పురాణ కాలక్షేపం-వేదాంతం శ్రీపతి శర్మ


 

     ఓం గణానాం త్వా గణపతిం హవామహే
     కవిం కవీనాముపమశ్రవస్తమం
     జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
     ఆన: శృణ్వన్నూతిభి: సీదసాదనం

(ఋగ్వేదమంత్రము)

ఓంకారము సర్వమంగళదాయకము. ఓంకారము సగుణ గణేశ స్వరూపము. బ్రహ్మ పురాణములో నిర్గుణ తత్వము,బుధ్ధి తత్వము కంటే అతీతమైన గణేశ తత్వము వర్ణించబడినది. బ్రహ్మాణ్డ పురాణమందు సగుణ స్వరూపుడైన గణేశుని మాహాత్మ్యము ప్రతిపాదింపబడినది.

‘ విశేషేణ జగత్సామర్థ్యం హంతీతి విఘ్న: ‘

బ్రహ్మాదుల యందు గల జగత్సర్జనాది సామర్థ్యమును గూడ హననము (నాశము) చేయుదానిని విఘ్నము అంటారు.

‘ స్వకర్మణా తమభ్యర్చ్య సిధ్ధిం విందతి మానవ: ‘

సత్కర్మానుష్ఠానము వలన విశుధ్ధాంత:కరణుడైన పురుషునికి భగవత్తత్వ సాక్షాత్కారము కలుగును. వాని వలననే కాలము పరాజితమగును. 

ఈ రహస్యము తెలిసికొని కాలపురుధుడు సత్కర్మనాశమునకై విఘ్నరూపముగా ఉద్భవించెను. సత్కర్మానుష్ఠానరహిత ప్రపంచము సదా కాలాధీనమై యుండును. కాలస్వరూపుడైన విఘ్నాసురుడు శ్రీ గణేశుని వలన పరాజితుడయి ఆయనను శరణు పొందాడు.అప్పటి నుండి గణపతి పూజ, గణపతి స్మరణము లేక ఏ సత్కర్మ జరిగినను దాని యందు తప్పక విఘ్నము కలుగుతుంది.

బ్రహ్మాది సమస్తకార్య ప్రపంచము బ్రహ్మ విఘ్నములచే పరాభూతమగుట వలన గణేశానుగ్రహముచేత విఘ్న రహితులై కార్యనిర్వహణలో సమర్థులగుదురు. అందు చేత విఘ్నము, వినాయకుడు-ఇద్దరూ భగవత్స్వరూపులు, స్తుతింపదగు వారు. కావుననే-
‘ భగవంతౌ విఘ్నవినాయకౌ ప్రీయేతాం ‘ అని పుణ్యాహవచనమందు చెప్పబడును. విఘ్నము గణపతి వశమున గాక మరి ఎవరి వశమునను లేదు.
 

అందు చేత పూర్వోక్త ప్రమాణముల చేత నిర్ధారితమైన గణపతి తత్వమును శ్రధ్ధాయుక్తులై సమస్త కర్మములందు ఆరాధించ వలయును.పారలౌకికమైన తత్వనిర్ధారణమందు శాస్త్రము మాత్రమే ఆదరణీయము.

శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత యందు
‘ తస్మాఛ్చాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ,ఙ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మకర్తుమిహార్హసి ‘, అన్నాడు.
 
ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: