటుంది ఉపనిషత్తు. అందు చేత జీవన విధానాన్ని ఒక పర్యాయం పరిశీలించి చూస్తే వైదిక విఙ్ఞానం కనుల ముందు ఉంటుంది. విరుధ్ధంగా వెళితే ప్రకృతి ‘ విరోధి ‘ కాగలదు!

మన నిత్య జీవన విధానంలో ఉపాసన అనేది స్వయంగా దాగి యున్నది.

‘ మమ యోనిర్మహడ్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం. సంభవ: సర్వభూతానాం తతో భవతి భారత ‘

ప్రకృతి రూపమైన యోనియందు నేను గర్భమును అధానము చేసినప్పుడు ఆ ప్రకృతి రూపము నుండి సమస్త విశ్వము సృజింపబడును.ఈ విధముగా బ్రహ్మాండోత్పాదకుడైన బ్రహ్మ సయితము పరమేశ్వరుడే!

‘ పితాహమస్య జగత: ‘

నేను ఈ సమస్త జగత్తునకు తండ్రిని, సృష్టికర్తను.

అందుచేత పరమేశ్వరుని తండ్రిగా ఆరాధించటం మనకు శ్రేష్ఠమైన మార్గం.

‘ మహాదేవ మహాదేవ మహాదేవఏతి వాదినం
వత్సం గౌరివ గౌరీశో ధవంత మనుధావతి ‘

మహాదేవ- అని ఉచ్చరించు వాని వైపునకు వత్సల అయిన గోవు తన లేగ దూడ వెంట పరుగిడునట్లు పరుగిడునని భావము.

బాగుంది. పరుగిడునా?

తప్పకుండా! ఎవరిని లేగదూడగా ప్రేమించి పరుగిడును? పరమేశ్వరుడు ఏ పధ్ధతిలో సృష్టిని నియమించెనో, ఆ పధ్ధతిని ఆచరిస్తూ మా జీవన విధానం, మా జీవితం యావత్తూ నీ ప్రక్రియలో అభిన్నమైన భాగం అని తలచు వారలను తన పిల్లల వలెనే ఆయన సాకును. అలా కాకుండా వెర్రి తలలు వేసి ఎవరి పైత్యం వారు ఉపయోగించినప్పుడు ఈతి బాధలు కమ్ముకుని సమస్యలకు ప్రజలు గురి అవుతూ ఉంటారు.

స్త్రీ పురుషులు ముందుగా ఈ ధర్మాచరణను సూటిగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉన్నది.
ధర్మం అనగానే ఏదో కృత యుగానికే వెళ్లాలనుకోవటం కాదు.

ఏదో ఊహించుకుని మరేదో ఆశించుకుని భార్యా భర్తలు కోర్టు ముందు నిలబడటం మన సంస్కృతికే హాస్యాస్పదం.
సృష్టి తిరుగుతున్నది ఒక ధర్మ మార్గం, ఒక నియమం ప్రకారం.
 
దానిని ఉల్లంఘించే శక్తి ఎవరికీ లేదు.

ఓం తత్ సత్!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: