24 నుంచి 30 మే2009 వరకు రాశి ఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
     సమస్తకళ్యాణగుణాభిరామ:
     సీతాముఖాంభోరుహచంచరీక:
     నిరంతరం మంగళమాతనోతు

ఈ వారం గ్రహస్థితి ఇలా ఉంది-రవి వృషభం, బుధుడు వృషభ మేష రాశులు,శుక్రుడు మీనం, కుజుడు మేషం, గురువు కుంభం, రాహువు మకరం, కేతువు కర్కాటకం, శని సింహం, చంద్రుడు వృషభ, మిథున, కర్కాటక రాశులు సంచరిస్తారు.

ఇది కళాకారులకు, రచయితలకు మంచి వారం.తొందర పడి మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వారికి కొన్ని సమస్యలు తలెత్తగలవు.ఉద్యోగాలలో మార్పులు ఉన్నాయి. స్త్రీలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.

మేష రాశి:వ్యాపారాలలో భాగస్వామ్యాలకోసం ఒత్తిడులు రావచ్చు. జాగ్రత్తగా మసలుకోవాలి. అనుకున్న కార్యం నెరవేరుతుంది.ఆదాయం బాగుంటుంది.మంచి వార్తలు వింటారు. విష్ణు సహస్రనామం చదువుకోండి.

వృషభ రాశి:వారాంతానికి ఒక విషయంలో పరిస్థితి అర్థమవుతుంది.అన్నీ బాగున్నా కొద్దిగా ఆందోళన కలుగుతూ ఉంటుంది.భావుకత వలన ఇబ్బందులు ఉంటాయి. శ్రీసూక్తం చదవండి.

మిథున రాశి:బంధువుల కలయిక వలన ఉల్లాసంగా గడుపుతారు.ఆలోచనలు కలసి వస్తాయి. పాదాలలో చర్మ సమస్యలు ఉండవచ్చు. దీర్ఘకాల భవిష్యత్ ప్రణాలికలకు మంచి వారం.దుర్గా సప్తశ్లోకీ చదవండి.

కర్కాటక రాశి:కవులకు మంచి గుర్తింపు లభించే వారం. ఈ వారం వ్యంగ్యంగా మాట్లాడే ధోరణి అరికట్టాలి. తత్వ చింతన పెరుగుతుంది. అతిగా ఖర్చులు చేస్తారు. సుబ్రహ్మణ్య కవచం చదవండి.

సింహ రాశి:భూ వివాదాలు తొలగుతాయి. మీ దగర అపులు చేసిన వారు తిరిగి ఇచ్చే ఆలోచనకు వస్తారు. స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రధ్ధ వహించాలి. విందు వినోదాలు ఉన్నాయి.ఆదిత్య హృదయం చదవండి.

కన్య రాశి: ఆలోచించి మాట్లాడాలి. వివాదాలలో చిక్కుకునే అవకాశాలున్నాయి.ఆదాయం బాగుంది.నిదానంగా పనులు పూర్తి అవుతాయి.అదృష్టం కలసి వస్తుంది. లక్ష్మీ అష్టోత్తరం చదవండి.

తుల రాశి:మీకు మంచి యోగాలు సంభవించే కాలం దగ్గరలోనే ఉంది.ఉద్యోగంలో మార్పులు ఉండవచ్చును.పది మంది అన్న మాటను వ్యతిరేకిస్తారు. తాత్కాలికంగా ఏదో సాధించామనుకుంటారు.ధ్యాన మార్గం అవలంబించండి.

వృశ్చిక రాశి: కొంత కాలంగా కలవరపెడుతున్న వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది.పెద్దలు సహాయపడతారు. ఎక్కువగా ఆలోచించకండి. ఆడ పిల్లలు అభివృధ్ధిలోకి వస్తారు. శ్రీ దత్తస్తవం చదవండి.

ధను రాశి:చుట్టూ ఉన్న వారు తొందర పెడతారు. మీ స్థిరమైన మన్సుకు ఒక పరీక్ష కాలం. కలవరపడకండి.మిత్రులు మంచి మాటలు చెబుతారు. దృష్టి దోషం బాధిస్తుంది. ద్వారం ఎదురుగా సింహవాహిని దుర్గ పటం ఉంచండి.

మకర రాశి: వారం మంచి ఆలోచనలతో ప్రారంభమవుతుంది. సమస్యలను పరిష్కరించుకునేందుకు మంచి వారం.కుటుంబం పట్ల శ్రధ్ధ వహించాలి.పై అధికారి స్త్రీ అయినప్పుడు వ్యవహారం లో జాగ్రత్త వహించాలి. శివునికి అభిషేకం చేయించండి.

కుంభ రాశి: ఇంటిలోని వారు మంచి అభివృధ్ధిలోకి వస్తారు. గతంలో మీరు చేసిన పెట్టుబడులు లాభిస్తాయి.సంఘంలో గౌరవం పెరుగుతుంది.ఇటీవల మీరు చేసిన సాంగత్యం మంచి ఫలితాలను ఇవ్వనుంది.హనుమాన్ చాలీసా చదవండి.

మీన రాశి: పిల్లలు అభివృధ్ధిలోకి వస్తారు.స్త్రీలు, గాయనీమణులు కొత్త అవకాశాలు పొందనున్నారు. విదేశి వ్యవహారాలు లాభిస్తాయి. కళ్లకు పరీక్ష అవసరం కావచ్చు. పదోన్నతి ఉన్నది. కులదైవాన్ని కొలవండి.

ఈ వారం మంచి మాట:

స్లో: యథా నదీనదాస్సర్వే సాగరే యాంతి సంస్థితం
     తథైవాశ్రమిణస్సర్వే గృహస్థే యాంతి సంస్థితం
(మనుస్మృతి)

నదీ నదములన్నియును సముద్రములోనికి పోయి అక్కడ నిలచిపోవునో అట్లే మిగిలిన ఆశ్రమముల వారందరు గృహస్థుని ఆశ్రయించి సుఖముగ మనుచున్నారు.
 

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~

(Predictions based on Sun Signs can be seen by clicking www.sripatiastro.blogspot.com)

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “24 నుంచి 30 మే2009 వరకు రాశి ఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: