‘పి-ఒ-కె ‘-వేదాంతం శ్రీపతి శర్మ


రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ‘జర్ర ‘ అని ఒకరిని జరిపి కూర్చోవటం చాలా మంది చేస్తూ ఉంటారు. నా మిత్రుడు రాజశేఖర్ ఈ విషయం లో సామాన్యుడు కాడు. ఒక సారి ఇతనితో కలసి అజంతా ఎక్స్ ప్రెస్ లో బాసర వెళుతున్నాను. జనరల్ బోగీ లో నిలబడి అటూ ఇటూ చూస్తున్నాము. నేను ఫెదర్ వ్వ్యిట్ చేంపియన్ అని సైడ్ సీటులో కూర్చున్న ఒక పెద్దాయన గుర్తించినట్లున్నాడు. నేను వార్ధక్యం లోకి వెళితే ఆయనలా ఉంటాననో లేక ఆయన వయసులో ఉన్నప్పుడు నాలా ఉండే వాడో ఏమో (అప్పుడు నాది కూడా మాంచి…అదీ సంగతి) మనకి తెలియదు. నన్ను కూర్చోమని చోటిచ్చాడు. రాజశేఖర్ ఆలోచించాడు. పైన ఒకాయన చక్కగా నిద్ర పోతున్నాడు. మారు మాట్లాడకుండా అక్కడికి ఎక్కి అతని కాళ్ల పక్కన కూర్చున్నాడు. బండీ పోతోంది. ఒక గంట తరువాత కళ్లు తెరచి చూశాను. ఆ పడుకుని ఉన్న వ్యక్తి తల వైపు ఇతను కాళ్లు పెట్టేసి కొద్దిగా కుడి వైపుకు ఒరిగి నిదురిస్తున్నాడు. కొద్దిగా లేచి ఆ వ్యక్తి వైపు చూశాను. అతను ఆయన కుడి వైపుకు ఒదిగి నిదురిస్తున్నాడు. బండీ పోతోంది…
మరో గంట తరువాత ఎందుకో మెలకువ వచ్చి చూశాను. ఆ వ్యక్తి లేచి కూర్చుని కింద పడేటట్లు కునుకుపాట్లు పడుతున్నాడు.ఇతను ఎలా సద్దుకున్నాడో తెలియదు, చక్కగా పూర్తిగా ఆక్రమించి అనంతునిలా శయనించాడు. కొద్ది సేపు అయిన తరువాత నా ప్రక్కన ఉన్న మనిషి దిగిపోవటంతో ఇతన్ని కిందకి పిలుద్దామా అని చూశాను. అవసరం లేదు! ఆ తూలుతున్న మనిషి ఎప్పుడో దిగిపోయాడు. దిగి నా పక్కన ఉన్న సీట్లో ఎవరో బామ్మగారు పడుకుని ఉంటే ఆవిడ పాదాల దగ్గర ఇరుక్కుని అతనిని ఆవహించిన నిద్రతో పాటు ప్రయాణం చేసేస్తున్నాడు…

‘ మీరెందుకు సార్, దిగిపోయారు?’
‘ దిగక? ఎలా వాలిపోయాడో చూడండి! పైగా ఆ బూట్లు…ఇంకేమి మాట్లాడతాం?’
‘ మీలో మంచి ఔదార్యం ఉంది సార్. అలాగే పడుకుని కాలక్షేపం చేయకుండా దిగిపోయారు…’
‘ ఔదార్యమా? ఇంకా నయ్యం. ఆ గురకకి చేయగలిగింది ఏమీ లేదు!’
అలా సాగిపోతూ బాసర రానే వచ్చింది. మా మిత్రుడూ దిగాడు.
‘ బాగా నిద్ర పట్టిందా?’, అడిగాను.
‘ ఫరవాలేదు. నా పక్కన పడుకున్నాయన ఒకటే కదులుతాడు. అదే సమస్య!’
అప్పటి వరకూ కళ్లు మూసుకుని ఉన్నాయన కళ్లు తెరచి తమాషాగా మొహం పెట్టాడు!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: