గురువారం క్విజ్(2)-వేదాంతం శ్రీపతి శర్మ


క్రిందటి వారం ప్రశ్నలు-సమాధానాలు

1.’ భద్రం కర్ణేభి: శృణుయామ దేవా: ‘ అను మంత్రం ఏ వేదంలోనిది?
(అథర్వణ వేదం)

2.పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఏ పక్షం? (శుక్ల పక్షం)
3.సంగీతానికి మూల గ్రంథమేది? (స్వరార్ణవం-గ్రంథం)
4.ఋగ్వేదంలోని మహావాక్యం ఏది? (ప్రఙ్ఞానం బ్రహ్మ)
5.తల్లి దండ్రులూ,బాంధవ్యాలూ అన్నీ మిథ్యలని చెప్పి శ్రీరాముని అయోధ్యకు తిరిగి వెళ్లమని ఎవరు పలికారు? (జాబాలి)
6.తమిళనాడు లోని శ్రీరంగ క్షేత్రం ఏ నది ఒడ్డున ఉన్నది? (కావేరి)
7.జటాయువు సోదరుడు ఎవరు? (సంపాతి)
8.సామవేదంలోని ఏ గాన పద్ధతిని సార్వత్రికముక పాడవచ్చును? (గ్రామ గేయం)

(గ్రామగేయం)

9.పాండవులు ద్రోణుడికి గురు దక్షిణగా ఇచ్చిన ఊరు ఈ రోజు ఎలా పిలువ బడుతున్నది?

(గుర్ గాన్వ్)

10.కార్తికేయుని ఆరు క్షేత్రములలో తిరుపతికి సమీపలో ఉన్నది ఏ

(తిరుత్తణి)

ఈ గురువారం (14.05.2009) క్విజ్:

1. యఙ్ఞముల లోని ప్రక్రియల వివరణము ఏ వేదభాగములో కనిపిస్తుంది?

2. సృష్టి లోని నీటిని యావత్తూ తనలో పెట్టుకుని ఆందోళణ సృష్టించిన దైత్యుడు ఎవరు?
3. సాంఖ్య శాస్త్రాన్ని మనకి ఎవరిచ్చారు?
4. స్వామిమలై ఎవరి క్షేత్రము?

5. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకు ఏ గ్రహం  అధిపతి?

6. ‘ సాధు, సత్యపరాక్రముడు ‘ అను మాటలు ఎవరి గురించి మనం వింటాము?
7. ‘ కిరీటి ‘ ఎవరికి మరో పేరు?

8. ‘ ఎందరో మహానుభావులు ‘ అను త్యాగరాజ కృతి ఏ అయిదు కృతులలో ఒకటి?
9. తరాజు చిహ్నంతో కనిపించు రాశి ఏది?

10. ఒక బాణం ఆకారంలో ఉండే 3 నక్షత్రాలని మనం ఏమని పిలుస్తాము?

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “గురువారం క్విజ్(2)-వేదాంతం శ్రీపతి శర్మ

  1. 1. ప్రతి వేదంలొ మూడొవ భాగమైన అరణ్యకాలలో
    2.
    3.
    4. ప్రాంతీయంగా స్వామినాథుడని పిలువబడే సుబ్రహ్మణ్యుడు
    5. ఇన,శశి,కుజ,రాహు,జీవ,మంద,జ్ఞ,కేతు,భ్రుగు – ఇతి నవాణాం కృత్తికాది క్రమేణ..!! – గురువు
    6. రామో విగ్రహవాన్ ధర్మః “సాధుః సత్య పరాక్రమః”
    రాజా సర్వస్య లోకస్య దేవానాం మాహావాన్ ఏవ
    7. అర్జునుడు
    8. పంచరత్న
    9. తుల
    10. ధనూ రాశి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: