‘ బందిని ‘ చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు


1963 లో బిమల్ రాయి నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం ఇది.
ఎస్. డి. బర్మన్ అందరినీ తన సంగీతం తో కదిలించిన చిత్రం.

కథలోని వ్యూహం సామాన్యమైనది కాదు. (కథ జరాసంధ, మాటలు పాల్ మహేంద్ర, స్క్రీన్ ప్లే నబేందు ఘోష్ అందించారు).

స్వాతంత్ర్య సమరం రోజుల నేపథ్యం ఆ కాలం లోని జీవన శైలిని ప్రతిబింబిస్తూ ఒక్స్ స్త్రీలోని భావ జాలాన్ని ముందుకు కవిత్వ ధోరణిలో తీసుకుని వస్తుంది. ఒక్స్ హత్య చేయటం వలన కళ్యాణి (నూతన్) జైలులోకి వస్తుంది. ఇది మొదటి ‘బందిని ‘. అయితే తను వివాహం చేసుకుందామనుకున్న వ్యక్తి మరొకరిని చేసుకోవటం వలన ఆ పరిస్థితిలోంచి ఇవతలికి రాలేని స్త్రీ మరో ‘ బందిని ‘.

ఈ జైలు లో ఒక డాక్టర్ (ధర్మేంద్ర ) పరిచయమయ్యి ఇష్ట పడి వివాహానికి కూడా సిధ్ధ పడతాడు. ఈమె ఒప్పుకోలేని పరిస్థితి.
ఈమెను వివాహం ఆడతానని మాట ఇచ్చి వెళ్లిపోయిన వికాస్ (అశోక్ కుమార్) భార్య హత్యకు చిత్రమైన పరిస్థితిలో ఈమె పని చేస్తున్న ఆసుపత్రిలో హత్య చేయబడింది. అందరూ దూరం. తండ్రి అదే ఆస్పత్రిలో ఈమెను వెతుక్కుంటూ వచ్చి దుర్ఘటనపాలయ్యి చనిపోతాడు. కాలం యొక్క జాలం లో చిక్కుకున్నది ఇంకొక ‘బందిని ‘.

అశోక్ కుమార్ సమరయోధుడు కావటం చేత ఒక తప్పని పరిస్థితిలో ఒక అధికారి దగ్గర రహస్యాలను తెలుసుకోవటం కోసం ఇష్టం లేకపోయినా నాయకుని ఆఙ్ఞ మేరకు దేశం కోసం ఆ వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఇది చివరికి అతను స్టీమర్ ఎక్కేముందు నూతన్ కి తెలియటం, ఆమె అప్పటికే ధర్మేంద్ర ఇంటికి రైలులో రవాణా కావటం, ఇప్పుడు కొత్త పరిస్థితిలో మరో సారి చిక్కుకొని ఊగిసలాడటం ఇంకొక ‘బందిని ‘.
దేశభక్తికి, ప్రేమ, వివాహం, సమాజం, పరిస్థితుల మధ్య నలిగిన స్త్రీ యొక్క అద్భుతమైన పాత్రపోషణ నూతన్ కనబరుస్తుంది. ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం వెనుక ఉన్న క్లిష్టమైన విషయాన్ని చక్కగా ముందుకు తెచ్చింది.

~~~***~~~

సినిమాలో ఫ్లాష్ బాక్ చాలా నెమ్మదిగా ప్రారంభమవుతుంది. దీనికి ఒక కారణం ఉంది. పతాక సన్నివేశం వైపరీత్యానికి సంబంధించినది. ఇది అక్కడికి చేరుకునే కారణాలను దర్శకుడు ఒక పధ్ధతిలో తీసుకుని వెళతాడు. మెరే సాజన్…పాటలోనే కథ నూతన్ అశోక్ కుమార్ ని చేరుకోవటంతో కథ ముగిసిపోతుంది. ఇందులో పాటలోని ఒక మాట సమస్తం చెబుతుంది- ‘ మై బందినీ పియాకీ, మై సంగినీ హూన్ సాజన్ కీ…’! పియాకీ అన్న మాట బర్మన్ గారు పలికిన తీరు చాలు. కథ చెప్పేస్తుంది. ఇన్ని బందినీలు ఉన్నప్పటికీ అవన్నీ ఒక ఎత్తు, నేను నా ప్రియుని వద్ద బందీని అని చెప్పటం విశేషం. అది క్లైమేక్స్ కావటం అద్భుతం!

~~~***~~~

ఓయె మాఝీ…ఈ పాట నర నరాలలోకి ఎక్కేస్తుంది. కారణం ఏమిటంటే నదిలో పడవ, అలలు కదిలే తీరు పాటలోని సంగీతానికి ప్రాణం కావటం. మన్ కీ కితాబ్ సే తుం, మెర నాం హీ మిటాదేనా…ఈ వాక్యం లోని అన్ని పదాలూ అలల లాగా ముందుఈ వెనక్కీ కదులుతాయి. తెరచాప గాలికి ఊగినట్లు తరువాత ముఝె ఆజ్ హీ…అన్నది ఆకాశం లోకి లాకుని వెళ్లటం, లే చల్ పార్-లే అన్నది నన్ను తీసి అవతలకు లాగు అన్నట్లు పలకటం భావాన్ని లయతో కలిపి పాడటం…

మరో పాట-మొర గోర రంగ్ లైలె, తొహె శాం రంగ్ దైదె! నా ఎర్ర రంగు తీసుకో, నీ నల్లని రంగును ఇచ్చేయి (దైదే). రాత్రిలో దాక్కుంటాను…ఇలా ఉండగా మబ్బుల చాటునుండి చంద్రుడు ఇవతలకి వస్తాడు. ఆ సమయంలో భావ ప్రదర్శన సాహిత్యానికి అనుగుణంగా ఉంటుంది.

సినిమాలో అశోక్ కుమార్ ఆ విధంగా ఎందుకు చేయవలసి వచ్చిందో అతనితో వచ్చిన వ్యక్తి సంవాద రూపంలో చెప్పటం వలన అంత ప్రధానమైన విషయం దృశ్యంలోకి ఎందుకు రాలేదా అనిపించింది. చూస్తే సినిమా 15 రీళ్లే! అందు చేత ఆ నాటకీయమైన విషయాన్ని తెర మీదకి దృశ్యరూపంలో చూపిస్తే బాగుండేదనిపించింది.

అశోక్ కుమార్ నటన కూడా పాత్రకు ఎంత సముచితంగా ఉన్నా ఈ విషయం సినిమాలో లేకపోవటం వలన ఆయన నటన మరుగున పడ్డట్లున్నది…

~~~***~~~

ఈ సినిమాకు ఎన్ని అవార్డులొచ్చాయి ఇవన్నీ అందరికీ తెలిసినదే.
చెప్పుకోదగ్గది ఏమిటంటే మహానుభావులందరూ వెళ్లిపోయారు. వారి కళాఖండాలు అలా ఉండిపోయాయి. అందుకే వీరెక్కడికీ పోరు. జీవితమంతా సృజనకు, దృశ్యానికీ, సంగీతానికీ, సాహిత్యానికీ మధ్య రససిధ్ధి కోసం సాధన చేస్తూ ఆ మార్గం లోనే అదృశ్యమైపోయారు. ఆ రస సిధ్ధి కోసం వారికి ‘ మర్ కే భి రహతా ఇంతజార్…’-ఆవలి గట్టు మీద కూడా ఆ తన్మయత్వం కోసం వేచి ఉంటారు!

~~~***~~~

(The English version of this review can be seen by clicking http://www.films.sripati.com)

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “‘ బందిని ‘ చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు

  1. ఈ సినిమాలో సింబాలిసం ని బాగా ఉపయోగించుకున్నారు కదండీ! నూతన్ మొట్టమొదటిసారి అశోక్ కుమార్ ని కలసినప్పుడు కిటికీని సింబల్ గా ఉపయోగించుకున్నారు బిమల్ రాయ్. క్రంతి కారి మూవ్మెంట్ కి బద్ధుడైన అషోక్ కుమార్ కి కిటికి తెరిస్తే కనిపించేడి విశాలమైన మైదానంలో విహ్వలంగా చూస్తున్న నూతన్.వీరిరురి మద్యన ఠానేధార్ సంఘాని కి ప్రతీకగా! వెంఠనే కిటికి మూసుకుని పోతుంది ఆ క్షణానికి. తరువాత నది ఒడ్డున కలయిక–అప్పటికే అతని పట్ల ఆరాధన పెంచుకుంటున్న నూతన్, ఇంకా తన సిద్దాంతలాకే ప్రాముఖ్యత నిస్తున్న అషోక్. మళ్ళీ ఠానేధార్–“ఆప్ కే హోతే హుయే మై కైసే భూల్ జావూంగా?” అన్న అశోక్ డైలాగ్ అతడు ఈ అమ్మాయి పట్ల ఆసక్తి చూపుతున్నాడన్న విషయం తెలియజేయడానికే!అక్కడ ఠనేధార్ “నదీ కినారా…” అంటూ వ్యంగంగా వ్యక్తపరచినది ప్రేక్షకులు అశోక్ లోని మార్పును గుర్తించడానికే!తరువాత “ముహె షాం రంగ్ దైదే…” పాట చివరలో అశోక్ కిటికీ తెరుచుకుంటుంది! ఇది తరువాత జరుగ బోయే వారి సంగమానికి సంకేతమే!చివర స్టేషన్లో కిటికీ లోంచి
    చూస్తూనే, అనేక ఆవేశికావేశాలకు లొంగిపోయిన నూతన్ తిరిగి తన గమ్యస్థానం తెలుసుకుని పరిగెడుతుంది! మళ్ళీ విశాల ప్రణయ ప్రపంచం వైపుకి–ఒక స్వచ్చంద బందినిగా!
    ఏదో నా భావాలు మీతో పంచుకున్నాను. మొత్తానికి ఈ సినిమా నాకు ఒక దృశ్యకావ్యంలా అనిపించింది!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: